ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరుగుతోన్న సెమీకాన్ ఇండియా 2024లో
September 11th, 04:28 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో ఉన్న ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించారు. ఈ సదస్సును సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ‘సెమీకండక్డర్ భవిష్యత్తును తీర్చిదిద్దటం’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల సదస్సులో సెమీకండక్టర్ల విషయంలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చే వ్యూహం, విధానంపై చర్చించనున్నారు. ఈ పరిశ్రమకు చెందిన ప్రపంచ నాయకత్వ స్థాయి వ్యక్తులు, కంపెనీలు, నిపుణులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ఈ సదస్సులో ప్రపంచ సెమీకండక్టర్ దిగ్గజాల అగ్రనాయకత్వం పాల్గొంటోంది. సదస్సులో 250 మందికి పైగా ప్రదర్శనదారులు, 150 మంది వక్తలు పాల్గొంటున్నారు.11న సెమికాన్ ఇండియా 2024ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
September 09th, 08:08 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో ‘సెమికాన్ ఇండియా 2024’ను సెప్టెంబర్ 11న ఉదయం10:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.