'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ
September 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.భారీ మార్పు దిశగా- మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగం
September 18th, 04:24 pm
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్ సీఓఈ) ఆవిర్భవిస్తోంది. కంపెనీల చట్టం 2013 ప్రకారం సెక్షన్ 8 కంపెనీగా దీనిని రూపొందిస్తున్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఇండియన్ చాంబర్స్ అఫ్ కామర్స్ సమాఖ్య, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముంబయిలో ఎన్ సిఓఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఏవీజీసీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి 2022-23 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఇది ప్రారంభం అవుతోంది.భారతదేశపు అగ్రశ్రేణి ఆటగాళ్ళు ‘కూల్’ ప్రధాని మోదీని కలిశారు
April 13th, 12:33 pm
పిసి మరియు విఆర్ గేమింగ్ ప్రపంచంలో లీనమై, భారతదేశంలోని అగ్రశ్రేణి గేమర్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకమైన పరస్పర చర్యలో నిమగ్నమయ్యారు. సెషన్‌లో, ప్రధాని మోదీ గేమింగ్ సెషన్‌లలో చురుకుగా పాల్గొన్నారు, వేగంగా అభివృద్ధి చెందుతున్న గేమింగ్ పరిశ్రమ పట్ల తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు.