రాజ్యాంగమే మనకు మార్గదర్శకం: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

December 29th, 11:30 am

మన్ కీ బాత్ యొక్క ఈ ఎపిసోడ్‌లో, రాజ్యాంగం యొక్క 75వ వార్షికోత్సవం మరియు ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ సన్నాహాలతో సహా భారతదేశం సాధించిన విజయాలను ప్రధాని మోదీ ప్రతిబింబించారు. బస్తర్ ఒలింపిక్స్ విజయాన్ని ఆయన ప్రశంసించారు మరియు ఆయుష్మాన్ భారత్ పథకం కింద మలేరియా నిర్మూలన మరియు క్యాన్సర్ చికిత్సలో పురోగతి వంటి ముఖ్యమైన ఆరోగ్య పురోగతులను హైలైట్ చేశారు. అదనంగా, ఒడిశాలోని కలహండిలో వ్యవసాయ పరివర్తనను ఆయన ప్రశంసించారు.

దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని భాగంగా చేసుకోవాలని ప్రధాన మంత్రి పిలుపు

December 21st, 12:28 pm

ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శనివారం పిలుపునిచ్చారు. మనిషి జీవితంలో, అలాగే సమాజంలోనూ, ప్రపంచంలోనూ శాంతి సామరస్యాలను పెంపొందించడానికి ధ్యానం శక్తిమంతమైన సాధనమని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

December 07th, 05:52 pm

పవిత్రమైన కార్యకర్ సువర్ణ మహోత్సవం సందర్భంగా, భగవాన్ స్వామి నారాయణుని పాదాలకు వినమ్రతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురు హరి ప్రగత్ బ్రహ్మ స్వరూపమైన ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి ఈ రోజు. ఆయనకు కూడా భక్తితో నమస్కరిస్తున్నాను. పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్ చేస్తున్న నిర్విరామ కృషి, అంకిత భావం ద్వారానే భగవాన్ స్వామి నారాయణుడి బోధనలు, ప్రముఖ్ స్వామి మహరాజ్ తీర్మానాలు ఈ రోజు నిజరూపం దాలుస్తున్నాయి. లక్ష మంది వాలంటీర్లు, యువత, చిన్నారులు భాగం పంచుకుంటున్న ఈ అద్బుతమైన సాంస్కృతిక కార్యక్రమం విత్తనం, చెట్టు, ఫలం అనే భావనను అందంగా సూచిస్తోంది. నేను అక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ, ఈ కార్యక్రమ ఉత్సాహాన్ని, శక్తినీ నా హృదయం అనుభూతి చెందుతోంది. ఇంత గొప్ప దైవిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, మహనీయులైన సాధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినయంగా నమస్కరిస్తున్నాను.

అహమదాబాద్ లో కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 07th, 05:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్‌లో ఏర్పాటైన కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మొదట పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, ఆరాధనీయులైన సాధు సంతులకు, సత్సంగి కుటుంబ సభ్యులకు, ఇతర ప్రముఖులకు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ చరణాలకు శ్రీ మోదీ ప్రణామాన్ని ఆచరించారు. ఈ రోజు ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి సందర్భం కూడా అని ప్రధాని గుర్తుకు తీసుకువచ్చారు. భగవాన్ స్వామి నారాయణ్ ప్రబోధాలు, ప్రముఖ్ స్వామి మహారాజ్ సంకల్పాలు పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌ కఠోర శ్రమతో, అంకితభావం తో నెరవేరుతున్నాయని కూడా శ్రీ మోదీ అన్నారు. సుమారు ఒక లక్షమంది కార్యకర్తలతోపాటు యువతీయువకులు, బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇదెంత భారీ కార్యక్రమమో చెప్పకనే చెబుతోందని, దీనిని చూడడం తనకు సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు. తాను సభాస్థలిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఈ కార్యక్రమంలో ఉత్సాహాతిరేకం ఏ స్థాయిలో వెల్లువెత్తుతోందీ తనకు తెలుస్తూనే ఉందన్నారు. పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, సాధువులందరికీ ఈ భవ్య దివ్య కార్యక్రమానికిగాను ఆయన తన అభినందనలను అందజేశారు.

నేడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

October 27th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా జీవితంలో మరపురాని క్షణాలేవని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ప్రత్యేకమైన మరపురాని ఒక క్షణం ఉంది- అది గత సంవత్సరం నవంబర్ 15 వ తేదీన జరిగింది. ఆరోజు నేను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్ళాను. ఈ యాత్ర నాపై చాలా ప్రభావం చూపింది. ఈ పుణ్యభూమి మట్టిని తలతో తాకే భాగ్యం పొందిన దేశ తొలి ప్రధానమంత్రిని నేనే. ఆ క్షణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న శక్తి తెలిసిరావడమే కాకుండా ఈ భూ శక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా వచ్చింది. ఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో నేను గ్రహించాను.

చెస్ ఒలింపియాడ్ విజేతలతో ప్రధాన మంత్రి ముఖాముఖి - తెలుగు అనువాదం

September 26th, 12:15 pm

సర్, భారతదేశం రెండు బంగారు పతకాలు గెలవడం ఇదే మొదటిసారి. జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. బాలురు 22 పాయింట్లకు 21 పాయింట్లు, బాలికలు 22 పాయింట్లకు 19 పాయింట్లు సాధించారు. మొత్తం 44 పాయింట్లకు 40 పాయింట్లు సాధించాం. ఇంత భారీ, ఆకట్టుకునే ప్రదర్శన ఇంతకు ముందెన్నడూ జరగలేదు.

PM Modi meets and encourages our Chess Champions

September 26th, 12:00 pm

PM Modi spoke with India's chess team after their historic dual gold wins. The discussion highlighted their hard work, the growing popularity of chess, AI's impact on the game, and the importance of determination and teamwork in achieving success.

అంతరిక్ష రంగ సంస్కరణల ద్వారా దేశంలోని యువత ప్రయోజనం పొందారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

August 25th, 11:30 am

మిత్రులారా! అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల దేశంలోని యువతకు కూడా చాలా ప్రయోజనం లభించింది. కాబట్టి ఈ రోజు 'మన్ కీ బాత్'లో అంతరిక్ష రంగానికి సంబంధించిన కొంతమంది యువ సహోద్యోగులతో సంభాషించాలని నేను అనుకున్నాను. నాతో మాట్లాడేందుకు స్పేస్ టెక్ స్టార్ట్ అప్ GalaxEye బృందం సిద్ధంగా ఉంది. ఈ స్టార్టప్‌ను ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. ఈ యువకులు – సూయశ్, డేనిల్, రక్షిత్, కిషన్, ప్రణీత్- ఈరోజు ఫోన్ లైన్‌లో మనతో ఉన్నారు. రండి, ఈ యువత అనుభవాలను తెలుసుకుందాం.

రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 30th, 11:00 am

మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.

The atmosphere, energy and experience from Yoga can be felt in Jammu & Kashmir today: PM Modi in Srinagar

June 21st, 06:31 am

PM Modi addressed the 10th International Day of Yoga event in Srinagar, Jammu & Kashmir. PM Modi said that the world is looking at yoga as a powerful agent of global good and it enables us to live in the present without the baggage of the past. PM Modi emphasized, “Yoga helps us realize that our welfare is related to the welfare of the world around us. When we are peaceful within, we can also make a positive impact on the world.”

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2024 సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

June 21st, 06:30 am

పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐవైడి) సందర్భంగా ఇవాళ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఐవైడి’ నేపథ్యంలో సామూహిక యోగాభ్యాస వేడుకకు ఆయన నాయకత్వం వహిస్తూ యోగాసనాలు వేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ- ‘యోగా-సాధన’లకు పుట్టినిల్లయిన జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరు కావడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘‘యోగా వాతావరణం, శక్తి, అనుభూతిని నేడు జమ్ముకశ్మీర్‌లో అనుభవించవచ్చు’’ అని శ్రీ మోదీ అన్నారు. ‘ఐవైడి’ నేపథ్యంలో దేశ పౌరులందరితోపాటు ప్రపంచవ్యాప్త యోగా సాధకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

జూన్ 20వ తేదీమరియు జూన్ 21వ తేదీ లలో జమ్ము లో, కశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి

June 19th, 04:26 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జూన్ 20వ తేదీ మరియు 21వ తేదీ లలో జమ్ము ను, ఇంకా కశ్మీర్ ను సందర్శించనున్నారు.

శశాంకాసనను గురించిన వీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

June 19th, 08:36 am

శశాంకాసన (కుందేలు భంగిమ) ను గురించి న ఒక వీడియో క్లిప్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ యోగాసన భంగిమ మలబద్ధకం సమస్య నుండి ఉపశమనాన్ని కలిగించడం తో పాటుగా జీర్ణ క్రియ ను మెరుగు పరుస్తుంది.

ఉష్ట్రాసన ను గురించిన వీడియో ను శేర్ చేసినప్రధాన మంత్రి

June 18th, 10:29 am

ఉష్ట్రాసన లేదా ఒంటె భంగిమ ను గురించి న ఒక వీడియో క్లిప్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు. ఈ భంగిమ వీపు కండరాల కు మరియు మెడ కండరాల కు బలాన్ని ఇవ్వడం తో పాటుగా రక్త ప్రసరణ ను మరియు కంటి చూపు ను మెరుగు పరచడం లో కూడా తోడ్పడుతుంది.

Prime Minister Narendra Modi shares Bhadrasana Yoga Video

June 17th, 10:07 am

The Prime Minister, Shri Narendra Modi has shared Bhadrasana detailed Yoga video describing its benefits for joints, which also reduces pain in the knees. Bhadrasana yoga pose is also good for the stomach.

పాదహస్తాసనను గురించిన వీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

June 16th, 10:10 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాదహస్తాసన లేదా మనిషి తన పాదాల కు తన చేతుల ను ఆనించే భంగిమ తో కూడిన ఒక వీడియో క్లిప్ ను శేర్ చేశారు. ఈ భంగిమ వెన్నెముక కు మేలు ను చేసేది కావడం తో పాటు గా మహిళల కు నెలసరి సంబంధి బాధ లో ఉపశమనాన్ని కూడ అందించేది కావడం తో, అందరు ఈ యోగాసనాన్ని అభ్యసించండి అంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

అర్థచక్రాసన ను గురించిన వీడియో ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

June 15th, 09:50 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్థ చక్రాసన లేదా సగం చక్రం భంగిమ తో కూడిన ఒక వీడియో క్లిప్ ను శేర్ చేశారు. మంచి హృదయం కోసం మరియు మెరుగైన రక్త ప్రసరణ కోసం ఈ భంగిమ ను అందరూ అభ్యసించండి అంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

తాడాసన ను గురించిన వీడియో క్లిప్ ను శేర్చేసిన ప్రధాన మంత్రి

June 13th, 09:47 am

‘తాడాసన’, మరో మాట లో చెప్పాలి అంటే తాటి చెట్టు ను పోలినటువంటి భంగిమ ను గురించిన ఒక వీడియో క్లిప్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పోస్ట్ చేశారు.

The Ashwamedha Yagya organized by the Gayatri Parivar has become a grand social campaign: PM Modi

February 25th, 09:10 am

PM Modi addressed Ashwamedha Yagya organized by the Gayatri Parivar through a video message. The Ashwamedha Yagya organized by the Gayatri Parivar has become a grand social campaign, PM Modi acknowledged, highlighting its role in steering millions of youth away from addiction and towards nation-building activities.

గాయత్రీ పరివార్ నిర్వహించిన అశ్వమేథ యాగం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశమిచ్చిన ప్రధానమంత్రి.

February 25th, 08:40 am

గాయత్రీ పరివార్ నిర్వహిచిన అశ్వమేథ యాగం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , వీడియో సందేశమిచ్చారు.రానున్న ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకుని చూసినపుడు, దీనిని తప్పుగా అన్వయించే అవకాశం లేకపోలేదన్న ఆలోచనతో, ఈ అశ్వమేథయాగం కార్యక్రమాలతో మమేకం కావచ్చునా లేదా అన్న సందేహం తనకు వచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. అయితే,‘‘ ఆచార్య శ్రీ రామశర్మాఆలోచనలను ముందుకు తీసుకువెళ్లడానికి దీనిని నిర్వహిస్తున్నట్టు తెలిసింది, దీనిలో ఒక కొత్త అర్థాన్ని దర్శించినపుడు నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి’’ అని ప్రధానమంత్రి తెలిపారు.