హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
December 06th, 08:14 pm
హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో భారత్‌కు, విదేశాలకు చెందిన విశిష్ట అతిథులు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను, ఇక్కడ తమ అభిప్రాయాలను పంచుకున్న సహచరులను అభినందిస్తున్నాను. శోభన గారు చెప్పిన వాటిలో నేను రెండు విషయాలను గమనించాను. మొదటిది, గతంలో మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇది సూచించారు అని చెప్పారు. మీడియాకు పని చేయమని చెప్పే సాహసం ఈ దేశంలో ఎవరూ చేయరు. కానీ నేను చెప్పాను. శోభన గారు, ఆమె బృందం అత్యంత ఉత్సాహంగా దానిని పూర్తి చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడే ఎగ్జిబిషన్ సందర్శించాను. మీ అందరూ కూడా తప్పనిసరిగా దానిని సందర్శించమని కోరుతున్నాను. ఫొటోగ్రాఫర్ మిత్రులు క్షణాలను చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఫొటోల్లో బంధించారు. ఇక రెండో విషయానికి వస్తే... నేను ఇంకా ఆమె చెప్పిన మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని చెప్పి ఉండొచ్చు. దానికి బదులుగా ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని హిందుస్థాన్ టైమ్స్ చెబుతోందన్నారు. ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.న్యూఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 06th, 08:13 pm
న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కావడాన్ని గమనించినట్టు తెలిపారు. సదస్సు నిర్వాహకులకు, తమ ఆలోచనలు పంచుకున్నవారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. శోభనాజీ ప్రస్తావించిన రెండు అంశాలను తాను శ్రద్ధగా గమనించినట్లు శ్రీ మోదీ తెలిపారు. అందులో మొదటిది, గతంలో తాను ఈ వేదికకు వచ్చినప్పుడు చేసిన ఒక సూచనను ఆమె గుర్తు చేశారని, మీడియా సంస్థల విషయంలో అలా సూచనలు ఇవ్వడం చాలా అరుదని, అయినా తాను ఆ పని చేశానని ఆయన అన్నారు. ఆ సూచనను శోభనా జీ, వారి బృందం ఉత్సాహంగా అమలు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించినప్పుడు, ఫొటోగ్రాఫర్లు క్షణాలను చిరస్మరణీయంగా మలిచిన తీరును చూశానని, ఆ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఆయన కోరారు. శోభనా జీ ప్రస్తావించిన రెండో అంశం గురించి శ్రీ మోదీ వివరిస్తూ, తాను దేశానికి సేవ చేస్తూ ఉండాలన్నది కేవలం ఒక ఆకాంక్ష మాత్రమే కాదని, ఇదే విధంగా సేవలు కొనసాగించాలని హిందుస్థాన్ టైమ్స్ పత్రికే స్వయంగా చెబుతున్నట్లుగా తాను భావిస్తున్నానని అన్నారు. ఇందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఎన్డిటివి వరల్డ్ సమ్మిట్ లో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు అనువాదం
October 21st, 10:25 am
ఎన్ డిటివి వరల్డ్ సమ్మిట్ కు హాజరైన గౌరవ అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సులో మీరు వివిధ అంశాలపై చర్చించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రపంచ నాయకులు కూడా తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.న్యూఢిల్లీలో ‘ఎన్‌డిటివి’ ప్రపంచ సదస్సు-2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 21st, 10:16 am
గత నాలుగైదేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ- ప్రపంచ భవిష్యత్తు సంబంధిత ఆందోళనలపై చర్చలు ఒక సాధారణ ఇతివృత్తంగా మారిపోయాయయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్, ఆ మహమ్మారి అనంతర ఆర్థిక ఒత్తిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాతావరణ మార్పు సమస్యలు, కొనసాగుతున్న యుద్ధాలు, సరఫరా శ్రేణిలో వినూత్న మార్పులు, అమాయక జనం మరణాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి సంఘర్షణల సవాళ్లు వగైరాలన్నీ ప్రపంచ శిఖరాగ్ర సమావేశాల్లో చర్చనీయాంశాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే సమయాన భారత్ మాత్రం తన శతాబ్ది వేడుకల నిర్వహణ గురించి చర్చిస్తున్నదని ప్రకటించారు. ‘‘ప్రపంచమంతా పీకల్లోతు సంక్షోభంలో మునిగితే, భారత్ ఆశాకిరణంగా ఉద్భవించింద’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థితిగతులు, దాని ముందున్న సవాళ్లతో భారత్ ప్రభావితమైనప్పటికీ, వాటిని అధిగమించగల ఆశావహ దృక్పథం కొరవడలేదని స్పష్టం చేశారు.డెహ్రాడూన్-ఢిల్లీ మధ్య వందే భారత్ ఎక్స్’ప్రెస్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగం తెలుగు పాఠం
May 25th, 11:30 am
ఉత్తరాఖండ్ గవర్నర్ శ్రీ గుర్మీత్ సింగ్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ సభ్యులు, ఇతర ప్రముఖులుసహా ఉత్తరాఖండ్‌లోని నా ప్రియతమ సోదర సోదరీమణులు…అందరికీ వందనాలు! రాష్ట్రం నుంచి వందే భారత్ ఎక్స్’ప్రెస్ రైలు ప్రారంభిస్తున్న సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రజలందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను.డెహ్రాడూన్ - ఢిల్లీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధానమంత్రి
May 25th, 11:00 am
డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. కొత్తగా విద్యుదీకరణ చేసిన రైలు మార్గాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి, ఉత్తరాఖండ్ ను నూరు శాతం విద్యుత్ రైలు మార్గాల (100% ఎలక్ట్రిక్ ట్రాక్షన్) రాష్ట్రంగా ప్రకటించారు.జి 7 శిఖరాగ్ర సమావేశం 9 వ వర్కింగ్ సెషన్ లో ప్రధాన మంత్రి ప్రారంభ ప్రకటన తెలుగు అనువాదం వర్కింగ్ సెషన్ 9: శాంతియుత, స్థిరమైన, సంపన్న ప్రపంచం వైపు
May 21st, 10:20 am
అధ్యక్షుడు జెలెన్ స్కీ గురించి ఈ రోజు విన్నాం. నిన్న వారిని కలిశాను కూడా. ప్రస్తుత పరిస్థితిని నేను రాజకీయాలు లేదా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమస్యగా పరిగణించను. ఇది మానవత్వానికి సంబంధించిన విషయం, మానవీయ విలువలకు సంబంధించిన విషయం అని నేను నమ్ముతాను. చర్చలు, దౌత్యం ఒక్కటే మార్గమని మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. ఈ పరిస్థితిని పరిష్కరించడానికి భారతదేశం తన చేతనైనంత సహకారం అందించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాము.వియత్నాం ప్రధానమంత్రిని కలిసిన , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
May 20th, 12:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వియత్నాం ప్రధానమంత్రి , హిజ్ ఎక్సలెన్సి ఫామ్ మిన్హ్ చిన్హ్ ను 2023 మే 20 వ తేదీనజపాన్ కు చెందిన ప్రముఖులతో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 20th, 12:06 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ కు చెందిన పలువురు ప్రముఖులను, హిరోషిమాలో జరుగుతున్న జి–7 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా కలుసుకున్నారు. ప్రధానమంత్రి కలుసుకున్న వారిలో డాక్టర్ తొమియో మిజోకమి, శ్రీమతి హిరోకో తకయామ తదితరులు ఉన్నారు. వారు తమ తమ రంగాలలో అద్భుత కృషి చేశారు.రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
May 20th, 12:06 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే 20 వ తేదీన , హిరోషిమాలో జరుగుతున్న జి–7 శిఖరాగ్ర సమావేశాల సందర్బంగా , రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్తో సమావేశమయ్యారు.జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో యూరోపియన్ కమిశన్అధ్యక్షురాలి తో సమావేశమైన ప్రధాన మంత్రి
June 28th, 08:07 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలు ఉర్సు లా వాన్ డేర్ లేయెన్ గారి తో జి-7 శిఖర సమ్మేళనం సందర్బం లో 2022 జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో సమావేశమయ్యారు.జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో కెనడా ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 28th, 07:59 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో తో కలసి జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో ఒక ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.జర్మనీలోని మ్యూనిచ్ చేరుకున్న ప్రధాని మోదీ
June 26th, 09:00 am
ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం మ్యూనిచ్ చేరుకున్నారు. జీ-7 సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సాయంత్రం తర్వాత, మ్యూనిచ్‌లో జరిగే కమ్యూనిటీ కార్యక్రమంలో కూడా ఆయన ప్రసంగిస్తారు.2022 జూన్ 26-28 ల మధ్య జర్మనీ, యుఎఇ ల సందర్శన కు బయలుదేరే ముందుప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన
June 25th, 03:51 pm
