Assam has picked up a new momentum of development: PM Modi at the foundation stone laying of Ammonia-Urea Fertilizer Project in Namrup
December 21st, 04:25 pm
In a major boost to the agricultural sector, PM Modi laid the foundation stone of Ammonia-Urea Fertilizer Project at Namrup in Assam. He highlighted the start of new industries, the creation of modern infrastructure, semiconductor manufacturing, new opportunities in agriculture, the advancement of tea gardens and their workers as well as the growing potential of tourism in Assam. The PM reiterated his commitment to preserving Assam’s identity and culture.PM Modi lays foundation stone of Ammonia-Urea Fertilizer Project of Assam Valley Fertilizer and Chemical Company Limited at Namrup, Assam
December 21st, 12:00 pm
In a major boost to the agricultural sector, PM Modi laid the foundation stone of Ammonia-Urea Fertilizer Project at Namrup in Assam. He highlighted the start of new industries, the creation of modern infrastructure, semiconductor manufacturing, new opportunities in agriculture, the advancement of tea gardens and their workers as well as the growing potential of tourism in Assam. The PM reiterated his commitment to preserving Assam’s identity and culture.హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
December 06th, 08:14 pm
హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో భారత్‌కు, విదేశాలకు చెందిన విశిష్ట అతిథులు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులను, ఇక్కడ తమ అభిప్రాయాలను పంచుకున్న సహచరులను అభినందిస్తున్నాను. శోభన గారు చెప్పిన వాటిలో నేను రెండు విషయాలను గమనించాను. మొదటిది, గతంలో మోదీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇది సూచించారు అని చెప్పారు. మీడియాకు పని చేయమని చెప్పే సాహసం ఈ దేశంలో ఎవరూ చేయరు. కానీ నేను చెప్పాను. శోభన గారు, ఆమె బృందం అత్యంత ఉత్సాహంగా దానిని పూర్తి చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఇప్పుడే ఎగ్జిబిషన్ సందర్శించాను. మీ అందరూ కూడా తప్పనిసరిగా దానిని సందర్శించమని కోరుతున్నాను. ఫొటోగ్రాఫర్ మిత్రులు క్షణాలను చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఫొటోల్లో బంధించారు. ఇక రెండో విషయానికి వస్తే... నేను ఇంకా ఆమె చెప్పిన మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని చెప్పి ఉండొచ్చు. దానికి బదులుగా ‘‘మీరు దేశానికి సేవలందించడం కొనసాగించాలి’’ అని హిందుస్థాన్ టైమ్స్ చెబుతోందన్నారు. ఈ విషయంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.న్యూఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 06th, 08:13 pm
న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన హిందూస్తాన్ టైమ్స్ నాయకత్వ సదస్సు - 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు ఈ సదస్సుకు హాజరు కావడాన్ని గమనించినట్టు తెలిపారు. సదస్సు నిర్వాహకులకు, తమ ఆలోచనలు పంచుకున్నవారందరికీ ఆయన అభినందనలు తెలిపారు. శోభనాజీ ప్రస్తావించిన రెండు అంశాలను తాను శ్రద్ధగా గమనించినట్లు శ్రీ మోదీ తెలిపారు. అందులో మొదటిది, గతంలో తాను ఈ వేదికకు వచ్చినప్పుడు చేసిన ఒక సూచనను ఆమె గుర్తు చేశారని, మీడియా సంస్థల విషయంలో అలా సూచనలు ఇవ్వడం చాలా అరుదని, అయినా తాను ఆ పని చేశానని ఆయన అన్నారు. ఆ సూచనను శోభనా జీ, వారి బృందం ఉత్సాహంగా అమలు చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిబిషన్‌ను సందర్శించినప్పుడు, ఫొటోగ్రాఫర్లు క్షణాలను చిరస్మరణీయంగా మలిచిన తీరును చూశానని, ఆ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ తప్పక చూడాలని ఆయన కోరారు. శోభనా జీ ప్రస్తావించిన రెండో అంశం గురించి శ్రీ మోదీ వివరిస్తూ, తాను దేశానికి సేవ చేస్తూ ఉండాలన్నది కేవలం ఒక ఆకాంక్ష మాత్రమే కాదని, ఇదే విధంగా సేవలు కొనసాగించాలని హిందుస్థాన్ టైమ్స్ పత్రికే స్వయంగా చెబుతున్నట్లుగా తాను భావిస్తున్నానని అన్నారు. ఇందుకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు 2025లో రైతులతో పీఎం సంభాషణ
November 20th, 12:30 pm
