Joint Statement: 2nd India-Australia Annual Summit

November 19th, 11:22 pm

PM Modi and Anthony Albanese held the second India-Australia Annual Summit during the G20 Summit in Rio de Janeiro. They reviewed progress in areas like trade, climate, defence, education, and cultural ties, reaffirming their commitment to deepen cooperation. Both leaders highlighted the benefits of closer bilateral engagement and emphasized advancing the Comprehensive Economic Cooperation Agreement (CECA) to strengthen trade and investment ties.

మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గౌరవనీయ మొహమ్మద్ ముయిజ్జుతో సంయుక్త పత్రికా ప్రకటన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

October 07th, 12:25 pm

భార‌త్‌-మాల్దీవ్స్ సంబంధాల‌కు శతాబ్దాల చ‌రిత్ర ఉంది. ముఖ్యంగా ఈ రెండూ అత్యంత స‌న్నిహిత, ఇరుగుపొరుగు మిత్ర దేశాలు. అలాగే మేము అనుస‌రిస్తున్న పొరుగుకు ప్రాధాన్యం విధానంతో పాటు మా దార్శ‌నిక‌ సాగ‌ర్ కార్య‌క్ర‌మంలో మాల్దీవ్స్‌కు కీల‌క స్థాన‌ముంది. మాల్దీవ్స్ విష‌యంలో ఎల్ల‌ప్పుడూ మొట్ట‌మొద‌ట స్పందించి, త‌న‌వంతు బాధ్య‌త నిర్వ‌ర్తించేది భార‌త‌దేశ‌మే. నిత్యావసరాల కొర‌త తీర్చ‌డంలోనైనా, ప్రకృతి విప‌త్తుల సమయంలో తాగునీటి స‌ర‌ఫ‌రాలోనైనా, కోవిడ్ సంక్షోభం వేళ టీకాలు అందించ‌డంలోనైనా పొరుగు దేశం విష‌యంలో భార‌త్ స‌దా త‌న కర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తిస్తూనే ఉంది. ఇక ఇవాళ పరస్పర సహకారానికి వ్యూహాత్మక దిశ‌ను నిర్దేశించ‌డం కోసం ‘‘సమగ్ర ఆర్థిక-సముద్ర భద్రత భాగస్వామ్యం’’ విధానాన్ని ఆమోదించాం.

వియత్నాం ప్రధాన మంత్రి భారతదేశ పర్యటన సందర్భంగా (ఆగస్టు 01, 2024) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన

August 01st, 12:30 pm

భారతదేశానికి విచ్చేసిన ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్, ఆయన ప్రతినిధి బృందానికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.

శ్రీ కీర్ స్టార్మర్ తో సంభాషించిన ప్రధాన మంత్రి; యుకె ప్రధాని గా ఎన్నికైనందుకు శ్రీ కీర్ స్టార్మర్ కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి

July 06th, 03:02 pm

యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని రైట్ ఆనరబుల్ శ్రీ కీర్ స్టార్మర్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాట్లాడారు.

బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషణ

March 12th, 08:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సముచిత మాననీయ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని రిషి సున‌క్‌తో ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంపై తమ కట్టుబాటు వారిద్దరూ పునరుద్ఘాటించారు. అలాగే మార్గ ప్రణాళిక-2030 కింద వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, వర్ధమాన సాంకేతికతలు వంటి భిన్న రంగాల్లో సాధించిన పురోగతిపై వారు సంతృప్తి వెలిబుచ్చారు. అలాగే ఉమ్మడి ప్రయోజనాలుగల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారుపై చర్చలు వీలైనంత ముందుగా ముగించడంపై పురోగతిని వారు స్వాగతించారు. దీంతోపాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై దేశాధినేతలిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వివిధ అంశాలపై నిరంతరం మమేకం కావాలని వారు నిర్ణయించుకున్నారు. భారతదేశంలో హోలీ పండుగ నేపథ్యంలో పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

When it comes to disruption, development & diversification everybody can agree that this is India's time: PM Modi

February 09th, 08:30 pm

Prime Minister Narendra Modi addressed the ET Now Global Business Summit 2024 at Hotel Taj Palace in New Delhi. The Prime Minister highlighted the significance of the theme of ‘Disruption, Development and Diversification chosen by the Global Business Summit 2024. “When it comes to disruption, development and persification, everybody can agree that this is India’s time”, the PM remarked noting the growing trust towards India in the world.

ఇ.టి.నౌ గ్లోబల్ బిజినెస్ శిఖరాగ్ర సమ్మేళనం 2024ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి.

February 09th, 08:12 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్లో, ఇటి నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024నుద్దేశించి ఈ రోజు ప్రసంగించారు. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024 ఎంచుకున్న ఇతివృత్తం “అంతరాయం, అభివృద్ధి, వైవిధ్యం’’’‘ ప్రాధాన్యత గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతరాయం, అభివృద్ధి, వైవిధ్యం విషయానికి వచ్చినపుడు,ప్రతి ఒక్కరూ ఇది ఇండియా కాలమని అంగీకరిస్తారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాపై విశ్వాసం పెరుగుతున్నదన్నారు. దావోస్లో ఇండియా పట్ల ఎంతో ఆసక్తి వ్యక్తమైన విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇండియా అద్భుతమైన ఆర్థిక విజయగాధకు నిదర్శనమని, ఇండియా డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని అన్నారు.ప్రపంచంలోని ప్రతి రంగంలో ఇండియా కీలక స్థానంలో ఉందన్నారు. ఒక అధికారి ఇండియా సామర్ధ్యాన్ని దూసకుపోతున్న వృషభంతో పోల్చారని ఆయన గుర్తుచేశారు. ప్రపంచంలోని, అభివృద్ధి ఆర్ధిక వేత్తలు గత 10 సంవత్సరాలలో భారతదేశపు పరివర్తనను చర్చిస్తున్నారని , ఇండియా పై విశ్వాసం పెరగడానికి నిదర్శనమని ప్రధానమంత్రి తెలిపారు.

ఆస్ట్రేలియా ప్రధానితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జారీచేసిన పత్రికా ప్రకటనకు తెలుగు అనువాదం

March 10th, 12:50 pm

భారతదేశానికి మొదటిసారిగా అధికార పర్యటన మీద వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానికి నా హృదయ పూర్వక స్వాగతం. రెండు దేశాల ప్రధాన మంత్రుల స్థాయిలో వార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరపాలని నిరుడు రెండు దేశాలూ నిర్ణయించాయి. ఈ క్రమంలో ప్రధాని అల్బనీస్ సందర్శన మొదటిది. హోలీ రోజే ఆయన భారత దేశానికి వచ్చారు. ఆ తరువాత కొంత సేపు మేం క్రికెట్ మైదానంలో గడిపాం. ఈ రంగుల పండుగ వేడుకలు, సంస్కృతి, క్రికెట్ ఒక విధంగా ఇరు దేశాల ఉత్సాహానికీ, స్ఫూర్తికీ సరైన చిహ్నం.

భారతదేశం తో స్వేచ్ఛాయుక్త వ్యాపార ఒప్పందాని కి ఆమోదం తెలిపిన ఆస్ట్రేలియాపార్లమెంటు

November 22nd, 07:05 pm

భారతదేశం తో స్వేచ్ఛాయుక్త వ్యాపార ఒప్పందాని కి ఆస్ట్రేలియా పార్లమెంటు ఆమోదం తెలిపినందుకు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఎంథనీ అల్బనీస్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలను వ్యక్తం చేశారు.

For us, MSME means- Maximum Support to Micro Small and Medium Enterprises: PM Modi

June 30th, 10:31 am

PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.

PM participates in ‘Udyami Bharat’ programme

June 30th, 10:30 am

PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.

ప్రధాన మంత్రి సమక్షంలో ది ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (‘‘IndAus ECTA’’) పై సంతకాలు చేయడం జరిగింది

April 02nd, 10:00 am

వర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించిన ఒక కార్యక్రమం లో భారతదేశం ప్రధాన మంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ మరియు ఆస్ట్రేలియా ప్రధాని మాన్య శ్రీ స్కాట్ మారిసన్ ల సమక్షం లో భారత ప్రభుత్వ వాణిజ్యం మరియు పరిశ్రమ, వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, సార్వజనిక వితరణ మరియు వస్త్రాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ మరియు ఆస్ట్రేలియా ప్రభుత్వం లో వ్యాపారం, పర్యటన, ఇంకా పెట్టుబడి శాఖ మంత్రి శ్రీ డాన్ తెహాన్ లు ఈ రోజు న ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (‘‘IndAus ECTA’’)పై సంతకాలు చేశారు.

భారత-యూకే వాస్తవిక సాదృశ సమావేశం

May 04th, 06:34 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయులైన యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇవాళ వాస్తవిక సాదృశ సమావేశంలో పాల్గొన్నారు. భారత-యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల మధ్య చిరకాల స్నేహసంబంధాలున్నాయి. దీంతోపాటు ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, చట్టబద్ధ పాలన తదితరాల సమన్వయంతో కూడిన వ్యూహాత్మక ఉమ్మడి భాగస్వామ్యం ఈ బంధాలను మరింత బలోపేతం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో ద్వైపాక్షిక సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచడం లక్ష్యంగా ప్రతిష్టాత్మక ‘మార్గప్రణాళిక-2030’ని ఆమోదించారు. ప్రజల మధ్య సంబంధాలు, వాణిజ్యం-ఆర్థిక వ్యవస్థ, రక్షణ-భద్రత, వాతావరణ మార్పు కార్యాచరణ, ఆరోగ్యం తదితర ముఖ్యమైన రంగాల్లో రాబోయే పదేళ్లలో మరింత లోతైన, బలమైన సంబంధాల దిశగా ఈ మార్గ ప్రణాళిక దోహదం చేస్తుంది.