ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రితో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భేటీ
November 21st, 10:42 pm
గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 20వ తేదీన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి శ్రీ కీత్ రౌలీతో సమావేశమయ్యారు.బార్బడోస్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ
November 21st, 09:13 am
బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్-కేరికోమ్ శిఖరాగ్ర సమావేశాన్ని గయానాలోని జార్జ్‌టౌన్‌లో నవంబరు 20న నిర్వహించిన సందర్భంగా వారిరువురు సమావేశమయ్యారు. భారత- బార్బడోస్‌ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ఘాటించడంతోపాటు ఆ సంబంధాలను బల పరచడానికి ఇద్దరు నేతలకు ఒక అవకాశాన్ని ఈ ఉన్నతస్థాయి సమావేశం అందించింది.టెక్నాలజీ పరంగా ఆరోగ్య రంగంలో భారతదేశం చురుగ్గా పని చేస్తోంది: ప్రధానమంత్రి
November 20th, 05:02 am
ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యాన్ని ఇచ్చినప్పుడే భూమి మేలైన ఆవాసంగా మారుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. టెక్నాలజీని సమన్వయ పరచడానికి ప్రథమ ప్రాధాన్యాన్ని ఇస్తూ, ఆరోగ్య సంరక్షణ రంగంలో భారతదేశం క్రియాశీలంగా ముందుకు సాగిపోతోందని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రపంచమంతటా జరుగుతున్న కృషిని భారత్ బలపరుస్తుందని ఆయన ప్రధానంగా చెప్పారు.PM Modi meets with President of Indonesia
November 19th, 06:09 am
PM Modi and Indonesia’s President Prabowo Subianto met at the G20 Summit in Rio. They discussed strengthening their Comprehensive Strategic Partnership, focusing on trade, defence, connectivity, tourism, health, and people-to-people ties. Both leaders agreed to celebrate 75 years of diplomatic relations in 2024. They also exchanged views on global and regional issues, highlighting the concerns of the Global South and reviewed cooperation within G20 and ASEAN.ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న ప్రధానమంత్రి
October 28th, 12:47 pm
ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్య రంగానికి చెందిన సుమారు రూ.12,850 కోట్ల ప్రాజెక్టులకు అక్టోబర్ 29వ తేదీన మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ)లో ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.జర్మనీ ఛాన్సలర్ భారత పర్యటన నేపథ్యంలో ఉభయ ప్రభుత్వాల మధ్య 7 వ దఫా సంప్రదింపులు: ఒప్పందాల జాబితా
October 25th, 07:47 pm
మ్యాక్స్-ప్లాంక్-గెసెల్షాఫ్ట్ ఈ.వీ. (ఎంపీజీ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్ (ఐసీటీఎస్), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)ల మధ్య అవగాహన ఒప్పందంలావో పిడిఆర్ లోని వియంటియాన్ లో జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం- తెలుగు అనువాదం
October 10th, 02:35 pm
పదేళ్ల క్రితం నేను భారత్ 'యాక్ట్ ఈస్ట్' పాలసీని ప్రకటించాను. గత దశాబ్దకాలంగా, ఈ చొరవ భారత్- ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను పునరుజ్జీవింపజేసింది, వాటికి కొత్త శక్తి, దిశ , వేగాన్ని నింపింది.లావో పిడిఆర్ లోని వియంటియాన్ లో జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం- తెలుగు అనువాదం
October 10th, 02:30 pm
పదేళ్ల క్రితం నేను భారత్ 'యాక్ట్ ఈస్ట్' పాలసీని ప్రకటించాను. గత దశాబ్దకాలంగా, ఈ చొరవ భారత్- ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను పునరుజ్జీవింపజేసింది, వాటికి కొత్త శక్తి, దిశ , వేగాన్ని నింపింది.రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం
October 09th, 04:28 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రూ.4,406 కోట్ల పెట్టుబడితో 2,280 కి.మీ. రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపారు.జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన... ప్రారంభోత్సవం.. జాతికి అంకితం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 02nd, 02:15 pm
గౌరవనీయులైన జార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరురులు శ్రీ జుయల్ ఓరమ్, జార్ఖండ్ ప్రియ పుత్రిక అన్నపూర్ణా దేవి గారు, శ్రీ దుర్గాదాస్ ఉయికీ, ఈ నియోజకవర్గ ఎంపీ శ్రీ మనీష్ జైస్వాల్, రాంచీ ఎంపీ శ్రీ సంజయ్ సేథ్, కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రజాప్రతినిధులు, నా సోదర సోదరీమణులారా!జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో రూ.80,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన... ప్రారంభం
