
We are not just the Mother of Democracy; democracy is an integral part of our lives: PM
January 09th, 10:15 am
PM Modi inaugurated the 18th Pravasi Bharatiya Divas convention in Bhubaneswar, Odisha. Expressing his heartfelt gratitude to the Indian diaspora and thanking them for giving him the opportunity to hold his head high with pride on the global stage, Shri Modi highlighted that over the past decade, he had met numerous world leaders, all of whom have praised the Indian diaspora for their social values and contributions to their respective societies.
ఒడిశాలో 18వ ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
January 09th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 18వ ప్రవాసీ భారతీయ దివస్ సమ్మేళనాన్ని ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఈ రోజు ప్రారంభించారు. ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, ప్రవాసీ భారతీయులకు శ్రీ మోదీ స్వాగతం పలుకుతూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ప్రారంభ గీతాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిర్వహించే ప్రవాసీ భారతీయ కార్యక్రమాల్లో పాడతారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రవాసీ భారతీయుల భావాలను, భావోద్వేగాలను ప్రతిబింబిస్తూ గ్రామీ పురస్కార విజేత కళాకారుడు శ్రీ రికీ కేజ్‌నూ, ఆయన సహ కళాకారులనూ ప్రధాని ప్రశంసించారు.
భారత కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం
December 23rd, 09:24 pm
మూడు నాలుగు రోజుల కిందటే కేంద్ర మంత్రి అయిన నా సహచరుడు జార్జ్ కురియన్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాను. ఈవేళ మీ అందరి మధ్య ఉన్నందుకు సంతోషిస్తున్నాను. భారత క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (సీబీసీఐ) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా క్రిస్మస్ వేడుకలో మీ అందరినీ కలిసే అవకాశం నాకు లభించింది. ఇది మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా నిలవబోతోంది. సీబీసీఐ స్థాపించి 80 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ వేడుక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ సందర్భంగా సీబీసీఐకి, దానితో సంబంధమున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
December 23rd, 09:11 pm
క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ), న్యూడిల్లీలోని సీబీసీఐ కేంద్రం ఆవరణలో ఈ రోజు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. క్యాథలిక్ చర్చి ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ తరహా కార్య్రమానికి ఓ ప్రధానమంత్రి హాజరు కావడం ఇదే తొలిసారి. కార్డినల్స్, బిషప్‌లు, చర్చిలో ప్రధాన నాయకులతో పాటు క్రైస్తవ సమాజానికి చెందిన ముఖ్యమైనవారితో ప్రధాని సంభాషించారు.PM Modi thanks President of Guyana for his support to 'Ek Ped Maa ke Naam' initiative
November 25th, 10:39 am
The Prime Minister, Shri Narendra Modi today thanked Dr. Irfaan Ali, the President of Guyana for his support to Ek Ped Maa Ke Naam initiative. Shri Modi reiterated about his appreciation to the Indian community in Guyana in yesterday’s Mann Ki Baat episode.We are working fast in every sector for the development of Odisha: PM Modi at Odisha Parba 2024
November 24th, 08:48 pm
PM Modi addressed Odisha Parba 2024, celebrating Odisha's rich cultural heritage. He paid tribute to Swabhaba Kabi Gangadhar Meher on his centenary, along with saints like Dasia Bauri, Salabega, and Jagannath Das. Highlighting Odisha's role in preserving India's cultural persity, he shared the inspiring tale of Lord Jagannath leading a battle and emphasized faith, unity, and pine guidance in every endeavor.ఒడిశా పర్వ 2024 ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
November 24th, 08:30 pm
న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ‘ఒడిశా పర్వ 2024’ ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు హాజరైన ఒడిశా సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదితో స్వభావ్ కవి గంగాధర్ మెహర్ మరణించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భక్త దసియా భౌరీ, భక్త సాలబేగ, భగవద్గీతను ఒడియాలో రచించిన శ్రీ జగన్నాథ్ దాస్‌కు సైతం ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.భారతీయ ప్రవాసులు వివిధ దేశాల్లో తమదైన ముద్ర వేశారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 24th, 11:30 am
మన్ కీ బాత్ యొక్క 116వ ఎపిసోడ్‌లో, పీఎం మోదీ ఎన్సిసి డే యొక్క ప్రాముఖ్యతను చర్చించారు, ఎన్సిసి క్యాడెట్ల పెరుగుదల మరియు విపత్తు సహాయంలో వారి పాత్రను హైలైట్ చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం యువత సాధికారతను నొక్కి, వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ గురించి మాట్లాడారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను నావిగేట్ చేయడంలో సీనియర్ సిటిజన్‌లకు యువత సహాయం చేయడం మరియు ఏక్ పెద్ మా కే నామ్ క్యాంపెయిన్ విజయాన్ని కూడా ఆయన పంచుకున్నారు.గయానాలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారులను కలిసిన ప్రధానమంత్రి
November 22nd, 05:31 am
గయానాలో ప్రముఖ క్రికెట్ క్రీడాకారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. భారతదేశానికి, గయానాకు మధ్య ఆత్మీయతను క్రికెట్ పెంచిందని, రెండు దేశాల సాంస్కృతిక సంబంధాలను బల పరిచిందని ప్రధాని వ్యాఖ్యానించారు.ఆర్య సమాజ్ స్మృతి చిహ్నం వద్ద ప్రధాని నివాళి
