అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

August 03rd, 09:35 am

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర సదస్సు అధ్యక్షుడు డాక్టర్ మతీన్ కైమ్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేష్ గారు, భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మా సహచరులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, భాగస్వాములు, మహిళలు, పెద్దమనుషులారా..

వ్య‌వ‌సాయ ఆర్థిక‌వేత్త‌ల 32వ అంత‌ర్జాతీయ స‌మావేశాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

August 03rd, 09:30 am

అంత‌ర్జాతీయ వ్య‌వ‌సాయ ఆర్థిక‌వేత్త‌ల 32వ స‌మావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని జాతీయ వ్య‌వ‌సాయ‌శాస్త్ర కేంద్రం ( ఎన్ ఏ ఎస్ సి) స‌ముదాయంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ ఏడాది స‌మావేశ థీమ్ సుస్థిర వ్య‌వ‌సాయ‌, ఆహార వ్య‌వ‌స్థ‌ల దిశ‌గా ప‌రివ‌ర్త‌న‌. వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు , సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయ అత్యవసర అవసరాన్ని చాట‌డ‌మే ఈ సమావేశ‌ లక్ష్యం. దాదాపు 75 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సమావేశాన్ని ఆగస్టు 3న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

August 02nd, 12:17 pm

వ్యవసాయ ఆర్థికవేత్తల ముప్ఫై రెండో అంతర్జాతీయ సమావేశాన్ని (ఐసిఎఇ) శనివారం, అంటే 2024 ఆగస్టు 3న, న్యూ ఢిల్లీ లోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ (ఎన్ఎఎస్‌సి) కాంప్లెక్స్ లో ఉదయం సుమారు 9 గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

పీఎం-కిసాన్ పథకం కింద 10వ విడత ఆర్థిక ప్రయోజనం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 01st, 12:31 pm

ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన ప్రముఖులు, మాతా వైష్ణో దేవి కాంప్లెక్స్‌ లో జరిగిన ఘోర ప్రమాదంపై నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తొక్కిసలాటలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నా సానుభూతి. జమ్మూ కాశ్మీర్ పరిపాలనతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడాను. సహాయక చర్యలు, క్షతగాత్రుల చికిత్స కోసం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

‘పీఎం-కిసాన్‌ పదో విడత నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి

January 01st, 12:30 pm

దేశంలో అట్టడుగునగల రైతుల సాధికారత దిశగా నిరంతర నిబద్ధత, సంకల్పాలకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పీఎం-కిసాన్‌) పథకం కింద 10వ విడత ఆర్థిక లబ్ధిని విడుదల చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగాగల 10 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు రూ.20,000 కోట్లకుపైగా నిధులు బదిలీ అయ్యాయి. ఇదే కార్యక్రమంలో భాగంగా దాదాపు 351 రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పీవో)లకు ‘వాటా మూలధన సహాయం’ (ఈక్విటీ గ్రాంట్‌) కింద రూ.14 కోట్లకుపైగా నిధులను కూడా ప్రధాని విడుదల చేశారు. దీనివల్ల దేశంలోని 1.24 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అనంతరం ప్రధానమంత్రి ‘ఎఫ్‌పీవో’ల ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, వ్యవసాయ మంత్రులు, రైతులు ఈ కార్యక్రమంతో సంధానమయ్యారు.

మధ్య ప్రదేశ్ లో ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో సమావేశమైన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

October 06th, 12:31 pm

స్వామిత్వ పథకం ద్వారా గ్రామాల్లో సృష్టించబడిన విశ్వాసం, నమ్మకం లబ్ధిదారులతో సంభాషణలో స్పష్టంగా కనిపిస్తుంది. అది నేను ఇక్కడ చూడగలుగుతున్నాను. మీరు మీ వెదురు కుర్చీలను చూపించారు కానీ ప్రజల ఉత్సాహంపై నా దృష్టి నిలిచింది. ప్రజల నుండి ఎంతో ప్రేమ మరియు ఆశీర్వాదాలతో, ఈ పథకం వల్ల ప్రజలకు కలిగే సంక్షేమ ప్రయోజనాలను నేను స్పష్టంగా ఊహించగలను. నాకు కొందరు సహచరులతో మాట్లడే అవకాశం లభించిన తరువాత, వారు ఇచ్చిన వివరణాత్మక సమాచారంలో ఈ ప్రణాళిక ఎలా గొప్ప శక్తిగా ఎదుగుతుందో నేను సవిస్తరంగా పంచుకున్న అనుభవాలు తెలియజేస్తున్నాయి. స్వమిత్వా పథకం ప్రారంభించిన తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ప్రజలకు సులభమైంది.

మధ్య ప్రదేశ్ లో ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో సమావేశమైన ప్రధాన మంత్రి

October 06th, 12:30 pm

మధ్య ప్రదేశ్ లోని ‘స్వామిత్వ పథకం’ లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఇదే కార్యక్రమం లో 1,71,000 మంది లబ్ధిదారుల కు ఇ-ప్రాపర్టి కార్డుల ను కూడా ప్రధాన మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు, మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, లబ్ధిదారులు, గ్రామాల అధికారులు, జిల్లాల అధికారుల తో పాటు రాష్ట్రం అధికారులు కూడా పాలుపంచుకొన్నారు.

