పారిస్ ఏఐ కార్యాచరణ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

పారిస్ ఏఐ కార్యాచరణ సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

February 11th, 03:15 pm

మీ వైద్య సంబంధ రిపోర్టును కృత్రిమ మేధ (ఏఐ)తో నడిచే యాప్ లో మీరు అప్లోడ్ చేస్తే.. సులభంగా అర్థమయ్యే భాషలో, ఎలాంటి వృత్తిపరమైన ప్రామాణిక పదజాలమూ లేకుండా మీ ఆరోగ్య సమాచారాన్ని అది వివరించగలదు. కానీ, మీరు అదే యాప్‌ ను ఎడమ చేతితో రాసే వ్యక్తి చిత్రాన్ని గీయమని అడిగితే, అది చాలావరకు కుడి చేతితో రాసే వారి చిత్రాన్నే గీస్తుంది. ఎందుకంటే ట్రైనింగ్ డేటాలో ఎక్కువ భాగం అదే ఉంటుంది.

పారిస్ ఏఐ కార్యాచరణ సదస్సుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షత ఏఐ ఈ శతాబ్దపు మానవీయతను రచిస్తోంది: ప్రధానమంత్రి

పారిస్ ఏఐ కార్యాచరణ సదస్సుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షత ఏఐ ఈ శతాబ్దపు మానవీయతను రచిస్తోంది: ప్రధానమంత్రి

February 11th, 03:00 pm

పారిస్ లో జరిగిన కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ తో కలిసి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షత వహించారు. వారం పాటు సాగిన సదస్సు ఈనెల 6-7 తేదీల్లో సైన్స్ దినోత్సవాలతో ప్రారంభమైంది. తర్వాతి రెండు రోజులు సాంస్కృతిక వారాంతపు కార్యక్రమాలు నిర్వహించారు. ఉన్నత స్థాయి ముగింపు కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగానికి నేతృత్వం వహిస్తున్న ప్రముఖులు, విధాన నిర్ణేతలు, నిపుణులు హాజరయ్యారు.

భారత ఇంధన వారోత్సవాల (ఎనర్జీ వీక్) సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

భారత ఇంధన వారోత్సవాల (ఎనర్జీ వీక్) సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

February 11th, 11:37 am

గౌరవ కేంద్ర మంత్రివర్గ సభ్యులు, మాన్యులు, రాయబారులు, వివిధ సంస్థల సీఈఓ లు, గౌరవ అతిథులు, ఇతర ప్రముఖులు, సోదర సోదరీమణులారా,

భారత ఇంధన వారోత్సవంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

February 11th, 09:55 am

21వ శతాబ్దం భారతదేశానిదేనని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు స్పష్టం చేస్తుండడాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన శ్రీ మోదీ.. ‘‘స్వీయ వృద్ధిని మాత్రమే కాదు... ప్రపంచ వృద్ధికి కూడా భారత్ చోదక శక్తిగా నిలుస్తోంది. అందులో ఇంధన రంగం గణనీయమైన పాత్ర పోషిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. వనరుల సద్వినియోగం- ఆవిష్కరణల దిశగా మేధావులను ప్రోత్సహించడం- ఆర్థిక బలంతోపాటు రాజకీయ స్థిరత్వం- ఇంధన వాణిజ్యాన్ని ఆకర్షణీయమూ, సులభతరమూ చేసే భౌగోళిక వ్యూహం- అంతర్జాతీయ సుస్థిరత పట్ల నిబద్ధత… అనే ఐదు అంశాలు భారత ఇంధన ఆకాంక్షలకు మూలాధారాలని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాలు దేశ ఇంధన రంగంలో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

Eastern India is a growth engine in the development of the country, Odisha plays a key role in this: PM

January 28th, 11:30 am

PM Modi inaugurated the Utkarsh Odisha – Make in Odisha Conclave 2025 in Bhubaneswar, highlighting Eastern India's role in national growth. He emphasized Odisha's historical trade significance, growing opportunities, and its potential to lead in various industries. The PM encouraged investors to seize the moment for Odisha’s development and praised the state’s contributions to New India’s progress.

PM Modi inaugurates the 'Utkarsh Odisha' - Make in Odisha Conclave 2025 in Bhubaneswar

January 28th, 11:00 am

PM Modi inaugurated the Utkarsh Odisha – Make in Odisha Conclave 2025 in Bhubaneswar, highlighting Eastern India's role in national growth. He emphasized Odisha's historical trade significance, growing opportunities, and its potential to lead in various industries. The PM encouraged investors to seize the moment for Odisha’s development and praised the state’s contributions to New India’s progress.

