అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు తాలూకు ఫేజ్- 2, సూరత్ మెట్రో ప్రాజెక్టు ల భూమి పూజ సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

January 18th, 10:30 am

గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ‌ ఆచార్య దేవ‌వ్ర‌త్ గారు, కేంద్ర మంత్రిమండలి లో నా స‌హ‌చ‌రులు అమిత్ శాహ్ గారు, హ‌ర్ దీప్ సింగ్ పురీ గారు, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపాణీ గారు, గుజ‌రాత్ ప్ర‌భుత్వ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అహమదాబాద్ కు, సూర‌త్ కు చెందిన నా ప్రియమైన సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా, న‌మ‌స్కారం.

అహ‌మ‌దాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో ద‌శ‌ కు, సూర‌త్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు భూమి పూజ చేసిన ప్ర‌ధాన మంత్రి

January 18th, 10:30 am

అహమ‌దాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో ద‌శ‌ కు, సూర‌త్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ‌వారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా భూమి పూజ ను నిర్వహించారు. ఈ సందర్భం లో గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్‌, కేంద్ర హోమ్ మంత్రి, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ల‌తో పాటు కేంద్ర గృహ నిర్మాణం & ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కూడా హాజరయ్యారు.

హజీరా వద్ద రో-పాక్స్ టెర్మినల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

November 08th, 10:51 am

ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభం అవడం ద్వారా ఆ ప్రాంతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వ్యాపారానుకూల వాతావరణం), ఈజ్ ఆఫ్ లివింగ్ (ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం)లో ఎలాంటి సానుకూల మార్పు వస్తుందో చెప్పడానికి ఈ ప్రాజెక్టు ఓ చక్కటి ఉదాహరణ. ఇప్పుడే నాకు నలుగురైదుగురు సోదరులు, సోదరీమణులతో మాట్లాడేందుకు అవకాశం లభించింది. తీర్థయాత్రల విషయంలో, వారి వాహనాలకు తక్కువ నష్టం జరగడం, తక్కువ సమయంలో ప్రయాణం పూర్తవడం, వ్యవసాయ ఉత్పత్తి పెరగడం, వ్యవసాయంలో నష్టాన్ని తగ్గించడం, స్వచ్ఛమైన పళ్లు, కూరగాయల ఉత్పత్తి.. సూరత్ మార్కెట్‌కు తరలించడం వంటి సౌకర్యాలను వారు నాతో పంచుకున్నారు. దీని వల్ల వ్యాపార సౌలభ్యం పెరగడంతోపాటు పనుల్లో వేగం పెరుగుతుంది. మొత్తంమీద సంతోషకర వాతావరణం ఏర్పుడుతుందని నేను విశ్వసిస్తున్నాను. వ్యాపారులు, చిరువ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు, రైతులు, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన అనుసంధానతతో లబ్ధి పొందబోతున్నారు. మనవారి మధ్య దూరం తగ్గుతున్నకొద్దీ మనస్సు సంతృప్తి లభిస్తుంది.

హ‌జారియా ఆర్‌.ఒ. -పాక్స్ టెర్మిన‌ల్ ను ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి.

November 08th, 10:50 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ హజారియాలో ఆర్ఒ-పాక్స్ టెర్మిన‌ల్‌ను, హ‌జారియా,- గుజ‌రాత్‌లోని ఘోఘా మ‌ధ్య ఆర్ ఒ -పాక్స్ ఫెర్రి స‌ర్వీసును జెండా ఊపి వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్థానికంగా ఈ సేవ‌ల‌ను ఉప‌యోగించుకునే వారితో మాట్లాడారు. షిప్పింగ్ మంత్రిత్వ‌శాఖ‌ను మినిస్ట్రీ ఆఫ్ పొర్ట్స్‌, షిప్పింగ్‌, వాట‌ర్‌వేస్‌గా మార్పు చేశారు.

హ‌జీరా లో రో-పాక్స్ టర్మిన‌ల్‌ ను ఈ నెల 8న ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన మంత్రి; హ‌జీరా, ఘోఘా ల మ‌ధ్య రో-పాక్స్ ఫెరీ సేవ‌కు ఆయ‌న ప‌చ్చజెండా‌ను చూపి ప్రారంభిస్తారు

November 06th, 03:41 pm

హ‌జీరా లో ప్రారంభిస్తున్న రో-పాక్స్ టర్మిన‌ల్ 100 మీట‌ర్ల పొడ‌వుతో, 40 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఉంటుంది. దీని నిర్మాణానికి సుమారుగా 25 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌ు కానుంది. ప‌రిపాల‌న కార్య‌ల‌య భవనం, వాహ‌నాల‌ను నిలిపి ఉంచేందుకు స్థ‌లం, స‌బ్ స్టేశన్‌, వాట‌ర్ ట‌వ‌ర్ మొదలైన విస్తృత శ్రేణి సౌకర్యాలు ఈ టర్మినల్ లో ఉంటాయి.