గురేజ్ లోయ లో భారతీయ సైన్యం మరియు బిఎస్ఎఫ్ జవాన్లతో దీపావళి పండుగను జరుపుకొన్న ప్రధాన మంత్రి
October 19th, 02:27 pm
జమ్ము & కశ్మీర్ లోని నియంత్రణ రేఖకు సమీపంలో నెలకొన్న గురేజ్ లోయ ప్రాంతంలో భారతీయ సైన్యానికి మరియు బిఎస్ఎఫ్ కు చెందిన జవాన్లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దీపావళి పండుగను జరుపుకొన్నారు. అక్కడ ఆయన సుమారు రెండు గంటల సేపు గడిపారు. ప్రధాన మంత్రి సరిహద్దులలో జవాన్లతో కలసి దీపావళిని జరుపుకోవడం ఇప్పటికి ఇది వరుసగా నాలుగో సారి.