సంయుక్త ప్రకటన: ఏడో భారత్-జర్మనీ ప్రభుత్వ స్థాయి సంప్రదింపులు (ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ - ఐజిసి)

October 25th, 08:28 pm

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ 2024 అక్టోబర్ 25న న్యూఢిల్లీలో ఏడో విడత భారత్-జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) కు సహాధ్యక్షత వహించారు.భారత వైపు నుంచి రక్షణ, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమలు, కార్మిక, ఉపాధి, శాస్త్ర, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రులు, జర్మనీ వైపు నుంచి ఆర్థిక వ్యవహారాలు, వాతావరణ కార్యాచరణ, విదేశీ వ్యవహారాలు, కార్మిక, సామాజిక వ్యవహారాలు, విద్య, పరిశోధన శాఖల మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇంకా జర్మనీ వైపు నుంచి ఆర్థిక, పర్యావరణం, ప్రకృతి సంరక్షణ, అణు భద్రత, వినియోగదారుల రక్షణ, ఆర్థిక సహకారం,అభివృద్ధి శాఖల పార్లమెంటరీ స్టేట్ సెక్రటరీలు, అలాగే ఇరు దేశాల నుంచి ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.

ఎన్డిటివి వరల్డ్ సమ్మిట్ లో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు అనువాదం

October 21st, 10:25 am

ఎన్ డిటివి వరల్డ్ సమ్మిట్ కు హాజరైన గౌరవ అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సులో మీరు వివిధ అంశాలపై చర్చించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రపంచ నాయకులు కూడా తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

న్యూఢిల్లీలో ‘ఎన్‌డిటివి’ ప్రపంచ సదస్సు-2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

October 21st, 10:16 am

గ‌త నాలుగైదేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ- ప్రపంచ భ‌విష్య‌త్తు సంబంధిత ఆందోళ‌న‌ల‌పై చ‌ర్చ‌లు ఒక సాధారణ ఇతివృత్తంగా మారిపోయాయయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్, ఆ మహమ్మారి అనంతర ఆర్థిక ఒత్తిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాతావరణ మార్పు సమస్యలు, కొనసాగుతున్న యుద్ధాలు, సరఫరా శ్రేణిలో వినూత్న మార్పులు, అమాయక జనం మరణాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి సంఘర్షణల సవాళ్లు వగైరాలన్నీ ప్రపంచ శిఖరాగ్ర సమావేశాల్లో చర్చనీయాంశాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే సమయాన భార‌త్‌ మాత్రం తన శతాబ్ది వేడుకల నిర్వహణ గురించి చర్చిస్తున్నదని ప్రకటించారు. ‘‘ప్రపంచమంతా పీకల్లోతు సంక్షోభంలో మునిగితే, భారత్ ఆశాకిరణంగా ఉద్భవించింద’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థితిగతులు, దాని ముందున్న సవాళ్లతో భారత్ ప్రభావితమైనప్పటికీ, వాటిని అధిగమించగల ఆశావహ దృక్పథం కొరవడలేదని స్పష్టం చేశారు.

ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ – వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన పారిశ్రామికవేత్తలు

October 15th, 02:23 pm

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు జరిగిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ - వరల్డ్ టెలీకమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (ఐటియు- డబ్ల్యుటిఎస్ఎ) - 2024 సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎనిమిదో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించారు. డబ్ల్యుటిఎస్ఎ అనేది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, యునైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఫర్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రామాణికీకరణ కార్యకలాపాలకు పాలక వర్గ సమావేశం ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఐటియు- డబ్ల్యుటిఎస్ఎ సదస్సును ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో- భారతదేశంలో నిర్వహించడం ఇదే తొలిసారి. ఇది టెలికాం, డిజిటల్, ఐసిటి రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 190 దేశాలకు చెందిన 3,000 మందికి పైగా పారిశ్రామిక నాయకులు, విధాన రూపకర్తలు, సాంకేతిక నిపుణులను ఏకతాటిపైకి తెచ్చిన ఒక కీలకమైన అంతర్జాతీయ సదస్సు.

ఐటీయూ - వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 15th, 10:05 am

నా మంత్రివర్గ సహచరులు జ్యోతిరాదిత్య సింధియా జీ, చంద్రశేఖర్ జీ, ఐటీయూ సెక్రటరీ జనరల్, వివిద దేశాల మంత్రులు, మన దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు, పరిశ్రమ ముఖ్యులు, టెలికాం నిపుణులు, అంకుర సంస్థలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు, భారత్, విదేశాలకు చెందిన విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా,

న్యూఢిల్లీలో ‘ఐటియు’ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం

October 15th, 10:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్(ఐటియు)- వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ-2024 (డబ్ల్యుటిఎస్ఎ) ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసి) 8వ మహాసభకూ ఆయన శ్రీకారం చుట్టారు. అనంతరం ఆ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.

ఉమ్మడి వాస్తవ పత్రం: సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణను కొనసాగించనున్న అమెరికా, ఇండియా

September 22nd, 12:00 pm

అమెరికా, భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యమని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే అద్భుత అజెండాను నిశ్చయాత్మకంగా ముందుకు తెస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.

గుజ‌రాత్, గాంధీన‌గ‌ర్ లో రీ ఇన్వెస్ట్ 2024 కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌సంగం

September 16th, 11:30 am

జర్మనీ ఆర్థిక సహకార మంత్రి , డెన్మార్క్ పరిశ్రమల వ్యాపార మంత్రితో సహా విదేశాల నుండి వ‌చ్చిన‌ విశిష్ట అతిథులూ , నా మంత్రి మండ‌లి స‌భ్యులు ప్రహ్లాద్ జోషి జీ, శ్రీపాద్ నాయక్ జీ , ప‌లు దేశాల నుండి వ‌చ్చిన ప్రతినిధులు...

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన (రీ-ఇన్వెస్ట్)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం

September 16th, 11:11 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్‌లో ‘ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన’ (రీ-ఇన్వెస్ట్)ను ప్రారంభించారు. మన దేశం 200 గిగావాట్ల శిలాజేతర ఇంధన స్ధాపిత సామర్థ్యం సాధించడంలో సహకరించిన కీలక భాగస్వాములను ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత్ సత్కరిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ రంగ కంపెనీలు, అంకుర సంస్థలు, ప్రధాన పారిశ్రామిక సంస్థలలో అత్యాధునిక ఆవిష్కరణలతో సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ తిలకించారు.

తొలి అంతర్జాతీయ సౌర ఉత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం

September 05th, 11:00 am

గౌరవనీయ ప్రముఖులారా, విశిష్ట అతిథులారా, నా ప్రియ మిత్రులారా! మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మొదటి అంతర్జాతీయ సౌరోత్సవానికి మీ అందరినీ సంతోషంగా స్వాగతిస్తున్నాను. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అంతర్జాతీయ సౌర కూటమికి అభినందనలు.

Joint Statement following the 22nd India-Russia Annual Summit

July 09th, 09:54 pm

Prime Minister of the Republic of India Shri Narendra Modi paid an official visit to the Russian Federation on July 8-9, 2024 at the invitation of President of the Russian Federation H.E. Mr. Vladimir Putin for the 22nd India – Russia Annual Summit.

RJD has given only two things to Bihar, Jungle Raj and Corruption: PM Modi in Gaya

April 16th, 10:30 am

Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed a public meeting in Gaya, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Gaya and Aurangabad have announced today – Phir Ek Baar, Modi Sarkar!”

PM Modi addresses public meetings in Gaya and Purnea, Bihar

April 16th, 10:00 am

Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed public meetings in Gaya and Purnea, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Bihar has announced today – Phir Ek Baar, Modi Sarkar! This election is for 'Viksit Bharat' and 'Viksit Bihar'.”

చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను బీజేపీ ప్రభుత్వం శ్రద్ధగా పరిష్కరించింది: పిలిభిత్‌లో ప్రధాని మోదీ

April 09th, 11:00 am

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లోని జనసమూహంపై ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రేమను, అభిమానాన్ని చాటుకున్నారు. నగరానికి ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని జనం తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌పై తన దృష్టిని ప్రేక్షకులతో చర్చించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వివిధ ఇబ్బందుల మధ్య, భారతదేశం సాధించలేనిది ఏదీ లేదని చూపిస్తోంది అని ప్రధాని అన్నారు.