జర్మనీ అధ్యక్షత న జరుగనున్న జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవాలంటూ జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానించిన మీదట జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ ను నేను సందర్శించనున్నాను. కిందటి నెల లో జరిగిన భారతదేశం- జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు (ఐజిసి) ఫలప్రదం అయిన తరువాత, జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ ను మరో మారు కలుసుకోనుండడం సంతోషదాయకం కాగలదు. మానవాళి పై ప్రభావాన్ని చూపుతున్నటువంటి ముఖ్యమైన ప్రపంచ అంశాల పై అంతర్జాతీయ సహకారాన్ని పటిష్టపరచడం కోసం ఉద్దేశించిన ప్రయాస లో భాగం గా, అర్జెంటీనా, ఇండోనేశియా, సెనెగల్ మరియు దక్షిణ ఆఫ్రికా ల వంటి ఇతర ప్రజాస్వామిక దేశాల ను కూడా జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవాలంటూ జర్మనీ ఆహ్వానించింది. పర్యావరణం, శక్తి, జలవాయు, ఆహార భద్రత, ఆరోగ్యం, స్త్రీ పురుష సమానత్వం మరియు ప్రజాస్వామ్యం వంటి సమయోచిత అంశాల ను గురించి నేను జి7 సభ్యత్వ దేశాల తో ఆలోచనల ను వ్యక్తం చేసి ఆయా దేశాల ఆలోచనల ను తెలుసుకోబోతున్నాను. ఈ శిఖర సమ్మేళనం సందర్భం లో పాలుపంచుకొనే దేశాలు కొన్నింటి నేతల తో పాటు అతిథి దేశాల నేతల తో భేటీ అవ్వాలని నేను ఆశపడుతున్నాను.జి7 సమిట్ ఒకటో అవుట్ రీచ్ సెశన్ లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
June 12th, 11:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన జి7 సమిట్ ఒకటో అవుట్ రీచ్ సెశన్ లో పాల్గొన్నారు.47వ జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
June 10th, 06:42 pm
యుకె ప్రధాని శ్రీ బోరిస్ జాన్ సన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 12వ, 13వ తేదీ లలో వర్చువల్ విధానం లో జరుగనున్న జి7 సమిట్ తాలూకు అవుట్ రీచ్ సెశన్స్ లో పాలుపంచుకోనున్నారు. ప్రస్తుతం జి7 అధ్యక్ష బాధ్యత ను నిర్వహిస్తున్న యుకె భారతదేశం తో పాటు ఆస్ట్రేలియా ను, కొరియా గణతంత్రాన్ని, దక్షిణ ఆఫ్రికా ను జి7 శిఖర సమ్మేళనానికి అతిథి దేశాలు గా పాల్గొనవలసిందంటూ ఆహ్వానించింది. ఈ సమావేశాన్ని హైబ్రిడ్ పద్ధతి లో నిర్వహించడం జరుగుతుంది.భారత-యూకే వాస్తవిక సాదృశ సమావేశం
May 04th, 06:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయులైన యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇవాళ వాస్తవిక సాదృశ సమావేశంలో పాల్గొన్నారు. భారత-యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల మధ్య చిరకాల స్నేహసంబంధాలున్నాయి. దీంతోపాటు ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, చట్టబద్ధ పాలన తదితరాల సమన్వయంతో కూడిన వ్యూహాత్మక ఉమ్మడి భాగస్వామ్యం ఈ బంధాలను మరింత బలోపేతం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో ద్వైపాక్షిక సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచడం లక్ష్యంగా ప్రతిష్టాత్మక ‘మార్గప్రణాళిక-2030’ని ఆమోదించారు. ప్రజల మధ్య సంబంధాలు, వాణిజ్యం-ఆర్థిక వ్యవస్థ, రక్షణ-భద్రత, వాతావరణ మార్పు కార్యాచరణ, ఆరోగ్యం తదితర ముఖ్యమైన రంగాల్లో రాబోయే పదేళ్లలో మరింత లోతైన, బలమైన సంబంధాల దిశగా ఈ మార్గ ప్రణాళిక దోహదం చేస్తుంది.UK Foreign Secretary Mr Dominic Raab calls on PM
December 16th, 11:57 am
UK Foreign Secretary Mr Dominic Raab called on the Prime Minister Shri Narendra Modi. The discussions covered various facets of the strategic partnership between the two countries.Telephone conversation between PM and President of USA
June 02nd, 09:29 pm
PM Narendra Modi had a telephone conversation with the US President Donald Trump. Their discussion revolved around G-7, COVID-19 situation in the two countries, the situation on the India-China border and the need for reforms in the World Health Organisation.H.E. Mr. Emmanuel Bonne, Foreign Policy Adviser to the President of France calls PM Modi
August 29th, 09:13 pm
H.E. Mr. Emmanuel Bonne, Foreign Policy Adviser to the President of France called on Prime Minister Shri Narendra Modi today.