Art is pro-nature, pro-environment and pro-climate: PM Modi

December 08th, 06:00 pm

PM Modi inaugurated the first Indian Art, Architecture & Design Biennale (IAADB) 2023 being held at Red Fort. During the programme, the Prime Minister inaugurated the ‘Aatmanirbhar Bharat Centre for Design’ at Red Fort and the student Biennale- Samunnati. He also launched a Commemorative Stamp. PM Modi also took a walkthrough of the exhibition showcased on the occasion.

ఢిల్లీలో భారతీయ కళలు.. వాస్తు-నిర్మాణ తొలి ద్వైవార్షిక వేడుకలు-2023కు ఎర్రకోట వద్ద ప్రధాని ప్రారంభోత్సవం

December 08th, 05:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలో భారతీయ కళలు.. వాస్తు-నిర్మాణ తొలి ద్వైవార్షిక వేడుకలు (ఐఎఎడిబి)-2023ను ఎర్రకోట వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఆత్మనిర్భర్ భారత్ సెంటర్ ఫర్ డిజైన్’ (ఎబిసిడి)తోపాటు విద్యార్థుల ద్వైవార్షిక వేడుకలు ‘సమున్నతి’ని కూడా ప్రధాని ప్రారంభించారు. అలాగే ఈ వేడుకల స్మారక తపాలా బిళ్లను ఆవిష్కరించి, ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. కాగా, ఢిల్లీ నగర సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని ‘ఐఎఎడిబి’ ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అనంతరం ప్రధాని ప్రసంగిస్తూ- ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ఎర్రకోటను సందర్శనకు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించారు. దేశ స్వాతంత్ర్యానికి ముందు.. తర్వాత అనేక తరాలు గతించినా ఈ కోట ప్రాంగణానికిగల చారిత్రక ప్రాశస్త్యం ఎన్నటికీ చెరగనిదిగా, అచంచలంగా నిలిచి ఉందని ఆయన వివరించారు.

ప్రపంచ శాంతి కోసం కృష్ణగురు ఏకనామ్ అఖండ కీర్తనలో ప్రధానమంత్రి ప్రసంగం

February 03rd, 07:48 pm

కృష్ణగురు సేవాశ్రమంలో గుమిగూడిన సాధువులు, ఋషులు మరియు భక్తులందరికీ నా గౌరవప్రదమైన ప్రణామాలు. కృష్ణగురు ఏకనామ అఖండ కీర్తన గత నెల రోజులుగా జరుగుతోంది. కృష్ణగురు జీ ప్రచారం చేసిన ప్రాచీన భారతీయ విజ్ఞానం, సేవ మరియు మానవత్వం ఈనాటికీ కొనసాగడం నాకు సంతోషంగా ఉంది. గురుకృష్ణ ప్రేమానంద్ ప్రభు జీ ఆశీస్సులు మరియు సహకారంతో మరియు కృష్ణగురు భక్తుల కృషితో, ఈ కార్యక్రమంలో ఆ దైవత్వం స్పష్టంగా కనిపిస్తుంది. నేను అస్సాం వచ్చి మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను కోరుకున్నాను! నేను గతంలో కృష్ణగురువు జీ పవిత్ర నివాసానికి రావడానికి చాలా ప్రయత్నాలు చేశాను. కానీ నేను అక్కడికి రాలేకపోయిన నా ప్రయత్నాలలో కొన్ని వైఫల్యాలు ఉండవచ్చు. ఆ కృష్ణగురువును కోరుకుంటున్నాను'

ప్రపంచ శాంతి కోసం ‘కృష్ణగురు ఏక్ నామ్ అఖండ కీర్తన’ నుద్దేశించి ప్రధాని ప్రసంగం

February 03rd, 04:14 pm

ప్రపంచ శాంతికోసం పాటుపడుతూ అస్సాంలోని బారపేటలో ఉన్న కృష్ణ గురు సేవాశ్రంలో జరుగుతున్న ‘కృష్ణగురు ఏక్ నామ్ అఖండ కీర్తన’ నుద్దేశించి ఈ రోజు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యకమం జనవరి 6 న మొదలై నెలరోజులపాటు సాగింది. దీనికి హాజరైన వారినుద్దేశించిన ప్రధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. కృష్ణగురు పురాతన భారత సంప్రదాయ జ్ఞానాన్ని, సేవను, మానవతావాదాన్ని ప్రచారం చేయగా ఆ బోధనలు నేటికీ ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. గురు కృష్ణ ప్రేమానంద ప్రభు జీ బోధనల దైవిక స్వభావం, ఆయన శిష్యుల కృషి ఈ సందర్భంగా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. గతంలోనూ, ఈ రోజు కూడా వ్యక్తిగతంగా నేరుగా పాల్గొనాలని భావించినా కుదరకపోవటంతో వీలైనంత త్వరలో అలాంటి అవకాశం దక్కేలా కృష్ణగురు ఆశీస్సులందుకున్నారు.

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్-ఎంవీ గంగా విలాస్ ప్రారంభోత్సవం, వారణాసిలో టెంట్ సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

January 13th, 10:35 am

ఈ రోజు లోహ్రీ పండుగ. రాబోయే రోజుల్లో ఉత్తరాయణం, మకర సంక్రాంతి, భోగి, బిహు, పొంగల్ వంటి అనేక పండుగలను జరుపుకుంటాం. దేశంలో, ప్రపంచంలో ఈ పండుగలను జరుపుకునే వారందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.

వారాణసీ లో ప్రపంచం లోకెల్లా అతి దీర్ఘమైన నదీ జల యాత్ర - ఎమ్.వి గంగావిలాస్ కు ప్రారంభసూచక పచ్చ జెండా ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా చూపెట్టిన ప్రధాన మంత్రి

January 13th, 10:18 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచం లోనే అతి పెద్దదైన నదీ జల యాత్ర ఎమ్ వి గంగా విలాస్ కు ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా ప్రారంభ సూచక పచ్చజెండా ను చూపెట్టారు. దీనితో పాటే వారాణసీ లో టెంట్ సిటీ ని కూడా ఆయన ప్రారంభించారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, ఒక వేయి కోట్ల రూపాయల కు పైగా విలువైన అనేక ఇతర అంతర్ దేశీయ జలమార్గ పథకాల ను ఆయన ప్రారంభించడం తో పాటుగా కొన్ని పథకాల కు శంకుస్థాపన కూడా చేశారు. నదీ జలాల లో విహారాని కి సంబంధించిన పర్యటన రంగాని కి ఉత్తేజాన్ని అందించాలనే ప్రధాన మంత్రి ప్రయత్నానికి అనుగుణం గా ఈ యొక్క సర్వీసు మొదలవడం తో, నదీ జలయాత్ర లకు సంబంధించిన ఇంతవరకు వినియోగం లోకి రానటువంటి సంభావ్యత లు ఇక మీదట ఆచరణ రూపాన్ని దాల్చనున్నాయి. మరి ఇది భారతదేశం లో నదీ విహార ప్రధాన పర్యటన ల తాలూకు ఒక సరికొత్త యుగాన్ని ఆవిష్కరించనుంది.