గుజ‌రాత్, గాంధీన‌గ‌ర్ లో రీ ఇన్వెస్ట్ 2024 కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌సంగం

September 16th, 11:30 am

జర్మనీ ఆర్థిక సహకార మంత్రి , డెన్మార్క్ పరిశ్రమల వ్యాపార మంత్రితో సహా విదేశాల నుండి వ‌చ్చిన‌ విశిష్ట అతిథులూ , నా మంత్రి మండ‌లి స‌భ్యులు ప్రహ్లాద్ జోషి జీ, శ్రీపాద్ నాయక్ జీ , ప‌లు దేశాల నుండి వ‌చ్చిన ప్రతినిధులు...

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన (రీ-ఇన్వెస్ట్)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం

September 16th, 11:11 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్‌లో ‘ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన’ (రీ-ఇన్వెస్ట్)ను ప్రారంభించారు. మన దేశం 200 గిగావాట్ల శిలాజేతర ఇంధన స్ధాపిత సామర్థ్యం సాధించడంలో సహకరించిన కీలక భాగస్వాములను ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత్ సత్కరిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ రంగ కంపెనీలు, అంకుర సంస్థలు, ప్రధాన పారిశ్రామిక సంస్థలలో అత్యాధునిక ఆవిష్కరణలతో సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ తిలకించారు.

ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం

August 30th, 12:00 pm

ఇటీవలే జన్మాష్టమిని జరుపుకున్న దేశం ప్రస్తుతం పండుగ వాతావరణం లో ఉంది. మన ఆర్థిక వ్యవస్థలోనూ, మార్కెట్లలోనూ పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంబర వాతావరణంలోనే మనం గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నాం, అలాంటి కార్యక్రమానికి కలల నగరమైన ముంబై కంటే మంచి ప్రదేశం ఏముంటుంది. దేశం నలుమూలల నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, స్వాగతం. ఇక్కడికి రాకముందు వివిధ ప్రదర్శనలను సందర్శించే అవకాశం, పలువురు మిత్రులతో మమేకమయ్యే అవకాశం లభించింది. అక్కడ, మన యువత నాయకత్వంలో, భవిష్యత్తు అవకాశాలతో నిండిన కొత్త ఆవిష్కరణల ప్రపంచాన్ని నేను చూశాను. మీ పనికి అనుగుణంగా, మరో మాటలో చెప్పాలంటే: నిజంగా ఒక కొత్త ప్రపంచం ఆవిర్భవిస్తోంది. ఈ ఉత్సవ నిర్వాహకులను, పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను.

ముంబైలో గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌(జీఎఫ్ఎఫ్‌) 2024లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం

August 30th, 11:15 am

మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో ఉన్న జియో వ‌రల్డ్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఇవాళ జ‌రిగిన గ్లోబ‌ల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌ (జీఎఫ్ఎఫ్‌) 2024లో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను సైతం ప్ర‌ధాన‌మంత్రి సంద‌ర్శించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా, ఫిన్‌టెక్ క‌న్వ‌ర్జెన్స్ కౌన్సిల్ క‌లిసి జీఎఫ్ఎఫ్‌ను సంయుక్తంగా నిర్వ‌హించాయి. ఫిన్‌టెక్ రంగంలో భార‌త్ సామ‌ర్థ్యాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంతో పాటు ఈ రంగంలోని కీల‌క భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను ఒక్క‌చోట‌కు చేర్చ‌డ‌మే ఈ కార్య‌క్ర‌మం ల‌క్ష్యం.

ఆగస్టు 30న మహారాష్ట్రను సందర్శించనున్న ప్రధానమంత్రి

August 29th, 04:47 pm

మహారాష్ట్ర లోని పాల్‌ఘర్, ముంబయిలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 30వ తేదీన సందర్శించనున్నారు. ఉదయం దాదాపు 11 గంటలకు ప్రధాన మంత్రి ముంబయి లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటరుకు చేరుకొని గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ (జిఎఫ్ఎఫ్) కార్యక్రమంలో పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రధానమంత్రి పాల్‌ఘర్ లోని సిఐడిసిఒ మైదానానికి చేరుకొని, వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభించి, శంకుస్థాపనలు చేస్తారు.