
23 ఫిబ్రవరి 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 119 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 23rd, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతోంది. ప్రతిచోటా క్రికెట్ వాతావరణం ఉంది. క్రికెట్‌లో సెంచరీ థ్రిల్ ఏమిటో మనందరికీ బాగా తెలుసు. ఈ రోజు నేను మీతో క్రికెట్ గురించి మాట్లాడను. కానీ భారతదేశం అంతరిక్షంలో చేసిన అద్భుతమైన సెంచరీ గురించి మాట్లాడతాను. గత నెలలో ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని దేశం యావత్తూ తిలకించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు. అంతరిక్ష రంగంలో కొత్త శిఖరాలను చేరుకోవాలనే మన సంకల్పాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. మన అంతరిక్ష రంగ ప్రయాణం చాలా సాధారణ రీతిలో ప్రారంభమైంది. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. అయినా మన శాస్త్రవేత్తలు ముందుకు సాగుతూ, విజయం సాధించారు. కాలక్రమేణా అంతరిక్ష రంగ ప్రయాణంలో మన విజయాల జాబితా చాలా పెద్దదిగా మారింది. అది ప్రయోగ వాహన తయారీ కావచ్చు. చంద్రయాన్, మంగళయాన్, ఆదిత్య ఎల్-1 విజయం కావచ్చు. ఒకే రాకెట్‌తో ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే అపూర్వమైన కృషి కావచ్చు. ఏదైనా ఇస్రో విజయాల పరిధి చాలా పెద్దది. గత 10 సంవత్సరాలలోనే దాదాపు 460 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇందులో ఇతర దేశాలకు చెందిన అనేక ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో మనం గమనిస్తోన్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన అంతరిక్ష శాస్త్రవేత్తల బృందంలో మహిళా శక్తి భాగస్వామ్యం నిరంతరం పెరుగుతోంది. ఈ రోజు అంతరిక్ష రంగం మన యువతకు ఇష్టమైనదిగా మారడం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ ప్రాంతంలో స్టార్టప్‌లు, ప్రైవేట్ రంగ అంతరిక్ష సంస్థల సంఖ్య వందలకు చేరుకుంటుందని కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉంటారు! జీవితంలో ఉత్కంఠభరితమైన, ఉత్తేజకరమైన పని ఏదైనా చేయాలనుకునే మన యువతకు అంతరిక్ష రంగం ఒక అద్భుతమైన ఎంపికగా మారుతోంది.
వర్చువల్ జీ-20 సదస్సులో ప్రధాని ముగింపు ప్రకటన (నవంబర్ 22, 2023)
November 22nd, 09:39 pm
మీ విలువైన ఆలోచనలన్నింటినీ మరోసారి అభినందిస్తున్నాను. మీరు ఓపెన్ మైండ్ తో మాట్లాడినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
వర్చువల్ జి-20 లీడర్స్ సమిట్ (నవంబర్ 22, 2023 )లో ప్రధాన మంత్రి ప్రారంభిక ప్రసంగం యొక్క అనువాదం
November 22nd, 06:37 pm
నా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి, ఈ రోజు న జరుగుతున్న ఈ శిఖర సమ్మేళనం లో మీరంతా పాలుపంచుకొంటున్నందుకు గాను మీ అందరి కీ నేను నా యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను. 140 కోట్ల మంది భారతీయుల పక్షాన మీ అందరి కి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం.