జూన్ 20వ తేదీమరియు జూన్ 21వ తేదీ లలో జమ్ము లో, కశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి

June 19th, 04:26 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూన్ 20వ తేదీ మరియు 21వ తేదీ లలో జమ్ము ను, ఇంకా కశ్మీర్ ను సందర్శించనున్నారు.

ఢిల్లీలో పీఎం స్వనిధి లబ్దిదారులను ఉద్దేశించి మార్చి 14వ తేదీన ప్రసంగించనున్న ప్రధానమంత్రి

March 13th, 07:10 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని జ్ఎల్ఎన్ స్టేడియంలో పీఎం స్వనిధి పథకం లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన 5,000 మంది వీధి వ్యాపారులతో సహా మొత్తం 1 లక్ష మంది వీధి వ్యాపారులకు (ఎస్‌వి) ఈ పథకం కింద రుణాలు పంపిణీ చేయనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ఢిల్లీ మెట్రో 4వ దశ రెండు అద‌న‌పు కారిడార్‌ల‌కు కూడా శంకుస్థాప‌న చేయ‌నున్నారు.

‘ఇండియా‌స్ టెకేడ్: చిప్స్ ఫార్ వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి; సుమారు 1.25 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన మూడు సెమికండక్టర్ సదుపాయాల కు మార్చి నెల 13 వ తేదీ న ఆయన శంకుస్థాపన చేయనున్నారు

March 12th, 03:40 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి నెల 13 వ తేదీ నాడు ఉదయం పూట 10:30 గంటల వేళ లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ‘ఇండియాస్ టెకేడ్: చిప్స్ ఫార్ వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకోవడం తో పాటుగా సుమారు 1.25 లక్షల కోట్ల రూపాయల విలువ కలిగిన మూడు సెమికండక్టర్ ప్రాజెక్టుల కు శంకుస్థాపన ను కూడా జరపనున్నారు. ఈ సందర్భం లో దేశవ్యాప్తం గా యువత ను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.

సహకార రంగానికి సంబంధించిన పలు కీలక కార్యక్రమాలలో భాగంగా ఫిబ్రవరి 24న ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి

February 22nd, 04:42 pm

దేశంలోని సహకార రంగాన్ని బలోపేతం చేసే ఒక ప్రధాన అడుగులో భాగంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 24 ఫిబ్రవరి, 2024 న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఉదయం 10:30 గంటలకు సహకార రంగానికి సంబంధించిన బహుళ కీలక కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. 11 రాష్ట్రాల్లోని 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సొసైటీలలో (PACS) చేస్తున్న 'సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక' పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.

ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ , ఉత్తర ప్రదేశ్ పర్యటన

February 21st, 11:41 am

ఫిబ్రవరి 22న ఉదయం 10:45 గంటలకు అహ్మదాబాద్ లో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మహేసన చేరుకుని వలీనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు, దర్శనం చేసుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహేసనలోని తారాభ్ లో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని రూ.8,350 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4:15 గంటలకు నవ్సారికి చేరుకుని, అక్కడ రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల జాతికి అంకితం చేసి, శంకుస్థాపన, సుమారు రూ.17,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన, పనుల ప్రారంభం చేస్తారు. సాయంత్రం 6:15 గంటలకు ప్రధాన మంత్రి కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ ను సందర్శిస్తారు. అక్కడ రెండు కొత్త ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లను (పిహెచ్ డబ్ల్యుఆర్) జాతికి అంకితం చేస్తారు.

ఫిబ్రవరి 16 వ తేదీ నాడు రేవాడీ ని సందర్శించనున్న ప్రధాన మంత్రి

February 15th, 03:10 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 16 వ తేదీ నాడు హరియాణా లోని రేవాడీ ని సందర్శించనున్నారు. మధ్యాహ్నం పూట సుమారు ఒంటి గంట పదిహేను నిమిషాల వేళ లో పట్టణ ప్రాంత రవాణా, ఆరోగ్యం, రైళ్ల రంగం మరియు పర్యటన రంగాల కు చెందిన, 9750 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ను ఆయన ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటు శంకుస్థాపన చేయనున్నారు.

ఫిబ్రవరి 16 వ తేదీ న ‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

February 15th, 03:07 pm

వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2024 ఫిబ్రవరి 16 వ తేదీ నాడు ఉదయం పూట 11 గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం లో భాగం గా 17,000 కోట్ల రూపాయల కు పైగా వ్యయమయ్యే అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవం, దేశ ప్రజల కు ఆ ప్రాజెక్టుల ను అంకితం చేయడంల తో పాటు ఆ ప్రాజెక్టుల కు శంకుస్థాపన లు కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టు లు రహదారులు, రైలు మార్గాలు, సౌర శక్తి, విద్యుత్తు ప్రసారం, త్రాగునీరు మరియు పెట్రోలియమ్, ఇంకా ప్రాకృతిక వాయువు లు సహా అనేక మహత్వపూర్ణ రంగాల అవసరాల ను తీర్చుతాయి.

డిసెంబర్4న దేహ్ రాదూన్ లో అనేక పథకాల ను ప్రారంభించడం తో పాటు మరికొన్నిపథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్న ప్రధాన మంత్రి; ఈ పథకాల విలువ సుమారు 18,000 కోట్ల రూపాయలు

December 01st, 12:06 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 4 వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో దేహ్ రాదూన్ లో పర్యటించనున్నారు. దాదాపు గా 18,000 కోట్ల రూపాయల వ్యయం కలిగిన పలు ప్రాజెక్టుల లో కొన్నిటిని ఆయన ప్రారంభించి మరి కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమైన రహదారుల కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచడం పై ఈ పర్యటన కాలం లో శ్రద్ధ తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు లు ప్రయాణాన్ని సాఫీ గా, సురక్షితం గా మలచగలవు. అంతేకాదు, ఈ ప్రాంతం లో పర్యటన అవకాశాల ను కూడా పెంచగలవు. ఒకప్పుడు చేరుకోవడం కష్టం అని భావించిన మారుమూల ప్రాంతాల కు సంధానం సౌకర్యాన్ని పెంచాలన్న మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ ప్రాజెక్టు లు ఉన్నాయి.

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

September 14th, 12:01 pm

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి. ఆనందిబెన్ పటేల్ గారు, ఉత్తర ప్రదేశ్ యువ, చురుకైన ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్ గారు, ఉప ముఖ్యమంత్రి, దినేష్ శర్మ గారు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, అలీగఢ్ కు చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా,

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి కి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి

September 14th, 11:45 am

అలీగఢ్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి తాలూకు నిర్మాణ పనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్ సింహ్ స్టేట్ యూనివర్సిటి, ఉత్తర్ ప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ తాలూకు అలీగఢ్ నోడ్ నమూనా ల ప్రదర్శన ను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.

బిహార్ లో ప‌ట్ట‌ణ ప్రాంత మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కు చెందిన ఏడు ప్రాజెక్టుల కు సెప్టెంబ‌ర్ 15న శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వం చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి

September 14th, 02:45 pm

బిహార్ లో ప‌ట్ట‌ణ ప్రాంత మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న కు చెందిన ఏడు ప్రాజెక్టుల కు సెప్టెంబ‌ర్ 15న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా శంకుస్థాప‌న‌, ప్రారంభోత్స‌వం చేస్తారు. వీటిలో నాలుగు ప్రాజెక్టులు నీటి స‌ర‌ఫ‌రాకు సంబంధించిన‌వి, రెండు ప్రాజెక్టులు మురుగునీటి శుద్ధి, ఒక ప్రాజెక్టు న‌దీ ముఖం అభివృద్ధికి సంబంధించిన‌వి. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్య‌యం 541 కోట్ల రూపాయ‌లు. ఈ ప్రాజెక్టుల అమ‌లు బాధ్య‌త ను బిహార్ ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ నిర్మాణ విభాగానికి చెందిన బియుఐడిసిఒ చేప‌ట్టింది. ఈ కార్య‌క్ర‌మం లో బిహార్ ముఖ్య‌మంత్రి కూడా పాలుపంచుకొంటారు.

ఎన్ఇపి 2020పై గవర్నర్ల సమావేశంలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం

September 07th, 11:20 am

గౌరవ రాష్ట్రపతి, నా కేబినెట్ సహచరులు శ్రీ రమేశ్ నిశాంక్ జీ, సంజయ్ ధోత్రే జీ, గౌరవ గవర్నర్లు, లెఫ్టనెంట్ గవర్నర్లు, రాష్ర్టాల ముఖ్యమంత్రులు, జాతీయ విద్యావిధానానికి రూపకల్పన చేయడంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ కస్తూరి రంగన్ జీ, ఆయన బృందం, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ చాన్సలర్లు, విద్యావేత్తలు, ఈ సమావేశంలో భాగం పంచుకుంటున్న సోదర సోదరీమణులారా

జాతీయ విద్యావిధానం పై గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

September 07th, 11:19 am

జాతీయ విద్యావిధానం పై గవర్నర్ల సమావేశం ప్రారంభ సదస్సు ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సమావేశానికి భారతదేశ రాష్ట్రపతి తో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అన్ని రాష్ట్రాల విశ్వవిద్యాలయాల ఉప కులపతులు కూడా హాజరయ్యారు.

సోషల్ మీడియా కార్నర్ 18 ఫెబ్రవరి 2018

February 18th, 08:45 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

భారతదేశంలో పెరుగుతున్న విమానయాన రంగానికి నాణ్యత మౌలిక సదుపాయాలు అవసరముంది: ప్రధాని మోదీ

February 18th, 05:02 pm

నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం భూమిపూజలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు మరియు జెఎన్పిటి నాలుగో కంటైనర్ టెర్మినల్ను ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ, భారతదేశం యొక్క విమానయాన రంగం విపరీతంగా పెరుగుతోంది. విమానయానం చేసే ప్రజల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది విమానయాన రంగం లో నాణ్యమైన మౌలిక సదుపాయాలను ప్రాముఖ్యత తెస్తుంది.

న‌వీ ముంబ‌యి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి; జెఎన్‌పిటి లోని నాలుగో కంటేన‌ర్ టర్మిన‌ల్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.

February 18th, 05:01 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న‌వీ ముంబ‌యి అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం యొక్క భూమి పూజ కార్య‌క్ర‌మానికి హాజర‌య్యారు. న‌వీ ముంబ‌యి లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని, జ‌వాహ‌ర్‌లాల్ నెహ్రూ పోర్టు ట్ర‌స్టు లోని నాలుగో కంటేన‌ర్ ట‌ర్మిన‌ల్ ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు.

మేము ఏవియేషన్ ను సరసమైనదిగా చేసి పేదలకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చాము: ప్రధాని మోదీ

October 07th, 02:24 pm

గుజరాత్లోని రాజ్కోట్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునాది వేశారు. సురేంద్రనగర్లో జరిగిన బహిరంగ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, అభివృద్ధి నిర్వచనం మారుతుందని అన్నారు. ఈ జిల్లాలో ఒక విమానాశ్రయము వస్తుందని ఎవరు ఊహించారు? అలాంటి అభివృద్ధి పనులు పౌరులకు శక్తినిస్తాయి. అని ఆయన అన్నారు.

రాజ్ కోట్ లో నూతన విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి; చోటిలా లో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని

October 07th, 02:23 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సురేంద్రనగర్ జిల్లా లో చోటిలా లో ఓ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్ కోట్ లో ఒక గ్రీన్ ఫీల్డ్ ఏర్ పోర్ట్ నిర్మాణానికి, అహమదాబాద్-రాజ్ కోట్ జాతీయ రహదారిని ఆరు దోవలుగా విస్తరించడానికి, రాజ్ కోట్-మోర్ బీ స్టేట్ హైవే ను నాలుగు దోవలుగా విస్తరించడానికి సంబంధించి శంకుస్థాపనలు చేశారు.

జిఎస్టి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలతో మన పౌరులకు ముందే దీపావళి ప్రారంభమైంది: ప్రధాని

October 07th, 12:04 pm

ఒఖా మరియు బెయ్ట్ ద్వారకా మధ్య వంతెన కోసం నరేంద్ర మోదీ పునాది రాయిని ఏర్పాటు చేశారు. బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తూ, మౌలిక సదుపాయాలను నిర్మించడంపై ప్రధాని మోదీ నొక్కిచెప్పారు.

గుజరాత్లో ఒఖా మరియు బెట్ ద్వారకా మధ్య వంతెన నిర్మాణానికి పునాది రాయి వేసిన ప్రధాని మోదీ

October 07th, 12:03 pm

గుజరాత్లో ఒఖా మరియు బెట్ ద్వారకా మధ్య వంతెన నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాది రాయి వేశారు. ఆ సందర్భంగా బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తూ, అభివృద్ధికి మరియు ఆర్ధిక వ్య్వవహారాలు మెరుగుపడడానికి మౌలిక సదుపాయాలను నిర్మించడంపై ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.