ఎక్స్ పో 2020, దుబయి లోని ఇండియా పెవిలియన్ లో సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం
October 01st, 08:55 pm
ఎక్స్ పో 2020, దుబయి లో ఇండియా పెవిలియన్ కు స్వాగతం. ఇది ఒక చరిత్రాత్మకమైన ఎక్స్ పో. మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా, దక్షిణ ఆసియా ప్రాంతాల లో నిర్వహిస్తున్న ఒకటో ఎక్స్ పో ఇది. ఈ ఎక్స్ పో లో అతి పెద్దవైన పెవిలియన్ లలో ఒక పెవిలియన్ ను ఏర్పాటు చేయడం ద్వారా దీని లో భారతదేశం పాలుపంచుకొంటోంది. యుఎఇ తోను, దుబయితోను మన ప్రగాఢ సంబంధాల ను, చరిత్రాత్మక సంబంధాల ను మరింత దృఢం గా నిర్మించుకోవడం లో ఈ ఎక్స్ పో ఒక ప్రముఖ పాత్ర ను తప్పక పోషిస్తుందని నేను భావిస్తున్నాను. యుఎఇ ప్రెసిడెంటు, అబూ ధాబీ పాలకుడు అయిన మాన్య శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ బిన్ అల్ నాహ్ యాన్ కు భారతదేశం ప్రజల పక్షాన, ప్రభుత్వం పక్షాన శుభాకాంక్షలను తెలియజేస్తూ, నా ఈ ప్రసంగాన్ని మొదలుపెట్టనివ్వండి.ఎక్స్ పో 2020 దుబయి లోని ఇండియా పెవిలియన్ లో ప్రధాన మంత్రి సందేశం
October 01st, 08:54 pm
‘కనెక్టింగ్ మైండ్స్, క్రియేటింగ్ ద ఫ్యూచర్’ అనేది ఎక్స్ పో 2020 యొక్క ప్రధాన ఇతివృత్తం గా ఉందని ప్రధాన మంత్రి అన్నారు. ఇంకా ఆయన, ‘‘ఈ ఇతివృత్తం తాలూకు భావన ను భారతదేశం తాలూకు ప్రయాసల లో కూడా గమనించవచ్చు, ఎందుకంటే మేం ఒక ‘న్యూ ఇండియా’ ను నిర్మించడం కోసం ముందడుగు వేస్తున్నాం. ఈ ఎక్స్ పో శతాబ్ద కాలం లో ఒక సారి తలెత్తేటటువంటి ఒక విశ్వమారి కి వ్యతిరేకం గా మానవ జాతి యొక్క దృఢత్వానికి కూడా ఒక ప్రమాణం గా ఉంది’’ అన్నారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అబూదభీ రాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ మధ్య టెలిఫోన్ సంభాషణ
September 03rd, 10:27 pm
అబూదభీ రాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం టెలిఫోన్‌లో సంభాషించారు. భారత్-యుఏఇ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద వివిధ వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం నిరంతర పురోగతి తీరును ఉభయ నాయకులు సమీక్షించారు. కోవిడ్-19 మహమ్మారి కాలంలో భారత సంతతి ప్రజలకు యుఏఇ అందించిన మద్దతును ప్రధానమంత్రి ప్రశంసించారు. 2021 అక్టోబర్ 1వ తేదీ నుంచి దుబాయ్ లో ఎక్స్ పో-2020 జరుగనున్న సందర్భంగా శుభాభినందనలు అందచేశారు.