గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ స‌ద‌స్సు 2021 ప్రారంభ స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

November 18th, 03:57 pm

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగం ప్రాధాన్య‌త‌ను వెలుగులోకి తెచ్చింది. గ‌త రెండేళ్లుగా జీవ‌న‌శైలి కావ‌చ్చు, ఔష‌ధాలు, మెడిక‌ల్ టెక్నాల‌జీ, వ్యాక్సిన్లు స‌హా ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగానికి చెందిన‌ అన్ని అంశాలూ ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించాయి. భార‌త ఫార్మాస్యూటిక‌ల్ ప‌రిశ్ర‌మ కూడా స‌వాలును దీటుగా ఎదుర్కొనేందుకు స‌మాయ‌త్తం అయింది.

ఔషధ రంగ తొలి ప్రపంచ ఆవిష్కరణ సదస్సును ప్రారంభించిన ప్రధానమంత్రి

November 18th, 03:56 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఔషధ రంగానికి సంబంధించిన తొలి ‘ప్రపంచ ఆవిష్కరణ సదస్సు’ను ప్రారంభించారు. కేంద్ర మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- ఈ మహమ్మారి ఔషధ రంగంపై నిశిత దృష్టి సారించేలా చేసింది. జీవనశైలి అయినా… మందులైనా… వైద్య సాంకేతికత అయినా.. టీకా అయినా.. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రతి అంశం గడచిన రెండేళ్లుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో భార‌త ఔష‌ధ ప‌రిశ్ర‌మ కూడా సదరు స‌వాలుకు దీటుగా ఎదిగిందని ప్రధానమంత్రి అన్నారు. ఆ మేరకు “భారత ఆరోగ్య సంరక్షణ రంగం సముపార్జించిన ప్రపంచవ్యాప్త విశ్వాసమే ఇటీవలి కాలంలో భారతదేశానికి ‘ప్రపంచ ఔషధ కేంద్రం’గా పేరు తెచ్చింది” అని శ్రీ మోదీ అన్నారు.

నవంబర్ 18న ఔషధ నిర్మాణ సంబంధి రంగపు తొలి గ్లోబల్ ఇనొవేశన్ సమిట్ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

November 16th, 07:26 pm

ఔషధ నిర్మాణ సంబంధి రంగం యొక్క ఒకటో గ్లోబల్ ఇనొవేశన్ సమిట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 18న సాయంత్రం 4 గంటల కువీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.