ఇవన్నీ విలువ జోడించిన అరటి ఉత్పత్తులే.. ఇవి వ్యర్థాలు.. సార్, ఇది అరటి వ్యర్థాల నుంచి, ఇది అరటి నుంచి తయారు చేసినది సార్తమిళనాడులోని కోయంబత్తూరులో దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు-2025లో రైతులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ
November 20th, 12:16 pm
తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహిస్తున్న దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు - 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రైతులతో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ఆయన అభివాదం చేస్తూ, అరటి పంట దిగుబడిని పరిశీలించారు. అరటి వ్యర్థాలను ఏం చేస్తారని ఆయన వారిని అడిగారు. దీనికి రైతు సమాధానమిస్తూ, ప్రదర్శనకు పెట్టినవన్నీ అరటి వ్యర్థాల్ని ఉపయోగించి తయారు చేసిన వస్తువులేనన్నారు. వారి ఉత్పాదనలను దేశమంతటా ఆన్‌లైన్లో అమ్ముతున్నారా అని ప్రధానమంత్రి అడిగారు. అవును, అమ్ముతున్నామని రైతు బదులిచ్చారు. తాము ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ల (ఎఫ్‌పీఓల)తో పాటు వ్యక్తిగతంగా కూడా పూర్తి తమిళనాడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఆ రైతు చెప్పారు. తమ ఉత్పాదనలను ఇంటర్నెట్ ద్వారా అమ్ముతున్నట్లు, ఎగుమతి చేస్తున్నట్లు, దేశవ్యాప్తంగా స్థానిక మార్కెట్లతో పాటు సూపర్‌మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఒక్కొక్క ఎఫ్‌పీఓలో ఎంత మంది కలిసి పనిచేస్తారని శ్రీ మోదీ అడిగారు. సుమారుగా ఒక వేయి మంది వరకు దీనిలో ఉంటారని రైతు జవాబిచ్చారు. అరటి సాగును ఒకే ప్రాంతంలో చేపడతారా, లేక ఇతర పంటలతో కలిపి సాగు చేస్తారా అని ప్రధాని ప్రశ్నించారు. వివిధ ప్రాంతాలు వేరు వేరు విశిష్ట ఉత్పాదనలలో ప్రావీణ్యాన్ని సంపాదించాయని రైతు వివరణనిస్తూ, తమ వద్ద జీఐ ఉత్పాదనలు కూడా ఉన్నాయని తెలిపారు.తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత ప్రకృతి వ్యవసాయ సదస్సు-2025లో ప్రధానమంత్రి ప్రసంగం
November 19th, 07:01 pm
తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్. రవి, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ ఎల్. మురుగన్, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్. కె. రామస్వామి, వివిధ వ్యవసాయ సంస్థల నుంచి ఇక్కడికి విచ్చేసిన విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, నా ప్రియమైన రైతు సోదరీ, సోదరులు, డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానమైన లక్షలాదిమంది రైతులు! మీ అందరికీ వణక్కం! నమస్కారం! ముందుగా, ఇక్కడ ఉన్న మీ అందరికీ, దేశవ్యాప్తంగా ఉన్న నా రైతు సొదరీ, సోదరులకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు ఒక గంట ఆలస్యం అయ్యింది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నేను సత్య సాయిబాబాకు అంకితం చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు పుట్టపర్తిలో ఉన్నాను. అక్కడ ఆ కార్యక్రమం ఊహించిన దాని కంటే ఎక్కువ సమయం కొనసాగింది. అందుకే, నేను రావడానికి ఆలస్యం అయ్యింది. దీనివల్ల మీకు ఏదైనా అసౌకర్యం కలిగి ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలి. దేశం నలుమూలల నుంచి ఎంతో మంది ఎదురు చూస్తున్నారనే విషయం నాకు తెలుసు. అందుకే వినయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను.తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహిస్తున్న దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ శిఖరాగ్ర సదస్సు-2025లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 19th, 02:30 pm
తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ రోజు దక్షిణ భారత సేంద్రియ వ్యవసాయ సదస్సు-2025ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన శ్రీ మోదీ... కోయంబత్తూరు పవిత్ర గడ్డపై మరుధమలై మురుగన్‌కు నమస్కరిస్తూ తన వ్యాఖ్యలను ప్రారంభించారు. కోయంబత్తూరు సంస్కృతి, కరుణ, సృజనాత్మకతకు నిలయంగా... దక్షిణ భారత పారిశ్రామిక శక్తికి కేంద్రంగా ఉందన్నారు. జాతీయ ఆర్థిక వ్యవస్థకు నగర వస్త్ర రంగం ప్రధానంగా దోహదపడుతోందని ఆయన స్పష్టం చేశారు. కోయంబత్తూరుకు చెందిన మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ సీ.పీ. రాధాకృష్ణన్ ఇప్పుడు భారత ఉపరాష్ట్రపతిగా దేశానికి మార్గనిర్దేశం చేస్తున్నందున ఈ నగరానికి మరింత గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.Talking to you felt like talking to a family member, not the Prime Minister: Farmers say to PM Modi
October 12th, 06:45 pm
During the interaction with farmers at a Krishi programme in New Delhi, PM Modi enquired about their farming practices. Several farmer welfare initiatives like Government e-Marketplace (GeM) portal, PM-Kisan Samman Nidhi, Pradhan Mantri Matsya Sampada Yojana, and PM Dhan Dhaanya Krishi Yojana were discussed. Farmers thanked the Prime Minister for these initiatives and expressed their happiness.కృషి కార్యక్రమంలో భాగంగా రైతులతో సంభాషించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 12th, 06:25 pm
న్యూఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐసీఏఆర్)లో ఈ రోజు ఒక వ్యవసాయ ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా రైతులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. రైతుల సంక్షేమం, వ్యవసాయంలో స్వయంసమృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనను బలపరిచే దిశగా ప్రధానమంత్రి కనబరుస్తున్న నిరంతర నిబద్ధతను ఈ కార్యక్రమం చాటిచెప్పింది. శ్రీ మోదీ ఒక సార్వజనిక కార్యక్రమంలో పాల్గొని, వ్యవసాయ రంగంలో రూ.35,440 కోట్ల ఖర్చుతో రెండు ప్రధాన పథకాలను ప్రారంభించారు. అంతకు ముందు, రైతులతో ఆయన సంభాషించారు. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ పథకానికి రూ.24,000 కోట్లు ఖర్చు చేస్తారు. ‘మిషన్ ఫర్ ఆత్మనిర్భర్‌తా ఇన్ పల్సెస్’ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ పథకానికి రూ.11,440 కోట్లు ఖర్చు చేస్తారు. వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య పరిశ్రమ, ఆహార శుద్ధి రంగాల్లో రూ.5,450 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుతో సంకల్పించిన మరికొన్ని ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. వీటికి అదనంగా, సుమారు రూ.815 కోట్ల ఖర్చుతో చేపట్టిన ఇతర ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు.‘ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన’ ప్రారంభోత్సవం.. న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో ప్రాజెక్టుల ప్రారంభం-శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 11th, 12:30 pm
వేదికపై ఆసీనులైన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, సాంకేతిక మాధ్యమం ద్వారా సంధానితులైన శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, శ్రీ భగీరథ్ ఛౌదరి సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు, దేశవ్యాప్తంగా గల రైతున్నలు, సోదరీసోదరులారా!వ్యవసాయ రంగంలో రెండు ముఖ్య పథకాలను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ: మొత్తం వ్యయం రూ. 35,440 కోట్లు
October 11th, 12:00 pm
న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో ఈ రోజు నిర్వహించిన ప్రత్యేక వ్యవసాయ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు రైతులతో కూడా ప్రధానమంత్రి సంభాషించారు.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగానికి తెలుగు అనువాదం
September 25th, 06:16 pm
రష్యా ఉప ప్రధాని దిమిత్రీ పత్రుషేవ్, మంత్రి వర్గంలో నా సహచరులు చిరాగ్ పాశ్వాన్, శ్రీ రన్వీత్, శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్, వివిధ దేశాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రతినిధులు, విశిష్ట అతిధులు, సోదరీసోదరులారా!వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 25th, 06:15 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు నిర్వహించిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, వినియోగదారులు పాల్గొన్నారనీ, కొత్త పరిచయాలను పెంపొందించుకోవడానికీ, సృజనాత్మకతకు వరల్డ్ ఫుడ్ ఇండియాను వేదికగా మార్చారన్నారు. తాను ఇప్పుడే ఎగ్జిబిషన్‌ను సందర్శించానని చెబుతూ.. పోషకాహారం, వంటనూనె వినియోగాన్ని తగ్గించడం, ప్యాకేజ్డ్ ఉత్పత్తులను ఆరోగ్యకరంగా మార్చడంపై ప్రాథమిక దృష్టి సారించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.న్యూఢిల్లీలో ఎంఎస్ స్వామినాథన్ శతజయంతి అంతర్జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగం
August 07th, 09:20 am
మంత్రివర్గ సహచరుడు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేశ్ చంద్... చాలా మంది స్వామినాథన్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడున్నారు... వారందరికీ కూడా సగౌరవంగా నమస్కరిస్తున్నాను. శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథులు, సోదరీ సోదరులారా!PM Modi addresses the M.S. Swaminathan Centenary International Conference
August 07th, 09:00 am
PM Modi inaugurated and addressed the M.S. Swaminathan Centenary International Conference at ICAR PUSA in New Delhi. Calling Dr. Swaminathan a visionary who ensured India’s food security and turned science into service, PM Modi recalled his pioneering ideas like the Evergreen Revolution and bio-villages. The PM also launched the M.S Swaminathan Award for Food & Peace, reaffirming support for farmers.బిహార్‌లోని భాగల్పూర్లో అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
February 24th, 02:35 pm
ప్రపంచ ప్రఖ్యాత విక్రమశిల మహావిహారం ఉన్న, వసుపూజయ మహర్షి తపస్సు చేసిన, బాబా బుధనాథుని పవిత్ర భూమి, అంగ రాజు దాన వీర శూర కర్ణుడికి చెందిన ఈ ప్రాంత సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు!బీహార్ భాగల్పూర్ నుంచీ ‘పీఏం కిసాన్’ 19వ విడత నిధుల విడుదల సహా పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 24th, 02:30 pm
వ్యవసాయదారుల సంక్షేమమే పరమావధిగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పీఏం కిసాన్ పథకం 19వ విడత నిధులను బీహార్ భాగల్పూర్ వేదికగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు ఇతర సంక్షేమ పథకాలను కూడా ప్రారంభించారు. అంతర్జాలం ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ప్రధాని స్వాగతం పలికారు. మహాకుంభ్ పావన సందర్భంలో మందరాంచల్ ప్రాంతంలోకి అడుగు పెట్టడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని ప్రధాని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత, వారసత్వ సంపదలకు ఆలవాలమైన ఈ ప్రాంతం వికసిత్ భారత్ లక్ష్యానికి కూడా అనువైనదని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు తిల్కా మాంఝీ స్మృతికే గాక భాగల్పూర్ పట్టు నగరంగా కూడా ప్రసిద్ధి చెందిందన్నారు. బాబా అజ్గైబినాథ్ నడయాడిన పవిత్ర క్షేత్రంలో, రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు ప్రారంభమయ్యాయన్నారు. ఇటువంటి శుభదినాల్లో పీఏం కిసాన్ 19వ విడత నిధులను విడుదల చేసే అదృష్టం తనకు దక్కిందని, సుమారు రూ. 22,000 కోట్ల సొమ్ము ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా రైతన్నల ఖాతాల్లోకి జమ అయ్యిందన్నారు.ఈనెల 23 నుంచి 25 వరకు మధ్య ప్రదేశ్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి
February 22nd, 02:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈనెల 23 నుంచి 25 వరకు మధ్యప్రదేశ్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈమేరకు 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోనిచత్తర్‌పూర్ జిల్లాలో మధ్యాహ్నం 2గంటలకు బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు భోపాల్‌లో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 2025ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఆ తర్వాత, మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రధానమంత్రి బీహార్‌లోని భాగల్పూర్ చేరుకుని 19వ విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారు, అలాగే ఆ రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం చేస్తారు. అనంతరం ఆయన సాయంత్రం 6గంటలకు గౌహతి చేరుకుని జూమోయిర్ బినందిని (మెగా జూమోయిర్) 2025 కార్యక్రమానికి హాజరవుతారు. 25వ తేదీ ఉదయం 10:45గంటలకు గౌహతిలో అడ్వాంటేజ్ అస్సాం 2.0 పెట్టుబడి, మౌలిక సదుపాయాల సదస్సు 2025ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.భారత గ్రామీణ మహోత్సవ్ లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
January 04th, 11:15 am
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ గారు, ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన నాబార్డ్ ఉన్నత కార్యవర్గ సభ్యులు, స్వయం సహాయక బృందాల సభ్యులు, సహకార బ్యాంకులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీవోలు), ఇతర విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా,