మహారాష్ట్రలోని గోండియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని సంతాపం
November 29th, 04:54 pm
మహారాష్ట్రలోని గోండియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు సంతాపం తెలిపారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మరణించిన వారి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్-గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.