సాంస్కృతిక వారసత్వాన్ని, సైన్య శక్తిని చాటిన పరేడ్ అద్భుతం: ప్రధాన మంత్రి
January 26th, 03:41 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘గణతంత్ర దినోత్సవం 2025’ దృశ్యాల్ని పంచుకొంటూ, ఈ ఉత్సవం భారత్‌లో ఏకత్వంలో భిన్నత్వం ఎంతటి జవసత్వాలతో కళకళలాడుతోందీ కళ్లకు కట్టిందని అభివర్ణించారు. వైభవోపేతంగా సాగిన పరేడ్ మన సాంస్కృతిక వారసత్వాన్ని, సైన్య శక్తిని చాటిచెప్పిందని ఆయన అన్నారు.తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా...దేశంలోని తత్వవేత్తలు, కవులు, ఆలోచనాపరులలో ఒకరైన తిరువళ్లువర్ ను స్మరణకు తెచ్చుకుంటున్నాం: ప్రధాన మంత్రి
January 15th, 12:37 pm
నేడు తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా గొప్ప తమిళ తత్వవేత్త, కవి, ఆలోచనాపరుడు తిరువళ్లువర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్మరించుకున్నారు. తమిళ సంస్కృతి సారాన్నీ, మన తాత్విక వారసత్వాన్నీ తిరువళ్లువర్ గొప్ప పద్యాలు ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. “అజరామరమైన ఆయన కృతి ‘తిరుక్కురల్’ అనేక అంశాలపై లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తూ ప్రేరణకు దీప్తిగా నిలుస్తుంది” అని శ్రీ మోదీ తెలిపారు.జనవరి 15న మహారాష్ట్రలో ప్రధానమంత్రి పర్యటన
January 13th, 11:16 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జనవరి 15న మహారాష్ట్రలో పర్యటిస్తారు. ఆరోజు ఉదయం 10:30 గంటలకు ముంబయిలోని నావల్ డాక్ యార్డ్ లో మూడు ఫ్రంట్ లైన్ నేవీ యుద్ధ నౌకలు- ఐఎన్ ఎస్ సూరత్, ఐఎన్ ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ ఎస్ వాఘ్షీర్ లను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు నవీ ముంబయిలోని ఖార్ఘర్ లో ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభిస్తారు.జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జనవరి 12న జరగనున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో పాల్గొననున్న ప్రధాని
January 10th, 09:21 pm
\స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జరుపుకొంటున్న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జనవరి 12న ఉదయం 10 గంటలకు దిల్లీలోని భారత్ మండపంలో జరిగే వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే 3,000 మంది ప్రతిభావంతులైన యువ నాయకులతో ఆయన సంభాషించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.We are not just the Mother of Democracy; democracy is an integral part of our lives: PM
January 09th, 10:15 am
PM Modi inaugurated the 18th Pravasi Bharatiya Divas convention in Bhubaneswar, Odisha. Expressing his heartfelt gratitude to the Indian diaspora and thanking them for giving him the opportunity to hold his head high with pride on the global stage, Shri Modi highlighted that over the past decade, he had met numerous world leaders, all of whom have praised the Indian diaspora for their social values and contributions to their respective societies.ఒడిశాలో 18వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
January 09th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ప్రవాసీ భారతీయులకు శ్రీ మోదీ స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ప్రారంభ గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించే ప్రవాసీ భారతీయ కార్యక్రమాల్లో పాడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రవాసీ భారతీయుల భావాలను, భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ గ్రామీ పురస్కార విజేత కళాకారుడు శ్రీ రికీ కేజ్‌నూ, ఆయన సహ కళాకారులనూ ప్రధాని ప్రశంసించారు.జనవరి 4న న్యూఢిల్లీలో గ్రామీణ భారత్ మహోత్సవ్ – 2025ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
January 03rd, 05:56 pm
గ్రామీణ భారత్ మహోత్సవ్-2025ను జనవరి 4 ఉదయం 10.30గం.ల ప్రాంతంలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో ఆయన ప్రసంగిస్తారు.స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో పాల్గొనే విద్యార్థులతో డిసెంబర్ 11న ప్రధానమంత్రి మాటామంతీ
December 09th, 07:38 pm
