వాక్సినేషన్ లో ఫ్ట్రంట్‌లైన్ వర్కర్లకు ప్రాధాన్యత నివ్వడం ద్వారా ఇండియా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. : ప‌్రధానమంత్రి
January 16th, 03:22 pm
కరోనాపై పోరాటం సమయంలో దేశ ప్రజలు బలమైన నిస్వార్ధ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ప్రదర్శించారని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 వాక్సిన్ కార్యక్రమాన్నిఈరోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన సంవత్సరంలో భారతీయులు వ్యక్తులుగా, కుటుంబాలుగా, ఒక దేశంగా ఎంతో నేర్చుకున్నారని ప్రధానమంత్రి అన్నారు. ప్రముఖ తెలుగు కవి గురజాడ వెంకట అప్పారావు మాటలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, మనం ఎప్పుడూ నిస్వార్ధంగా ఇతరుల కోసం పనిచేయాలన్నారు.