October 02nd, 02:10 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో రూ.80,000 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ధర్తీ ఆబా జన్‌జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్’ను ప్రారంభించారు. 40 ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల (ఇఎంఆర్ఎస్)కు ప్రారంభోత్సవంతోపాటు మరో 25 స్కూళ్లకు శంకుస్థాపన కూడా చేశారు. అలాగే ‘ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పిఎం-జన్మన్) కింద అనేక ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.అక్టోబరు 2న ప్రధానమంత్రి జార్ఖండ్ పర్యటన
September 30th, 05:09 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 2వ తేదీన జార్ఖండ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం దాదాపు 2 గంటల సమయంలో ప్రధానమంత్రి జార్ఖండ్ లోని హజారీబాగ్ లో రూ. 83,300 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు, కొన్నింటిని ప్రారంభిస్తారు.వాస్తవ పత్రం (ఫ్యాక్ట్ షీట్) : 2024 క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు
September 22nd, 12:06 pm
సెప్టెంబర్ 21, 2024 న, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ డెలావేర్ లోని విల్మింగ్టన్ లో నాల్గవ క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫ్యూమియో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లకు ఆతిథ్యం ఇచ్చారు.సమాచార పట్టిక: ఇండో-పసిఫిక్‌లో క్యాన్సర్‌ను తగ్గించడానికి క్యాన్సర్ మూన్ షాట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన క్వాడ్ దేశాలు
September 22nd, 12:03 pm
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో క్యాన్సర్‌ను అంతం చేయటంలో పురోగతి సాధించేందుకు అద్భుతమైన కార్యక్రమాన్ని క్వాడ్ దేశాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ప్రధాన ఆరోగ్య సంక్షోభంగా కొనసాగుతున్న, చాలావరకు నివారించదగిన వ్యాధి అయిన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌పై ఈ కార్యక్రమం పనిచేయనుంది. ఈ ఒక్క రకం క్యాన్సర్‌తో మొదలైన ఈ కార్యకమం ఇతర క్యాన్సర్ల సమస్యను కూడా పరిష్కరించేందుకు పునాది వేయనుంది. క్వాడ్ నేతల శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న విస్తృత నిర్ణయాల్లో ఈ కార్యక్రమం ఒకటిగా ఉంది.ఉమ్మడి వాస్తవ పత్రం: సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణను కొనసాగించనున్న అమెరికా, ఇండియా
September 22nd, 12:00 pm
అమెరికా, భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యమని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే అద్భుత అజెండాను నిశ్చయాత్మకంగా ముందుకు తెస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.విల్మింగ్టన్ డిక్లరేషన్‌పై ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికా నేతల సంయుక్త ప్రకటన
September 22nd, 11:51 am
ఈరోజు, అమెరికా అధ్యక్షులు జోసెఫ్ ఆర్.బిడెన్ జూనియర్ తన స్వస్థలమైన డెలావేర్‌లోని విల్మింగ్టన్లో ఆతిథ్యమిచ్చిన క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సులోఆయనతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని కిషిదా ఫుమియో సమావేశమయ్యాం .ప్రధానమంత్రి జన్ జతీయ గ్రామ్ అభియాన్‌కు మంత్రి మండలి ఆమోదం రూ.79,156 కోట్లతో 63,000కు పైగా గిరిజన మెజారిటీ గ్రామాలు,
September 18th, 03:20 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి జన్ జతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్‌కు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.79,156 కోట్లతో (కేంద్ర ప్రభుత్వ వాటా: రూ.56,333 కోట్లు, రాష్ట్రాల వాటా: రూ. 22,823 కోట్లు) తీసుకొచ్చిన ఈ పథకాన్ని గిరిజన మెజారిటీ గ్రామాలు, ఆకాంక్షిత జిల్లాల్లోని గిరిజన ఆవాస ప్రాంతాల్లో అమలు చేయనున్నారు.మరింత వాతావరణ అనుకూలమైన, వాతావరణ-స్మార్ట్ భారత్‌ను రూపొందించడానికి 'మిషన్ మౌసమ్'కు మంత్రివర్గం ఆమోదం
September 11th, 08:19 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండేళ్లలో రూ.2000 కోట్ల వ్యయంతో మిషన్ మౌసమ్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 వరకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన- IV అమలుకు కేబినెట్ ఆమోదం
September 11th, 08:16 pm
2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన -4 (పీఎంజీఎస్ వై-4) అమలు కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ప్రతిపాదనపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.ఉక్రెయిన్ కు భిష్మ్ క్యూబులను బహూకరించిన ప్రధానమంత్రి
August 23rd, 06:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉక్రెయిన్ ప్రభుత్వానికి నాలుగు భిష్మ్ (సహయోగ్ హిత, మైత్రికి భారత ఆరోగ్య కార్యక్రమం) క్యూబులను బహూకరించారు. ఈ మానవతాపూర్వకమైన సహాయం అందించినందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ జెలెన్ స్కీ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. క్షతగాత్రులకు వేగంగా చికిత్స అందించేందుకు తద్వారా విలువైన ప్రాణాలు కాపాడేందుకు ఈ క్యూబులు ఉపయోగపడతాయి.