రెండో గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమిట్ ప్రారంభ సమావేశం లో ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
May 12th, 08:58 pm
కోవిడ్ మహమ్మారి జన జీవనాల కు, సరఫరా వ్యవస్థల కు అంతరాయాలను కలిగిస్తూనే ఉంది; సముదాయాల ప్రతిఘాతుకత్వాని కి అది పరీక్షలు పెడుతూనే ఉంది. భారతదేశం లో మేం మహమ్మారి కి వ్యతిరేకం గా ప్రజల ను కేంద్ర స్థానం లో ఉంచిన వ్యూహాన్ని అనుసరిస్తున్నాం. మేం మా వార్షిక ఆరోగ్య సంరక్షణ బడ్జెటు కు ఇదివరకు ఎన్నడూ చేయనంత అధిక కేటాయింపు ను చేశాం.రెండో గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమిట్ లో పాలుపంచుకున్న ప్రధాన మంత్రి
May 12th, 06:35 pm
యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసఫ్ ఆర్. బైడెన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రెండో గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమిట్ లో పాలుపంచుకొన్నారు. ‘మహమ్మారి యొక్క అలసట ను అడ్డుకోవడం మరియు సన్నాహాల కు ప్రాధాన్యాల ను నిర్ణయించడం’ ఇతివృత్తం పై ఏర్పాటైన ఈ శిఖర సమ్మేళనం తాలూకు ప్రారంభ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగించారు.