చక్కెర సీజన్ 2024-25 (అక్టోబర్ - సెప్టెంబర్)కు చక్కెర కర్మాగారాలు చెల్లించవలసిన చెరుకు న్యాయమైన, లాభదాయక ధర (ఎఫ్ఆర్‌పి) ను ఆమోఇంచిన కేబినెట్
February 21st, 11:26 pm
చెరకు కాలం 2024-25కు చక్కెర రికవరీ రేటు 10.25% వద్ద క్వింటాలు చెరకును న్యాయమైన, లాభదాయక ధర ( ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్ - ఎఫ్ ఆర్‌పి) రూ.340కి కొనుగోలు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాలకేబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ చారిత్రిక ధర ప్రస్తుత 2023-24 కాలంలో చెరకు ఎఫ్ఆర్‌పి కన్నా దాదాపు 8% ఎక్కువ. సవరించిన ఎఫ్ఆర్‌పి 01 అక్టోబర్ 2024 నుంచి అమలులోకి వస్తుంది.