పిఎం-కిసాన్ సమ్మాన్ నిధి కింద తదుపరి విడత ఆర్థిక సహాయం విడుదల చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 09th, 12:31 pm

గత అనేక రోజులుగా, నేను ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధిదారులతో చర్చిస్తున్నాను. ప్రభుత్వం రూపొందించిన పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలా చేరుతున్నాయనే విషయం మనం మరింత మెరుగైన పద్ధతిలో తెలుసుకుంటున్నాం.ఇది జనతా జనార్దన్‌ తో ప్రత్యక్ష సంబంధం వల్ల కలిగే ప్రయోజనం. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రివర్గం లోని నా సహచరులు, గౌరవనీయమైన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు మరియు అనేక రాష్ట్రాల నుండి హాజరైన ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రముఖులు, రైతులు మరియు సోదర సోదరీమణులారా,

పిఎమ్ కిసాన్ తాలూకు తొమ్మిదో కిస్తీ ని విడుదల చేసిన ప్రధాన మంత్రి

August 09th, 12:30 pm

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ (పిఎమ్ -కిసాన్) లో భాగం గా ఇచ్చే ఆర్థిక ప్రయోజనం తాలూకు తరువాతి కిస్తీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు అంటే ఆగస్టు 9న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేశారు. దీనితో 9.75 కోట్లకు పై చిలుకు లబ్ధిదారు రైతు కుటుంబాల కు 19,500 కోట్ల రూపాయల ఎంతో విలువైన సొమ్ము ను బదలాయించడానికి వీలు చిక్కింది. ఇది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎమ్-కిసాన్) లో భాగం గా ఇచ్చినటువంటి ఆర్థిక ప్రయోజనం తాలూకు తొమ్మిదో కిస్తీ. ఈ కార్యక్రమం లో లబ్ధిదారు రైతుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.

ఈరోజు పేదల సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది: ప్రధాని మోదీ

August 03rd, 12:31 pm

గుజరాత్‌లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో ప్రధాని మోదీ సంభాషించారు. ఈ పథకం గురించి మరింత అవగాహన కల్పించడానికి రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్య కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద గుజరాత్‌లోని లక్షలాది కుటుంబాలు ఉచిత రేషన్ పొందుతున్నాయని ప్రధాని ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ఉచిత రేషన్ పేదలకు బాధను తగ్గిస్తుంది మరియు వారికి విశ్వాసాన్ని ఇస్తుంది.

గుజరాత్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతోమాట్లాడిన ప్రధాన మంత్రి

August 03rd, 12:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’’ లబ్ధి దారుల తో ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ పథకాన్ని గురించి మరింత జాగృతి ని వ్యాప్తి చేయడం కోసం ఆ రాష్ట్రం లో ఒక ప్రజా భాగస్వామ్య కార్య్రకమాన్ని ప్రారంభించడం జరిగింది.

People of Assam trust NDA for development and peace, says PM Modi in Kokrajhar

April 01st, 11:01 am

Ahead of the third and last phase of assembly elections, Prime Minister Narendra Modi addresses a public rally in Assam's Kokrajhar today. He said, “Football is very popular among youth here. If I have to speak in their language, I would say that the people have yet again shown a Red Card to Congress and its Mahajot. People of Assam trust NDA for development, peace, security of the state.”

PM Modi addresses public meeting at Kokrajhar, Assam

April 01st, 11:00 am

Ahead of the third and last phase of assembly elections, Prime Minister Narendra Modi addresses a public rally in Assam's Kokrajhar today. He said, “Football is very popular among youth here. If I have to speak in their language, I would say that the people have yet again shown a Red Card to Congress and its Mahajot. People of Assam trust NDA for development, peace, security of the state.”

పాత్ర‌త క‌లిగిన నాయ‌కుల‌ కు, యోధుల‌ కు త‌గినంత గౌరవాన్ని ఇవ్వ‌ని చ‌రిత్ర తాలూకు పొర‌పాట్లను మేము స‌వ‌రిస్తున్నాము: ప్ర‌ధాన మంత్రి

February 16th, 02:45 pm

దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకొన్న తరువాత మనం 75వ సంవ‌త్స‌రం లోకి అడుగుపెడుతున్న నేపథ్యం లో దేశానికి విశేష‌మైనటువంటి తోడ్పాటు ను అందించిన క‌థానాయ‌కుల, క‌థానాయిక‌ల యొక్క తోడ్పాటు ను స్మ‌రించుకోవ‌డం మరింత ముఖ్య‌ం అయిపోతుంది అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. భార‌త‌దేశం కోసం, భార‌తీయ‌త కోసం స‌ర్వ‌స్వాన్ని త్యాగం చేసిన‌ వారికి చ‌రిత్ర పుస్త‌కాల లో ఇవ్వ‌వ‌ల‌సినంత గౌర‌వాన్ని ఇవ్వ‌డం జరుగలేదు అంటూ ఆయ‌న విచారాన్ని వ్య‌క్తం చేశారు. ఈ అపసవ్యాలను, భార‌త‌దేశ చ‌రిత్ర ర‌చ‌యిత‌ ల ద్వారా దేశ చ‌రిత్ర నిర్మాత‌ల కు జ‌రిగిన అన్యాయాన్ని మ‌నం మ‌న స్వాతంత్య్ర 75వ సంవ‌త్స‌రం లోకి ప్రవేశించనున్న ఈ త‌రుణం లో ప్ర‌స్తుతం స‌రిదిద్ద‌డం జ‌రుగుతున్నద‌ని ఆయ‌న అన్నారు. వారి తోడ్పాటు ను ఈ దశ లో గుర్తు కు తెచ్చుకోవ‌డం అధిక ప్రాముఖ్యాన్ని సంత‌రించుకొంటుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. మంగ‌ళ‌వారం నాడు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని బహ్ రాయిచ్‌ లో చిత్తౌరా స‌ర‌స్సు అభివృద్ధి ప‌నులకు, మ‌హారాజా సుహేల్‌ దేవ్ స్మారకానికి ప్రధాన మంత్రి శంకుస్థాప‌న చేసిన తరువాత ప్ర‌ధాన మంత్రి ప్రసంగించారు.

ఉత్తర ప్రదేశ్ లోని బహ్రాయిచ్ వద్ద మహారాజా సుహెల్దేవ్ స్మారక చిహ్నం, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

February 16th, 11:24 am

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని బ‌హ్‌రాయిచ్ లో మ‌హారాజా సుహేల్‌ దేవ్ స్మార‌కానికి, చిత్తౌరా స‌ర‌స్సు అభివృద్ధి ప‌నుల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా శంకుస్థాప‌న చేశారు. మ‌హారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య క‌ళాశాల భ‌వ‌నాన్ని కూడా ప్ర‌ధాన ‌మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కూడా పాలుపంచుకొన్నారు.

మహారాజా సుహేల్ దేవ్‌ స్మారకాని కి, చిత్తౌరా స‌ర‌స్సు అభివృద్ధి ప‌నుల కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

February 16th, 11:23 am

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని బ‌హ్‌రాయిచ్ లో మ‌హారాజా సుహేల్‌ దేవ్ స్మార‌కానికి, చిత్తౌరా స‌ర‌స్సు అభివృద్ధి ప‌నుల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం నాడు, అంటే ఈ నెల 16న, వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా శంకుస్థాప‌న చేశారు. మ‌హారాజా సుహేల్‌దేవ్ పేరు ను పెట్టినటువంటి ఒక వైద్య క‌ళాశాల భ‌వ‌నాన్ని కూడా ప్ర‌ధాన ‌మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కూడా పాలుపంచుకొన్నారు.

Freight corridors will strengthen Aatmanirbhar Bharat Abhiyan: PM Modi

December 29th, 11:01 am

Prime Minister Narendra Modi inaugurated the New Bhaupur-New Khurja section of the Eastern Dedicated Freight Corridor in Uttar Pradesh. PM Modi said that the Dedicated Freight Corridor will enhance ease of doing business, cut down logistics cost as well as be immensely beneficial for transportation of perishable goods at a faster pace.

న్యూ భావూపుర్‌-న్యూ ఖుర్జా సెక్ష‌న్ ను మ‌రియు ఈస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్ తాలూకు ఆప‌రేష‌న్ కంట్రోల్ సెంట‌ర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

December 29th, 11:00 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ భావూపుర్‌-న్యూ ఖుర్జా సెక్ష‌న్ ను మ‌రియు ఈస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్‌ తాలూకు ఆప‌రేష‌న్ కంట్రోల్ సెంట‌ర్ ను వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయ‌ల్‌, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ యోగి ఆదిత్య‌నాథ్ లు కూడా పాల్గొన్నారు.

Kisan Rail is a major step towards increasing farmers' income: PM

December 28th, 04:31 pm

PM Modi flagged off the 100th Kisan Rail from Sangola in Maharashtra to Shalimar in West Bengal. He termed the Kisan Rail Service as a major step towards increasing the income of the farmers of the country.

వందో కిసాన్ రైలుకు ప్రారంభ సూచ‌కంగా జెండా చూపిన ప్ర‌ధాన‌ మంత్రి

December 28th, 04:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మ‌హారాష్ట్ర లోని సంగోలా నుంచి పశ్చిమ బంగాల్ లోని శాలిమార్ కు న‌డిచే వందో కిసాన్ రైలు కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజున జెండా ను చూపి, ఆ రైలును ప్రారంభించారు. ఈ సంద‌ర్భం లో కేంద్ర మంత్రులు శ్రీ న‌రేంద్ర సింహ్ తోమ‌ర్‌, శ్రీ పీయూష్ గోయ‌ల్ లు కూడా పాల్గొన్నారు.