ఎగుమతిదారులు, బ్యాంకులకు మద్దతనిచ్చేందుకు రాగ 5 సంవత్సరాలలో ఇసిజిసి లిమిటెడ్‌లో 4,400 కోట్ల రూపాయల పెట్టుబడికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
September 29th, 04:18 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎగుమతుల రంగానికి ఊతం ఇచ్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఈరోజు ఇసిజిసి లిమిటెడ్ ( పూర్వపు ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) కు ఐదు సంవత్సరాల కాలంలో రూ 4,400 కోట్ల రూపాయలను 2021-22,2025-26 ఆర్ధిక సంవత్సర కాలానికి పెట్టుబడి సమకూర్చేందుకు ఆమోదించింది. ప్రస్తుతం ఆమోదించిన పెట్టుబడిని ఇసిజిసి లిస్టింగ్ ప్రక్రియతో అనుసంధానం చేస్తూ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరరరింగ్ ద్వారా సమకూర్చనుంది. ఇది మరిన్ని ఎగుమతులకు మద్దతు నిచ్చేందుకు అండర్ రైటింగ్ సామర్ధ్యాన్ని పెంచనుంది.