November 22nd, 03:09 am
గయానా లోని జార్జ్ టౌన్ లో ఉన్న ఆర్య సమాజ్ స్మృతి చిహ్నం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. గయానాలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో వారి కృషి, పాత్ర ప్రశంసనీయమని శ్రీ మోదీ కొనియాడారు. స్వామి దయానంద సరస్వతి 200వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది చాలా ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు.గయానాలో భారత సంస్కృతీ సంప్రదాయాలు వర్ధిల్లుతున్నాయి: ప్రధాన మంత్రి
November 22nd, 03:06 am
భారత్-గయానా సాంస్కృతిక సంబంధాన్ని బలోపేతం చేయడంలో స్వామి అక్షరానంద విశేష కృషి చేస్తున్నారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. సరస్వతీ విద్యా నికేతన్ పాఠశాలను సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. గయానాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు వర్ధిల్లుతున్నాయని వ్యాఖ్యానించారు.గయానాలోని భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
November 22nd, 03:02 am
మీ అందరితో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనతోపాటు ఇక్కడకు వచ్చినందుకు ముందుగా ఇర్ఫాన్ అలీ గారికి కృతజ్ఞతలు. వచ్చినదగ్గర నుంచీ నాపట్ల మీరు చూపిన ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను ఇంటికి ఆహ్వానించిన అధ్యక్షులు అలీ గారికి కృతజ్ఞతలు. నన్ను ఆత్మీయుడిగా భావించిన వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. ఆతిధిమర్యాదలు మన సంస్కృతిలో అంతర్భాగం. గత రెండు రోజులుగా ఇదే జ్ఞాపకానికి వస్తోంది. అధ్యక్షులు అలీగారు, వారి మామ్మగారు కూడా మొక్క నాటారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మేం చేపట్టిన ఉద్యమంలో అది భాగం. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం అని దానికి అర్థం. ఈ భావోద్వేగ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.గయానాలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం గయానాలోని ప్రవాస భారతీయులు అనేక రంగాలను ప్రభావితం చేస్తూ గయానా అభివృద్ధికి దోహదపడ్డారు: ప్రధానమంత్రి
November 22nd, 03:00 am
గయానాలోని జార్జ్ టౌన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ, ప్రధాని మార్క్ ఫిలిప్స్, ఉపాధ్యక్షుడు భర్రాత్ జగ్దేవ్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ రామోతార్ తదితరులు పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షుడికి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన రాక సందర్భంగా ప్రత్యేక ఆప్యాయతతో ఘనస్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై చూపిన ఆప్యాయతానురాగాలపై అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. “ఆతిథ్య స్ఫూర్తి మన సంస్కృతికి కేంద్ర బిందువు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు, ఆయన మామ్మగారితో కలిసి తాను ఓ మొక్క నాటానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే భావోద్వేగభరితమైన క్షణాలన్నారు.సురినామ్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ
November 21st, 10:57 pm
గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండవ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సురినామ్ దేశాధ్యక్షుడు శ్రీ చంద్రికాపర్సాద్ సంతోఖీతో నవంబర్ 20వ తేదీన భేటీ అయ్యారు.గ్రెనడా ప్రధానమంత్రితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 21st, 10:44 pm
గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో, నవంబర్ 20వ తేదీన గ్రెనడా ప్రధానమంత్రి శ్రీ డికన్ మిచెల్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రితో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భేటీ
November 21st, 10:42 pm
గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 20వ తేదీన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి శ్రీ కీత్ రౌలీతో సమావేశమయ్యారు.భారత ఆగమన స్మృతి చిహ్నాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
November 21st, 10:00 pm
జార్జ్ టౌన్ లోని స్మారకోద్యానవనంలో భారత ఆగమన స్మృతిచిహ్నాన్ని ప్రధానమంత్రి సందర్శించారు. ఆయన వెంట గయానా ప్రధానమంత్రి బ్రిగేడియర్ (విశ్రాంత) మార్క్ ఫిలిప్స్ ఉన్నారు. అక్కడ పూలమాలలు వేసి నివాళి అర్పించిన ప్రధానమంత్రికి టస్సా డోలు బృందం స్వాగతం పలికింది. స్మృతిచిహ్నం వద్ద నివాళి అర్పించిన ప్రధానమంత్రి.. గయానాలోని భారత సంతతికి చెందిన వారి పోరాటాన్నీ, త్యాగాలనూ.. గయానాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడంలో వారి విశేష కృషినీ గుర్తుచేసుకున్నారు. స్మృతిచిహ్నం వద్ద ఆయన బేల్ పత్ర మొక్క నాటారు.మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ప్రధానమంత్రి
November 21st, 09:57 pm
గయానాలోని జార్జ్ టౌన్ లో ఉన్న చారిత్రక విహారోద్యానవనంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. బాపూ బోధించిన శాంతి, అహింసా విలువలను గుర్తుచేసుకున్న ఆయన.. అవి మానవాళికి ఎప్పటికీ దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయన్నారు. గాంధీజీ శతజయంతి సందర్భంగా 1969లో ఆ విగ్రహాన్ని అక్కడ నెలకొల్పారు.డొమినికా ప్రధానమంత్రిని కలిసిన భారత ప్రధానమంత్రి
November 21st, 09:29 pm
భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా గయానాలోని జార్జ్ టౌన్‌లో డొమినికా ప్రధానమంత్రి శ్రీ రూజ్‌వెల్ట్ స్కెరిట్‌తో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi
November 21st, 08:00 pm
Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.