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024లో భాగంగా గ్రాండ్ ఫినాలేని 2024 డిసెంబర్ 11న నిర్వహించనున్నారు. ఆ పోటీలో పాల్గొంటున్న యువ నూతన ఆవిష్కర్తలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాయంత్రం సుమారు 4:30 గంటలకు దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు. గ్రాండ్ ఫినాలేలో 1300 మందికి పైగా విద్యార్థి బృందాలు పాలుపంచుకోనున్నాయి. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
December 07th, 05:52 pm
పవిత్రమైన కార్యకర్ సువర్ణ మహోత్సవం సందర్భంగా, భగవాన్ స్వామి నారాయణుని పాదాలకు వినమ్రతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురు హరి ప్రగత్ బ్రహ్మ స్వరూపమైన ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి ఈ రోజు. ఆయనకు కూడా భక్తితో నమస్కరిస్తున్నాను. పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్ చేస్తున్న నిర్విరామ కృషి, అంకిత భావం ద్వారానే భగవాన్ స్వామి నారాయణుడి బోధనలు, ప్రముఖ్ స్వామి మహరాజ్ తీర్మానాలు ఈ రోజు నిజరూపం దాలుస్తున్నాయి. లక్ష మంది వాలంటీర్లు, యువత, చిన్నారులు భాగం పంచుకుంటున్న ఈ అద్బుతమైన సాంస్కృతిక కార్యక్రమం విత్తనం, చెట్టు, ఫలం అనే భావనను అందంగా సూచిస్తోంది. నేను అక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ, ఈ కార్యక్రమ ఉత్సాహాన్ని, శక్తినీ నా హృదయం అనుభూతి చెందుతోంది. ఇంత గొప్ప దైవిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, మహనీయులైన సాధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినయంగా నమస్కరిస్తున్నాను.అహమదాబాద్ లో కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 07th, 05:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్‌లో ఏర్పాటైన కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మొదట పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, ఆరాధనీయులైన సాధు సంతులకు, సత్సంగి కుటుంబ సభ్యులకు, ఇతర ప్రముఖులకు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ చరణాలకు శ్రీ మోదీ ప్రణామాన్ని ఆచరించారు. ఈ రోజు ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి సందర్భం కూడా అని ప్రధాని గుర్తుకు తీసుకువచ్చారు. భగవాన్ స్వామి నారాయణ్ ప్రబోధాలు, ప్రముఖ్ స్వామి మహారాజ్ సంకల్పాలు పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్ కఠోర శ్రమతో, అంకితభావం తో నెరవేరుతున్నాయని కూడా శ్రీ మోదీ అన్నారు. సుమారు ఒక లక్షమంది కార్యకర్తలతోపాటు యువతీయువకులు, బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇదెంత భారీ కార్యక్రమమో చెప్పకనే చెబుతోందని, దీనిని చూడడం తనకు సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు. తాను సభాస్థలిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఈ కార్యక్రమంలో ఉత్సాహాతిరేకం ఏ స్థాయిలో వెల్లువెత్తుతోందీ తనకు తెలుస్తూనే ఉందన్నారు. పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, సాధువులందరికీ ఈ భవ్య దివ్య కార్యక్రమానికిగాను ఆయన తన అభినందనలను అందజేశారు.భారతీయ చరిత్రన్నా, సంస్కృతన్నా ప్రపంచంలో ఉత్సాహం వ్యక్తమవుతున్నందుకు సంతోషంగా ఉంది: ప్రధానమంత్రి
November 28th, 05:31 pm
భారతీయ చరిత్ర, సంస్కృతుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉత్సాహం వ్యక్తమవుతూ ఉన్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని ప్రకటించారు. భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పాత్రమవుతోందని ఆయన అన్నారు. తన విదేశీ పర్యటనల దృశ్యాలను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ షేర్ చేస్తూ మన సంస్కృతి అన్నా, మన చరిత్ర అన్నా ఎనలేని ఉత్సాహం వ్యక్తమవుతూ ఉండడం హర్షణీయమన్నారు.అభివృద్ధి, వారసత్వంతో ముందుకు సాగిపోయేందుకు కట్టుబడి ఉన్నాం: ప్రధాన మంత్రి
November 12th, 07:05 am
ఇగాస్ పండుగ సందర్భంగా పౌరులందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి, వారసత్వంల మేలికలయికతో మునుముందుకు సాగిపోయేందుకు దేశం కంకణం కట్టుకొందని ఆయన వ్యాఖ్యానించారు. మరీ ముఖ్యంగా ఉత్తరాఖండ్ పౌరులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఇగాస్ పండుగ వారసత్వం మరింతగా వర్ధిల్లగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.ప్రముఖ నృత్యకారుడు, సాంస్కృతిక మణిదీపం శ్రీ కనకరాజు మృతికి ప్రధానమంత్రి సంతాపం
October 26th, 10:36 am
