Modernization of agriculture systems is a must for Viksit Bharat: PM Modi

February 24th, 10:36 am

PM Modi inaugurated and laid the foundation stone of multiple key initiatives for the Cooperative sector at Bharat Mandapam, New Delhi. Recalling his experience as CM of Gujarat, the Prime Minister cited the success stories of Amul and Lijjat Papad as the power of cooperatives and also highlighted the central role of women in these enterprises.

సహకార రంగానికి చెందిన పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన పిఎం

February 24th, 10:35 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార రంగానికి చెందిన అనేక కీలక ప్రాజెక్టులకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 24వ తేదీన శంకుస్థాపన చేసి కొన్నింటిని ప్రారంభించారు. 11 రాష్ర్టాలకు చెందిన 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల్లో (పిఏసిఎస్) ‘‘సహకార రంగంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన నిల్వ వసతుల నిర్మాణ ప్రణాళిక’’ కింద ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే దేశవ్యాప్తంగా మరో 500 పిఏసిఎస్ లలో గిడ్డంగులు, ఇతర వ్యవసాయ మౌలిక వసతుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీని వల్ల ఆహార ధాన్యాలు నిల్వ చేసే పిఏసిఎస్ గిడ్డంగులన్నీ ఆహార సరఫరా వ్యవస్థతో నిరంతరాయంగా అనుసంధానం అవుతాయి. నబార్డ్ మద్దతుతో జాతీయ సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ సిడిసి) నాయకత్వంలో సమన్వయపూర్వక కృషితో దేశంలో ఆహార సరఫరా వ్యవస్థ పటిష్ఠం చేయడంతో పాటు, దేశ ఆర్థికాభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఎఐఎఫ్), వ్యవసాయ మార్కెటింగ్ మౌలిక వసతులు (ఎఎంఐ) వంటి పథకాలన్నింటికీ ఒక్కటిగా చేయడం ద్వారా ఈ కొత్త ప్రాజెక్టును అమలుపరుస్తున్నారు. మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమం కింద అందుబాటులో ఉన్న సబ్సిడీలు, వడ్డీ రాయితీలు వంటివి పిఏసిఎస్ లు ఉపయోగించుకుని ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు వీలు కలుగుతుంది. అలాగే ‘‘సహకార్ సే సమృద్ధి’’ అనే విజన్ కు దీటుగా సహకార వ్యవస్థను పునరుజ్జీవింపచేసి; చిన్నకారు, సన్నకారు రైతులను సాధికారం చేసేందుకు దేశవ్యాప్తంగా 18,000 పిఏసిఎస్ ల కంప్యూటరీకరణ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.

Amul has become the symbol of the strength of the Pashupalaks of India: PM Modi

February 22nd, 11:30 am

Prime Minister Narendra Modi participated in the Golden Jubilee celebration of the Gujarat Cooperative Milk Marketing Federation (GCMMF) at Narendra Modi Stadium in Motera, Ahmedabad. Addressing the gathering, the Prime Minister congratulated everyone for the Golden Jubilee celebration of Gujarat Cooperative Milk Marketing Federation (GCMMF) and said that a sapling that was planted 50 years ago by the farmers of Gujarat has become a giant tree with branches all over the world

గుజరాత్లోని అహ్మాదాబాద్లో , గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ ఫెడరేషన్ స్వర్ణోత్సవాలలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

February 22nd, 10:44 am

ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ, గుజరాత్‌ సహకార పాల మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జిసిఎంఎంఎఫ్‌) స్వర్ణోత్సవాలలో పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని మొతేరాలో గల శ్రీనరేంద్రమోదీ స్టేడియంలో ఈ స్వర్ణోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆసక్తిగా తిలకించారు.అనంతరం ప్రధానమంత్రి , స్వర్ణోత్సవాల సందర్భంగా కాఫీటేబుల్‌ బుక్‌ను ఆవిష్కరించారు. జిసిఎంఎంఎఫ్‌ సహకార రంగం శక్తికి , రైతుల పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచంలోనే బలమైన బ్రాండ్‌గా అమూల్‌ నిలిచింది.

