జులై 28వ, 29వ తేదీల లో గుజరాత్ ను మరియు తమిళ నాడు నుసందర్శించనున్న ప్రధాన మంత్రి
July 26th, 12:52 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం జులై 28వ, 29వ తేదీల లో గుజరాత్ ను మరియు తమిళ నాడు ను సందర్శించనున్నారు. జులై 28వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వేళ లో సాబర్ కాంఠా లోని గఢోడా చౌకీ ప్రాంతం లో సాబర్ డెయరి కి చెందిన అనేక ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించడమే కాకుండా మరికొన్ని పథకాల కు శంకుస్థాపన ను కూడా చేయనున్నారు. అటు తరువాత ప్రధాన మంత్రి చెన్నై కు పోయి సాయంత్రం సుమారు 6 గంటల వేళ కు చెన్నై లోని జెఎల్ఎన్ ఇండోర్ స్టేడియమ్ లో 44వ చెస్ ఒలింపియాడ్ ప్రారంభం అయినట్లు గా ప్రకటిస్తారు.