ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గ్లోబ ల్ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 లో ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగానికి తెలుగు సంక్షిప్త అనువాదం...
February 10th, 11:01 am
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమంతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యజి, బ్రజేష్ పాఠక్ జి, కేంద్ర కేబినెట్‌లో నా సీనియర్ సహచరులు, లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, వివిధ దేశాలనుంచి విచ్చేసిన ఘనతవహించిన ప్రతినిధులకు, ఉత్తరప్రదేశ్ కు చెందిన మంత్రులు అందరికీ, పరిశ్రమ వర్గాలకు చెందినవారికి, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమాజానికి, విధాన నిర్ణేతలు, కార్పొరేట్ నేతలు, ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హాజరైన సోదర సోదరీమణులారా, మీ అందరికీ ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హృదయపూర్వక స్వాగతం. ముఖ్య అతిథిగా ఉంటూ మీ అందరికీ స్వాగతం పలికే బాధ్యతను నేను ఎందుకు తీసుకున్నానని మీ అందరూ ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే, నాకు ఇక్కడ అదనపు బాధ్యత కూడా ఉంది. మీరందరూ నన్ను భారతదేశ ప్రధానమంత్రిగా చేశారు. అలాగే నేను ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. నాకు ఉత్తరప్రదేశ్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రజల పట్ల ప్రత్యేక బాధ్యత కూడా ఉంది. ఇవాళ నేను ఆ బాధ్యతను పూర్తి చేసేందుకు నేను ఇందులో భాగస్వామినయ్యాను. అందువల్ల భారతదేశం వివిధ ప్రాంతాలనుంచి అలాగే విదేశాల నుంచి ఉత్తరప్రదేశ్ కు విచ్చేసిన ఇన్వెస్టర్లందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాను.ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను లక్నోలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
February 10th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లక్నోలో ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్లోబల్ ట్రేడ్ షోను, ఇన్వెస్ట్ యుపి 2.0ను ప్రధానమంత్రి ప్రారంభించారు.ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్. దీని ద్వారా విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు, అకడమిక్ రంగానికి చెందిన వారు, ప్రపంచవ్యాప్తంగా గల మేధావులు, నాయకులు, వ్యాపార అవకాశాలపై సమిష్టిగా చర్చించి భాగస్వామ్యాలు కుదుర్చుకుంటారు.ఈ సమ్మేళనం సందర్భగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి స్వయంగా తిలకించారు.నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ – ఆయిల్ పామ్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది
August 18th, 11:54 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆయిల్ పామ్‌పై ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆమోదం తెలిపింది. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ (NMEO-OP) అనే ఈ కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం ఈశాన్య ప్రాంతం మరియు అండమాన్ నికోబార్ దీవులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. వంట నూనెల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో దేశీయంగా నూనెల ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నాలు చేయడం ముఖ్యం. ఆయిల్ పామ్ ఉత్పాదకత పెంపుపై ఈ పథకం ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.