గుజరాత్ లోని దియోదర్ లో బనస్ డెయిరీలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

April 19th, 11:02 am

మీరంతా బాగున్నారని భావిస్తాను. నేను హిందీలో ప్రసంగించాల్సివచ్చినందుకు మొదట మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. కాని మీడియా మిత్రులు హిందీలో నేను మాట్లాడితే బాగుంటుందని అభ్యర్థించారు గనుక వారి అభ్యర్థనను మన్నించాలని నేను నిర్ణయించాను.

బనాస్ కాంఠా లోని దియోదర్ లో బనాస్ డెయరి సంకుల్ లో అనేక అభివృద్ధి పథకాలను దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి; మరికొన్ని అభివృద్ధి పథకాల కు ఆయనశంకుస్థాపన చేశారు

April 19th, 11:01 am

గుజరాత్ లోని బనాస్ కాంఠా జిల్లా లో గల దియోదర్ లో 600 కోట్ల రూపాయల కు పైగా ఖర్చు తో నిర్మాణం జరిగిన ఒక కొత్త డెయరి కాంప్లెక్స్ ను మరియు బంగాళాదుంపల ప్రోసెసింగ్ ప్లాంటు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ నూతన డెయరి కాంప్లెక్స్ ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు గా ఉంది. ఇది రోజు కు దాదాపు 30 లక్షల లీటర్ ల పాల ను ప్రోసెస్ చేయడానికి, సుమారు 80 టన్నుల వెన్న ను, ఒక లక్ష లీటర్ ల ఐస్ క్రీమ్ ను, 20 టన్నుల ఘనీకృత పాల (ఖోయా) ను మరియు 6 టన్నుల చాక్ లెట్ ల ఉత్పత్తి కి వీలు కల్పిస్తుంది. పొటాటో ప్రోసెసింగ్ ప్లాంటు లో ఫ్రెంచ్ ఫ్రైజ్, ఆలూ చిప్స్, ఆలూ టిక్కీ, పేటీ లు మొదలైన ప్రోసెస్డ్ పొటాటో ప్రోడక్ట్ స్ ను తయారు చేసేందుకు ఏర్పాటు లు ఉన్నాయి. వీటి లో చాలా వరకు ఇతర దేశాల కు ఎగుమతి అవుతాయి. ఈ ప్లాంటు లు స్థానిక రైతుల కు సాధికారిత ను కల్పించి, ఆ ప్రాంతం లోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ను బలపరుస్తాయి. బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేశను ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు. వ్యవసాయాని కి, పశుపాలన కు సంబంధించిన విజ్ఞాన శాస్త్ర సంబంధమైనటువంటి సమాచారాన్ని రైతుల కు అందించడం కోసం ఈ సాముదాయిక రేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేయడమైంది.

ఏప్రిల్ 18 నుంచి 20 వ‌ర‌కు ప్ర‌ధాన‌మంత్రి గుజ‌రాత్ సంద‌ర్శ‌న

April 16th, 02:36 pm

ఏప్రిల్ 18 నుంచి 20 తేదీల మ‌ధ్య‌న ప్ర‌ధాన‌మంత్రి గుజ‌రాత్ సంద‌ర్శిస్తున్నారు. 18వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు గాంధీన‌గ‌ర్ లో పాఠ‌శాల‌ల క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ ను సంద‌ర్శిస్తారు. 19వ తేదీ ఉద‌యం 9.40కి బ‌న‌స్కాంత‌లోని దియోద‌ర్ లో సంకుల్ వ‌ద్ద బ‌న‌స్ డెయిరీకి శంకుస్థాప‌న చేసి ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌ను జాతికి అంకితం చేస్తారు. మ‌ధ్యాహ్నం 3.30కి జామ్ న‌గ‌ర్ లో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ గ్లోబ‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రెడిష‌న‌ల్ మెడిసిన్ కు శంకుస్థాప‌న చేస్తారు. 20వ తేదీ ఉద‌యం 10.30కి గాంధీన‌గ‌ర్ లో గ్లోబ‌ల్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నోవేష‌న్ స‌ద‌స్సును ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభిస్తారు. మ‌ధ్యాహ్నం 3.30కి ద‌హోద్ లో జ‌రుగ‌నున్న ఆదిజాతి మ‌హా స‌మ్మేళ‌న్ లో పాల్గొన‌డంతో పాటు ప‌లు అభివృద్ధి ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేస్తారు.