జి-20 విద్య మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియోమాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశం పాఠం

June 22nd, 11:00 am

జి-20 విద్య శాఖ మంత్రుల సమావేశాని కి గాను భారతదేశాని కి మిమ్ముల ను నేను ఆహ్వానిస్తున్నాను. విద్య మన నాగరకత కు ఆధారభూతమైన పునాది ఒక్కటే కాదు, అది మానవ జాతి భవిష్యత్తు కు వాస్తుశిల్పి గా కూడా ను ఉంది. విద్య మంత్రులు గా, అందరి కి అభివృద్ధి, అందరి కి శాంతి మరియు అందరి కి సమృద్ధి లను సాధించి పెట్టడం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయాసల లో మానవ జాతి కి నాయకత్వం వహిస్తున్నటువంటి శెర్ పా గా మీరు ఉన్నారు. భారతదేశం యొక్క ధర్మ గ్రంథాల లో విద్య తాలూకు భూమిక ను ఆనందాన్ని ప్రసాదించేది అభివర్ణించడం జరిగింది. అది ‘‘విద్యా దదాతి వినయమ్, వినయద్ యాతి పాత్రతామ్. పాత్రత్వాత్ ధనమాప్నోతి ధనాద్ధర్మం, తతః సుఖమ్.’’ అని చెబుతుంది. ఈ మాటల కు ‘‘సిసలైనటువంటి జ్ఞానం అణకువ ను ఇస్తుంది. వినమ్రత నుండి యోగ్యత వస్తుంది. పాత్రత ఏ వ్యక్తి కి అయినా సంపద ను ప్రాప్తింప జేస్తుంది. సంపద ఏ వ్యక్తి ని అయినా సత్కార్యాల ను చేసే శక్తి ని అనుగ్రహిస్తుంది. మరి ఇదే ఆనందాన్ని కొనితెస్తుంది.’’ అని భావం. ఈ కారణం గా భారతదేశం లో మేం ఒక సమగ్రమైనటువంటి మరియు విస్తృత మైనటువంటి యాత్ర కు శుభారంభం చేశాం. మన యువతీ యువకుల కు మౌలిక అక్షరాస్యత అనేది ఒక బలమైన ఆధారం గా నిలుస్తుంది అని మేం విశ్వసిస్తున్నాం. మరి మేం దీని ని సాంకేతిక విజ్ఞానం తో కూడాను జోడిస్తున్నాం. దీనికి గాను మేం ‘‘నేశనల్ ఇనిశియేటివ్ ఫార్ ప్రఫిశన్సి ఇన్ రీడింగ్ విద్ అండర్ స్టాండింగ్ ఎండ్ న్యూమరసి’’ లేదా ‘‘నిపుణ్ భారత్’’ కార్యక్రమాన్ని ఆరంభించాం. ‘‘మౌలిక అక్షరాస్యత మరియు అంక జ్ఞానం’’ .. ఈ రెంటి ని మీ యొక్క సమూహం సైతం ప్రాధాన్య అంశం గా గుర్తించినందుకు నేను సంతోషిస్తున్నాను. మనం 2030 వ సంవత్సరాని కల్లా కాలబద్ధ రీతి లో దీని పై కృషి చేయాలి అనే ఒక సంకల్పాన్ని చెప్పుకొని తీరాలి.

జి20 విద్యా మంత్రుల సమావేశం ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం

June 22nd, 10:36 am

స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, విద్య అనేది మ‌న నాగ‌రిక‌త‌కు పునాది మాత్ర‌మే కాదు, మానవత్వం భవిష్యత్తు రూపురేఖలను తీర్చిదిద్దేది అని అన్నారు. ప్రధాన మంత్రి విద్యా మంత్రులను షెర్పాలు అని ప్రస్తావిస్తూ, అభివృద్ధి, శాంతి, అందరి శ్రేయస్సు కోసం మానవజాతి కృషిలో వారు నాయకత్వం వహిస్తున్నారని అన్నారు. ఆనందాన్ని తీసుకురావడంలో విద్య పాత్ర కీలకమని భారతీయ గ్రంథాలు వివరిస్తున్నాయని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. 'నిజమైన జ్ఞానం వినయాన్ని ఇస్తుంది, వినయం నుండి యోగ్యత వస్తుంది, యోగ్యత నుండి సంపద వస్తుంది, సంపద మనిషికి సత్కార్యాలు చేయడానికి వీలు కల్పిస్తుంది ఇదే సంతోషాన్ని ఇస్తుంది' అని అర్థం వచ్చే సంస్కృత శ్లోకాన్ని వినిపించారు ప్రధాన మంత్రి. సంపూర్ణ, సమగ్ర ప్రయాణం సాగిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘అండర్‌స్టాండింగ్, న్యూమరాసీతో చదవడంలో నైపుణ్యం కోసం జాతీయ చొరవ’ లేదా ‘నిపున్ భారత్’ చొరవను ఆయన ప్రస్తావించారు. ‘ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరాసీ’ని జి20 కూడా ప్రాధాన్యతగా గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 2030 నాటికి నిర్దిష్ట కాలానుగుణంగా పని చేయాలని కూడా ఆయన నొక్కి చెప్పారు.

గాంధీగ్రామ్ రూరల్ ఇన్‌స్టిట్యూట్, దిండిగల్ 36వ స్నాతకోత్సవ వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

November 11th, 04:20 pm

ఇక్కడ స్నాతకోత్సవానికి రావడం నాకు చాలా స్ఫూర్తిదాయకమైన అనుభవం. గాంధీగ్రామ్ ను మహాత్మా గాంధీ స్వయంగా ప్రారంభించారు. ప్రకృతి సౌందర్యం, స్థిరమైన గ్రామీణ జీవితం, సరళమైన కానీ మేధోపరమైన వాతావరణం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన మహాత్మాగాంధీ ఆలోచనల స్ఫూర్తిని ఇక్కడ చూడవచ్చు. నా యువ మిత్రులారా, మీరందరూ చాలా ముఖ్యమైన సమయంలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. గాంధేయ విలువలు చాలా సందర్భోచితంగా మారుతున్నాయి. సంఘర్షణలకు ముగింపు పలకడం, లేదా వాతావరణ సంక్షోభం గురించి కావచ్చు, మహాత్మా గాంధీ ఆలోచనలు నేటి జ్వలించే సమస్యలకు సమాధానాలు కలిగి ఉన్నాయి. గాంధేయ జీవన విధానంలో విద్యార్థులుగా, గొప్ప ప్రభావాన్ని చూపే గొప్ప అవకాశం మీకు ఉంది.

PM attends 36th Convocation Ceremony of Gandhigram Rural Institute at Dindigul, Tamil Nadu

November 11th, 04:16 pm

PM Modi attended the 36th Convocation Ceremony of Gandhigram Rural Institute at Dindigul in Tamil Nadu. The Prime Minister mentioned that Mahatma Gandhi’s ideals have become extremely relevant in today’s day and age, be it ending conflicts or climate crises, and his ideas have answers to many challenges that the world faces today.

Our G-20 mantra is - One Earth, One Family, One Future: PM Modi

November 08th, 07:31 pm

PM Modi unveiled the logo, theme and website of India’s G-20 Presidency. Remarking that the G-20 logo is not just any logo, the PM said that it is a message, a feeling that runs in India’s veins. He said, “It is a resolve that has been omnipresent in our thoughts through ‘Vasudhaiva Kutumbakam’. He further added that the thought of universal brotherhood is being reflected via the G-20 logo.

వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా భార‌త‌దేశ జి-20 అధ్య‌క్ష‌త థీమ్‌, వెబ్ సైట్‌, లోగోల‌ను ఆవిష్క‌రించిన ప్ర‌ధాన‌మంత్రి

November 08th, 04:29 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ భార‌త‌దేశ జి-20 అధ్య‌క్ష లోగో, థీమ్‌, వెబ్ సైట్ వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ఆవిష్క‌రించారు.

