బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్, టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవం మరియు బోయింగ్ సుకన్య ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
January 19th, 03:15 pm
కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ గారు, ముఖ్యమంత్రి శ్రీ సిద్దరామయ్య గారు, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, ఆర్ అశోక్ గారు, భారతదేశంలో బోయింగ్ కంపెనీ సిఒఒ స్టెఫానీ పోప్, ఇతర పరిశ్రమ భాగస్వాములు, మహిళలు మరియు పెద్దమనుషులు!అత్యధునాతనమైన బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ కేంపస్ ను కర్నాటక లోని బెంగళూరు లోప్రారంభించిన ప్రధాన మంత్రి
January 19th, 02:52 pm
అత్యధునాతనమైనటువంటి బోయింగ్ ఇండియా ఇంజినీరింగ్ & టెక్నాలజీ సెంటర్ (బిఐఇటిసి) కేంపసు ను కర్నాటక లోని బెంగళూరు లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. 1,600 కోట్ల రూపాయల పెట్టుబడి తో నిర్మాణం పూర్తి అయిన ఈ 43 ఎకరాల విస్తీర్ణం లో ఏర్పాటైన కేంపస్ యుఎస్ఎ కు వెలుపల బోయింగ్ పెట్టిన అతి పెద్ద పెట్టుబడి అని చెప్పాలి. శరవేగం గా వృద్ధి చెందుతున్నటువంటి దేశ విమానయాన రంగం లో భారతదేశం లో వివిధ ప్రాంతాల యువతులు అధిక సంఖ్య లో ప్రవేశించడాని కి వీలుగా వారిని ప్రోత్సహించాలన్న లక్ష్యం తో రూపుదిద్దిన బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు.