భారతీయ డాక్టర్ ఒకరి తో అఫ్ గానిస్తాన్ రాయబారి కి ఎదురైన అనుభవాన్ని గురించి ఒక ట్వీట్ లో వివరించిన ప్రధాన మంత్రి
July 01st, 05:17 pm
భారతదేశం లో అఫ్ గానిస్తాన్ రాయబారి శ్రీ ఫరీద్ మామున్‌జయ్ ట్వీట్ పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒక వ్యాఖ్య ను చేశారు. భారతదేశం లో ఒక డాక్టర్ వద్ద కు అఫ్‌గాన్ రాయబారి వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు తన రోగి భారతదేశం లో అఫ్‌గాన్ రాయబారి అనే సంగతి ని తెలుసుకొని ఒక సోదరుని వద్ద నుంచి తాను రుసుము ను వసూలు చేయనని చెప్తూ ఎలాంటి రుసుము ను తీసుకోవడానికి నిరాకరించారని ఆయన మనసు ను కదలించి వేసేటటువంటి విషయాన్ని ఆ ట్వీట్ లో పోస్టు చేశారు. ఆ ట్వీట్ హిందీ బాష లో ఉంది. రాయబారి ప్రస్తావించిన ఈ సంఘటన భారతదేశం-అఫ్‌గానిస్తాన్ సంబంధాల పరిమళాన్ని విరజిమ్ముతోందని ప్రధాన మంత్రి అభివర్ణించారు.హరిపుర లో రేపటి కార్యక్రమం మన దేశానికి నేతాజీ బోస్ అందించిన తోడ్పాటుకు ఒక ప్రశంస అవుతుంది: ప్రధాన మంత్రి
January 22nd, 07:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ గారికి రేపు నేతాజీ జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి సమర్పించారు. ‘‘రేపటి రోజున మహనీయుడు నేతాజీ సుభాశ్ చంద్ర బోస్ గారి జయంతి కి గుర్తుగా #ParakramDivas భారతదేశం జరుపుకోనుంది. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న వివిధ కార్యక్రమాల లో భాగం గా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని గుజరాత్ లోని హరిపుర లో నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంటకు ఆరంభమయ్యే ఆ కార్యక్రమం లో భాగస్తులు కండి.