న్యూఢిల్లీలో పీఎం-కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ 2022 ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

October 17th, 11:11 am

ఎక్కడ చూసినా పండుగల ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి, దీపావళి తలుపు తడుతోంది. మరియు నేడు అలాంటి అవకాశం ఉంది, ఇదే ప్రాంగణంలో, ఇదే ప్రాంగణంలో, ఒకే వేదికపై, స్టార్టప్‌లు ఉన్నాయి మరియు దేశంలోని లక్షలాది మంది రైతులు ఉన్నారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ మరియు జై అనుసంధాన్, ఒక విధంగా, ఈ వేడుకలో, ఈ మంత్రం యొక్క సజీవ రూపాన్ని మనం చూస్తాము.

PM inaugurates PM Kisan Samman Sammelan 2022 at Indian Agricultural Research Institute, New Delhi

October 17th, 11:10 am

The Prime Minister, Shri Narendra Modi inaugurated PM Kisan Samman Sammelan 2022 at Indian Agricultural Research Institute in New Delhi today. The Prime Minister also inaugurated 600 Pradhan Mantri Kisan Samruddhi Kendras (PMKSK) under the Ministry of Chemicals & Fertilisers. Furthermore, the Prime Minister also launched Pradhan Mantri Bhartiya Jan Urvarak Pariyojana - One Nation One Fertiliser.

గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ స‌ద‌స్సు 2021 ప్రారంభ స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

November 18th, 03:57 pm

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగం ప్రాధాన్య‌త‌ను వెలుగులోకి తెచ్చింది. గ‌త రెండేళ్లుగా జీవ‌న‌శైలి కావ‌చ్చు, ఔష‌ధాలు, మెడిక‌ల్ టెక్నాల‌జీ, వ్యాక్సిన్లు స‌హా ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగానికి చెందిన‌ అన్ని అంశాలూ ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించాయి. భార‌త ఫార్మాస్యూటిక‌ల్ ప‌రిశ్ర‌మ కూడా స‌వాలును దీటుగా ఎదుర్కొనేందుకు స‌మాయ‌త్తం అయింది.

ఔషధ రంగ తొలి ప్రపంచ ఆవిష్కరణ సదస్సును ప్రారంభించిన ప్రధానమంత్రి

November 18th, 03:56 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఔషధ రంగానికి సంబంధించిన తొలి ‘ప్రపంచ ఆవిష్కరణ సదస్సు’ను ప్రారంభించారు. కేంద్ర మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- ఈ మహమ్మారి ఔషధ రంగంపై నిశిత దృష్టి సారించేలా చేసింది. జీవనశైలి అయినా… మందులైనా… వైద్య సాంకేతికత అయినా.. టీకా అయినా.. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రతి అంశం గడచిన రెండేళ్లుగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో భార‌త ఔష‌ధ ప‌రిశ్ర‌మ కూడా సదరు స‌వాలుకు దీటుగా ఎదిగిందని ప్రధానమంత్రి అన్నారు. ఆ మేరకు “భారత ఆరోగ్య సంరక్షణ రంగం సముపార్జించిన ప్రపంచవ్యాప్త విశ్వాసమే ఇటీవలి కాలంలో భారతదేశానికి ‘ప్రపంచ ఔషధ కేంద్రం’గా పేరు తెచ్చింది” అని శ్రీ మోదీ అన్నారు.

ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

October 11th, 11:19 am

ఈ రోజు దేశ ఇద్దరు గొప్ప కుమారులు, భారతరత్న శ్రీ జై ప్రకాష్ నారాయణ్ జీ మరియు భారతరత్న శ్రీ నానాజీ దేశ్ ముఖ్ జయంతి కూడా. స్వాతంత్ర్యానంతర భారతదేశానికి మార్గనిర్దేశం చేయడంలో ఈ ఇద్దరు గొప్ప వ్యక్తులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ప్రతి ఒక్కరితో, ప్రతి ఒక్కరి ప్రార్థనలతో,దేశంలో గొప్ప మార్పులు ఉన్నాయి, వారి జీవన తత్వశాస్త్రం నేటికీ మనకు స్ఫూర్తిని స్తుంది. నేను జై ప్రకాష్ నారాయణ్ జీ మరియు నానాజీ దేశ్ ముఖ్ జీకి నమస్కరిస్తున్నాను , నా నివాళులు అర్పిస్తున్నాను.

ఇండియన్స్పేస్ అసోసియేశన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

October 11th, 11:18 am

ఇండియన్ స్పేస్ అసోసియేశన్ (ఐఎస్ పిఎ) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భం లో స్పేస్ ఇండస్ట్రీ కి చెందిన ప్రతినిధుల తో ఆయన సమావేశమయ్యారు.

చతుర్దేశాధినేతల సమావేశం : సమాచార పత్రం

September 25th, 11:53 am

అమెరికాలోని శ్వేత సౌధంలో చతుర్దేశాధినేతల తొట్టతొలి వ్యక్తిగత శిఖరాగ్ర సమావేశంలో భాగంగా అధ్యక్షుడు బైడెన్‌ సెప్టెంబరు 24న భారత, జపాన్‌, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, యోషిహిడే సుగా, స్కాట్‌ మోరిసన్‌లకు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనడంలో ఆచరణాత్మక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం సహా స్నేహ సంబంధాల బలోపేతానికి తోడ్పడే విశిష్ట చర్యలు చేపట్టాలని అధినేతలు ఆకాంక్షించారు. ఈ మేరకు కోవిడ్‌-19 అంతం దిశగా సురక్షిత, ప్రభావశీల టీకాల ఉత్పత్తి-లభ్యత పెంపు, ఉన్నత ప్రమాణాలతో మౌలిక వసతులకు ప్రోత్సాహం, వాతావరణ మార్పు సంక్షోభ నిరోధం, ఆవిష్కరణాత్మక సాంకేతిక పరిజ్ఞానాల్లో భాగస్వామ్యం, అంతరిక్షం, సైబర్‌ భద్రత, నాలుగు దేశాల్లోనూ భవిష్యత్తరం ప్రతిభాపాటవాల వృద్ధి వంటివి ఈ చర్యలలో భాగంగా ఉన్నాయి.

భక్తి కాలం నాటి సామాజిక విప్లవం లేకుండా భారతదేశ స్థితి మరియు రూపాన్ని ఊహించుకోవడం కష్టం: ప్రధాని మోదీ

September 01st, 04:31 pm

శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద జీ 125 వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేశారు. బానిసత్వ కాలంలో, భక్తి భారతదేశ స్ఫూర్తిని సజీవంగా ఉంచుతుందని ప్రధాని అన్నారు. భక్తి కాలం నాటి సామాజిక విప్లవం లేనట్లయితే, భారతదేశ స్థితి మరియు రూపాన్ని ఊహించుకోవడం కష్టంగా ఉండేదని నేడు పండితులు అంచనా వేస్తున్నారని ఆయన అన్నారు.

శ్రీల భ‌క్తివేదాంత‌ స్వామి ప్ర‌భుపాద గారి 125 వ జ‌యంతి సంద‌ర్భం లో ఒక ప్ర‌త్యేకమైన స్మార‌క నాణేన్ని విడుద‌ల చేసిన ప్ర‌ధాన మంత్రి

September 01st, 04:30 pm

శ్రీ‌ల భ‌క్తివేదాంత స్వామి ప్ర‌భుపాద గారి 125వ జ‌యంతి సంద‌ర్భం లో ఒక ప్ర‌త్యేక‌మైన స్మార‌క నాణేన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భం లో సంస్కృతి, ప‌ర్య‌ట‌న‌, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ (డిఒఎన్ఇఆర్) కేంద్ర మంత్రి శ్రీ జి. కిష‌న్ రెడ్డి త‌దిత‌రులు పాలుపంచుకొన్నారు.

కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ 2021 లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం పాఠం

July 05th, 03:08 pm

వివిధ దేశాల కు చెందిన నిపుణులు ఇంత పెద్ద సంఖ్య లో కోవిన్ గ్లోబ‌ల్ కాన్‌క్లేవ్ కోసం మాతో క‌ల‌సి వ‌చ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ముందుగా, మ‌హ‌మ్మారి వ‌ల్ల అన్ని దేశాల లో ప్రాణాల ను కోల్పోయిన వ్య‌క్తుల కు

కోవిడ్-19 తో పోరాడ‌టం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ఒక డిజిట‌ల్ మాధ్యమ సార్వజనిక హితకారి రూపం లో ప్ర‌పంచాని కి భార‌త‌దేశం ఇవ్వజూపుతున్న తరుణంలో, కోవిన్ గ్లోబ‌ల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

July 05th, 03:07 pm

కోవిడ్‌-19 తో పోరాడ‌టానికి ఒక డిజిట‌ల్ సార్వ‌జ‌నిక హిత‌కారి రూపం లో కోవిన్ ప్లాట్ ఫార్మ్ ను ప్ర‌పంచాని కి భార‌త‌దేశం ఇవ్వజూపుతున్న పూర్వరంగం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న జ‌రిగిన కోవిన్ గ్లోబ‌ల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

యోగ ప్ర‌పంచం లో మూల‌ మూల‌ కు చేరుకొనేట‌ట్లుగా మ‌నం ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉండాలి: ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

June 21st, 08:40 am

యోగ ప్ర‌పంచం లోని మూల‌ మూల‌ కు చేరుకొనేట‌ట్లుగా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అని యోగ ఆచార్యులకు, యోగ ప్ర‌చార‌కుల‌ కు, యోగ తో సంబంధం ఉన్న ప్ర‌తి ఒక్క‌రి కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆయన ‘7వ అంత‌ర్జాతీయ యోగ దినం’ సంద‌ర్భం లో ప్ర‌సంగిస్తూ, ఈ సందేశాన్ని ఇచ్చారు.

కోవిడ్-ప్రభావిత ప్ర‌పంచం లో యోగ ఆశాకిర‌ణం గా ఉంద‌న్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

June 21st, 08:37 am

‘7వ అంత‌ర్జాతీయ యోగ దినం’ సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మహమ్మారి కాలం లో యోగ కు ఉన్న పాత్ర ను గురించి తన అభిప్రాయాల ను వ్యక్తం చేశారు. ఈ క‌ఠిన సమయం లో యోగ ప్ర‌జ‌ల కు ఒక శ‌క్తి సాధ‌నం గాను, ఆత్మవిశ్వాసాన్ని అందించిన సాధనం గాను త‌న‌ ను తాను రుజువు చేసుకొంది అని ఆయ‌న అన్నారు. మ‌హ‌మ్మారి కాలం లో యోగ దినాన్ని మ‌ర‌చిపోవ‌డం అనేది యోగ త‌మ సంస్కృతి లో అంత‌ర్భాగం కాన‌టువంటి దేశాల‌ కు సుల‌భ‌మైన విష‌య‌మే అని, అయితే దానికి బ‌దులు గా, ప్ర‌పంచ స్థాయి లో యోగ ప‌ట్ల ఉత్సాహం వృద్ధి చెందింది అని ఆయ‌న అన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగపాఠం

June 21st, 06:42 am

నేడు, ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిని ఎదుర్కొ౦టున్నప్పుడు, యోగా ఒక ఆశాకిరణ౦గా ఉ౦ది. రెండు సంవత్సరాలుగా, ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో పెద్ద బహిరంగ కార్యక్రమాలు జరగకపోవచ్చు, కానీ యోగా దినోత్సవం పట్ల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. కరోనా ఉన్నప్పటికీ, ఈసారి యోగా దినోత్సవం స్వస్థత కోసం యోగా అనే ఇతివృత్తం లక్షలాది మంది ప్రజలలో యోగా పట్ల ఉత్సాహాన్ని పెంచింది. ప్రతి దేశం, ప్రతి సమాజం మరియు ప్రతి ఒక్కరూ కలిసి ఒకరి బలం గా మారాలని నేను కోరుకుంటున్నాను.