ప్రముఖ నృత్యకారుడు, సాంస్కృతిక మణిదీపం శ్రీ కనకరాజు మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలియచేశారు. గుస్సాడీ నృత్యానికి ఆయన చేసిన సమున్నతమైన సేవలను, అంకిత భావాన్ని శ్రీ మోదీ కొనియాడారు. సాంస్కృతిక వారసత్వ చిహ్నలేవీ వాటి స్వాభావిక స్వరూపాన్ని కోల్పోకూడదన్న ఆయన తపనను ప్రశంసించారు.అంతర్జాతీయ అభిధమ్మ దివస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 17th, 10:05 am
సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీ కిరణ్ రిజిజు జీ, భదంత్ రాహుల్ బోధి మహాథెరో జీ, గౌరవ జాంగ్‌చుప్ చోడెన్ జీ, మహాసంఘ గౌరవ సభ్యులు, ప్రముఖులు, దౌత్య సంఘం సభ్యులు, బౌద్ధ పండితులు, బుద్ధుని బోధనలను ఆచరిస్తున్నవారు, సోదరసోదరీమణులారా.అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 17th, 10:00 am
అంతర్జాతీయ అభిధమ్మ దివస్ వేడుకలు, ప్రాచీన భాషగా పాళీకి గుర్తింపు వచ్చిన సందర్భంగానూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. అభిధమ్మను బోధించిన అనంతరం స్వర్గం నుంచి బుద్ధుడు తిరిగి వచ్చిన రోజును అభిధమ్మ దివస్‌గా పాటిస్తారు. బుద్ధుని అభిధమ్మ బోధనలు పాళీ భాషలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాచీన భాషగా పాళీకి ఇటీవల దక్కిన గుర్తింపు... ఈ ఏడాది అభిధమ్మ దివస్ వేడుకల ప్రాధాన్యాన్ని పెంచింది.మరాఠీ, పాలీ, ప్రాకృత, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదా కల్పించేందుకు మంత్రివర్గం ఆమోదం
October 03rd, 09:38 pm
మరాఠీ, పాలీ, ప్రాకృత, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన భాష హోదాను కల్పించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. భారతదేశం లోతైన, ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రాచీన భాషలు సంరక్షణగా ఉండడంతో పాటు వివిధ సామజిక చారిత్రక, సాంస్కృతిక విజయాల సారాన్ని ప్రతిబింబిస్తాయి.శాస్త్రీయ నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి మృతికి ప్రధానమంత్రి సంతాపం
August 04th, 02:14 pm
భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి డాక్టర్ యామిని కృష్ణమూర్తి మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివారం (2024 ఆగస్టు 4న) సంతాపం తెలిపారు.The new Nalanda University would initiate the golden age of India: PM Modi in Bihar
June 19th, 10:31 am
PM Modi inaugurated the new campus of Nalanda University at Rajgir, Bihar. “Nalanda is not just a name, it is an identity, a regard. Nalanda is the root, it is the mantra. Nalanda is the proclamation of the truth that knowledge cannot be destroyed even though books would burn in a fire,”, the PM exclaimed. He underlined that the establishment of the new Nalanda University would initiate the golden age of India.బిహార్, రాజ్‌గిర్ లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయ క్యాంపస్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
June 19th, 10:30 am
బిహార్, రాజ్‌గిర్ లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయ క్యాంపస్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభమైంది. భారతదేశం, తూర్పు ఆసియా శిఖరాగ్ర దేశాలు కలిసి ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రారంభోత్పవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 17 దేశాల మిషన్స్ అధ్యక్షుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఒక మొక్కను నాటారు.Your vote on Lotus button on 26th April will strengthen the ongoing movement against corruption: PM in Attingal
April 15th, 11:35 am
In his second rally at Attingal, PM Modi said, The BJP has announced in its Sankalp Patra that we will connect global tourists with our heritage and confer World Heritage status on our heritage. There is a great possibility of this happening in Kerala. The BJP's plan is the overall development of major tourist destinations. The BJP will also establish new centers for eco-tourism in Kerala. This will greatly benefit our tribal families by creating opportunities for them. The BJP government will also provide financial help to women for homestays.”