నేపాల్ ప్రధాని గా నియమితులైన శ్రీ కె.పి. శర్మ ఓలి ని అభినందించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 15th, 11:39 am

నేపాల్ ప్రధాని గా నియమితులైన శ్రీ కె.పి. శర్మ ఓలి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భారతదేశానికి, నేపాల్ కు మధ్య ఉన్న ప్రగాఢమైన మైత్రి బంధాలను మరింత దృఢతరం చేయడం కోసం, ఉభయ దేశాల పరస్పర ప్రయోజనకర సహకారాన్ని విస్తరింపచేయడం కోసం కలసి పనిచేయాలన్న ఆకాంక్షనను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

ఆస్ట్రియా ఛాన్స‌ల‌ర్ తో క‌లిసి ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఉమ్మ‌డి ప‌త్రికా ప్ర‌క‌ట‌న

July 10th, 02:45 pm

హృద‌య పూర్వ‌క స్వాగ‌తాన్ని ప‌లికి, ఆతిథ్య‌మందించినందుకు మొట్ట‌మొద‌ట‌గా ఛాన్స‌ల‌ర్ నెహ‌మ‌ర్ కు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. ప్ర‌ధానిగా మూడోసారి బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత ఆస్ట్రియాలో ప‌ర్య‌టించే అవ‌కాశం ల‌భించినందుకు చాలా సంతోషంగా వుంది. నా ఈ ప‌ర్య‌ట‌న చారిత్రాత్మ‌క‌మైన‌ది, ప్ర‌త్యేక‌మైన‌ది. 41 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆస్ట్రియాలో ప‌ర్య‌టిస్తున్న భార‌తీయ ప్ర‌ధానిగా నాకు గుర్తింపు ల‌భించింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంలో నేను ప‌ర్య‌టించ‌డం కాక‌తాళీయం, సంతోష‌కరం.

The friendship between Bharat and the UAE is reaching unprecedented heights: PM Modi

February 13th, 11:19 pm

Prime Minister Narendra Modi addressed the 'Ahlan Modi' community programme in Abhi Dhabi. The PM expressed his heartfelt gratitude to UAE President HH Mohamed bin Zayed Al Nahyan for the warmth and affection during their meetings. The PM reiterated the importance of the bond that India and UAE share historically. The PM said, “India and UAE are partners in progress.”

యుఎఇ లో జరిగిన భారతీయ సముదాయం సంబంధి కార్యక్రమం ‘‘అహ్‌లన్ మోదీ’’ లో ప్రధాన మంత్రి ప్రసంగం

February 13th, 08:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవార్థం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) లోని భారతీయ సముదాయం ఏర్పాటు చేసినటువంటి ‘‘అహ్‌లన్ మోదీ’’ కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొని, సభ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో 7 ఎమిరేట్స్ నుండి భారతీయ ప్రవాసుల తో పాటు అన్ని సముదాయాల కు చెందిన భారతీయులు పాల్గొన్నారు. సభ కు హాజరు అయిన వారిలో ఎమిరేట్స్ పౌరులు కూడా ఉన్నారు.