వ‌ర‌ల్డ్ స‌స్‌టేన‌బుల్ డివెల‌ప్‌మెంట్ స‌మిట్ (డ‌బ్ల్యుఎస్‌డిఎస్ 2018) ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

February 16th, 11:30 am

‘వ‌ర‌ల్డ్ స‌స్‌టేన‌బుల్ డివెల‌ప్‌మెంట్ స‌మిట్’ ప్రారంభ సంద‌ర్భంగా ఇక్క‌డకు రావ‌డం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. విదేశాల నుండి వ‌చ్చి మ‌మ్మ‌ల్ని క‌లుసుకున్న వారంద‌రికీ భార‌త‌దేశానికి స్వాగతం. అలాగే వారికి ఢిల్లీ లోకీ సుస్వాగ‌తం.