ఆర్య సమాజ్ స్మృతి చిహ్నం వద్ద ప్రధాని నివాళి

November 22nd, 03:09 am

గయానా లోని జార్జ్ టౌన్ లో ఉన్న ఆర్య సమాజ్ స్మృతి చిహ్నం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. గయానాలో భారతీయ సంస్కృతిని పరిరక్షించడంలో వారి కృషి, పాత్ర ప్రశంసనీయమని శ్రీ మోదీ కొనియాడారు. స్వామి దయానంద సరస్వతి 200వ జయంతిని పురస్కరించుకుని ఈ ఏడాది చాలా ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు.

సురినామ్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ

November 21st, 10:57 pm

గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండవ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సురినామ్ దేశాధ్యక్షుడు శ్రీ చంద్రికాపర్సాద్ సంతోఖీతో నవంబర్ 20వ తేదీన భేటీ అయ్యారు.

గ్రెనడా ప్రధానమంత్రితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 21st, 10:44 pm

గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో, నవంబర్ 20వ తేదీన గ్రెనడా ప్రధానమంత్రి శ్రీ డికన్ మిచెల్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రితో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ భేటీ

November 21st, 10:42 pm

గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 20వ తేదీన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి శ్రీ కీత్ రౌలీతో సమావేశమయ్యారు.

భారత ఆగమన స్మృతి చిహ్నాన్ని సందర్శించిన ప్రధానమంత్రి

November 21st, 10:00 pm

జార్జ్ టౌన్ లోని స్మారకోద్యానవనంలో భారత ఆగమన స్మృతిచిహ్నాన్ని ప్రధానమంత్రి సందర్శించారు. ఆయన వెంట గయానా ప్రధానమంత్రి బ్రిగేడియర్ (విశ్రాంత) మార్క్ ఫిలిప్స్ ఉన్నారు. అక్కడ పూలమాలలు వేసి నివాళి అర్పించిన ప్రధానమంత్రికి టస్సా డోలు బృందం స్వాగతం పలికింది. స్మృతిచిహ్నం వద్ద నివాళి అర్పించిన ప్రధానమంత్రి.. గయానాలోని భారత సంతతికి చెందిన వారి పోరాటాన్నీ, త్యాగాలనూ.. గయానాలో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించడంలో వారి విశేష కృషినీ గుర్తుచేసుకున్నారు. స్మృతిచిహ్నం వద్ద ఆయన బేల్ పత్ర మొక్క నాటారు.

మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ప్రధానమంత్రి

November 21st, 09:57 pm

గయానాలోని జార్జ్ టౌన్ లో ఉన్న చారిత్రక విహారోద్యానవనంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. బాపూ బోధించిన శాంతి, అహింసా విలువలను గుర్తుచేసుకున్న ఆయన.. అవి మానవాళికి ఎప్పటికీ దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయన్నారు. గాంధీజీ శతజయంతి సందర్భంగా 1969లో ఆ విగ్రహాన్ని అక్కడ నెలకొల్పారు.

డొమినికా ప్రధానమంత్రిని కలిసిన భారత ప్రధానమంత్రి

November 21st, 09:29 pm

భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా గయానాలోని జార్జ్ టౌన్‌లో డొమినికా ప్రధానమంత్రి శ్రీ రూజ్‌వెల్ట్ స్కెరిట్‌తో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

PM Modi meets with Prime Minister of Antigua and Barbuda

November 21st, 09:37 am

PM Modi met Antigua and Barbuda PM Gaston Browne during the 2nd India-CARICOM Summit in Guyana. They discussed trade, investment, and SIDS capacity building. PM Browne praised India’s 7-point CARICOM plan and reiterated support for India’s UN Security Council bid.

బార్బడోస్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ

November 21st, 09:13 am

బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్‌లీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్-కేరికోమ్ శిఖరాగ్ర సమావేశాన్ని గయానాలోని జార్జ్‌టౌన్‌లో నవంబరు 20న నిర్వహించిన సందర్భంగా వారిరువురు సమావేశమయ్యారు. భారత- బార్బడోస్‌ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ఘాటించడంతోపాటు ఆ సంబంధాలను బల పరచడానికి ఇద్దరు నేతలకు ఒక అవకాశాన్ని ఈ ఉన్నతస్థాయి సమావేశం అందించింది.

గయానా అధ్యక్షుడితో భారత ప్రధాని అధికారిక చర్చలు

November 21st, 04:23 am

జార్జ్ టౌన్ లో ఉన్న స్టేట్ హౌజ్ లో డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. స్టేట్ హౌజ్ కు చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు అలీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గౌరవ వందనాన్ని స్వీకరించారు.

PM Modi and President of Guyana, Dr. Irfaan Ali take part in the ‘Ek Ped Maa Ke Naam’ movement

November 20th, 11:27 pm

PM Modi and President Dr. Irfaan Ali participated in the ‘Ek Ped Maa Ke Naam’ movement in Georgetown, symbolizing a shared commitment to sustainability. President Ali planted a tree alongside his grandmother and mother-in-law, marking a special gesture of environmental care.