‘ప్రపంచ పౌరులతో ప్రత్యక్షంగా’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో ప్రసంగ పాఠం
September 25th, 10:31 pm
ఈ చురుకైన, యువ సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించడంపై నేనెంతో సంతోషిస్తున్నాను. మన భూగోళంలోని సుందర వైవిధ్యభరిత అంతర్జాతీయ కుటుంబం ఇప్పుడు నా కళ్లముందుంది. ప్రపంచాన్ని ఏకం చేయడానికి ‘అంతర్జాతీయ పౌర ఉద్యమం’ సంగీతాన్ని, సృజనాత్మకతలను ఉపకరణాలుగా వినియోగిస్తోంది. క్రీడల తరహాలోనే అందర్నీ ఏకం చేయగల సహజ సామర్థ్యం సంగీతానికీ ఉంది. అందుకే మహనీయుడైన హెన్రీ డేవిడ్ థోరూ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యను ఉటంకిస్తున్నాను. ‘‘నేను సంగీతం వింటున్నపుడు ఎంతటి ప్రమాదం వచ్చిపడినా నాకు భయం వేయదు.. నేను ముప్పులకు అతీతుణ్ని.. నాకు శత్రువులెవరూ కనిపించరు.. నేను ప్రాచీన-ఆధునిక కాలాలు రెండింటికీ చెందినవాడినని భావిస్తాను’’ అని ఆయన అన్నారు. సంగీతం మన జీవితాల్లో ప్రశాంతతను ప్రభావితం చేస్తుంది. మన మనసునే కాకుండా శరీరం మొత్తాన్నీ నిశ్చల స్థితిలోకి తీసుకెళ్తుంది. భారత దేశం అనేక సంగీత సంప్రదాయాల నిలయం. ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతంలో దేనికదే ప్రత్యేకమైన సంగీత శైలీ సంప్రదాయాలున్నాయి. ఒకసారి భారతదేశాన్ని సందర్శించి, మా సంగీత సంప్రదాయాల ఉత్తేజాన్ని, వైవిధ్యాన్ని చవిచూడాలని మిమ్మల్నందర్నీ నేను ఆహ్వానిస్తున్నాను.గ్లోబల్ సిటిజెన్ లైవ్" కార్యక్రమంలో ప్రధానమంత్రి వీడియో ప్రసంగం
September 25th, 10:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25, 26 తేదీల్లో జరిగే “గ్లోబల్ సిటిజెన్ లైవ్” సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ లో మాట్లాడారు. ఇందులో భాగంగా ముంబై, న్యూయార్క్, పారిస్, రియో డి జనీరో, సిడ్నీ, లాస్ ఏంజెలిస్, లాగోస్, సియోల్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఈ లైవ్ సమావేశాలు నిర్వహించనున్నారు.సెప్టెంబర్ 25 న ‘గ్లోబల్ సిటిజన్ లైవ్’ కార్యక్రమం లో వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
September 24th, 05:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 25 న సాయంత్రం పూట జరిగే ‘గ్లోబల్ సిటిజన్ లైవ్’ కార్యక్రమం లో వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.