Text of PM Modi's address at the Parliament of Guyana

November 21st, 08:00 pm

Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.

PM Modi addresses the Parliament of Guyana

November 21st, 07:50 pm

Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.

Prime Minister expresses gratitude and urges more people to plant a tree in the honour of their Mother and contribute to a sustainable planet

November 16th, 09:56 pm

Prime Minister Shri Narendra Modi today urged more people to plant a tree in the honour of their Mother and contribute to a sustainable planet. Shri Modi expressed gratitude to all those who have added momentum to Ek Ped Maa ka Naam Abhiyan.

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 09th, 11:00 am

నేటి నుంచి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం మొదలవుతుంది. అంటే ఉత్తరాఖండ్ 25వ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్రానికి ఉజ్వలమైన, జాజ్వల్యమానమైన భవిష్యత్తును నిర్మించే దిశగా అంకితభావంతో మనముందున్న వచ్చే 25 సంవత్సరాల ప్రస్థానాన్ని మనం ప్రారంభించాలి. యాదృచ్ఛికమే అయినా, సంతోషకరమైన విషయమొకటి ఇందులో ఉంది: జాతీయవృద్ధి కోసం అంకితం చేసిన 25 ఏళ్ల విశేష సమయమైన భారత అమృత్ కాల్, మనం సాధించబోయే ఈ పురోగతి ఏకకాలంలో తటస్థించబోతున్నాయి. అభివృద్ధి చెందిన భారత్‌లో అభివృద్ధి చెందిన ఉత్తరాఖండ్ భావనను ఈ కలయిక దృఢపరుస్తుంది. ఈ కాలంలో మనందరి ఆకాంక్షలు నెరవేరతాయి. ఉత్తరాఖండ్ ప్రజలు రానున్న 25 ఏళ్ల లక్ష్యాలపై దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా ఉత్తరాఖండ్ ఘనతను చాటడంతోపాటు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అనే భావన రాష్ట్ర ప్రజలందరిలో ప్రతిధ్వనిస్తుంది. దృఢ సంకల్పాన్ని స్వీకరించిన ఈ ముఖ్య సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రెండు రోజుల కిందటే ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్ విజయవంతంగా నిర్వహించారు. మన ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో గణనీయమైన పాత్ర పోషిస్తారని విశ్వసిస్తున్నాను.

దేవభూమి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

November 09th, 10:40 am

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు రజతోత్సవ సంవత్సరం ఈ రోజే ప్రారంభమవుతున్నదని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పడి 25 వసంతాలు పూర్తవుతుండడాన్ని గుర్తుచేస్తూ... రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని ప్రజలను శ్రీ మోదీ కోరారు. వచ్చే 25 ఏళ్ల ఉత్తరాఖండ్ ప్రస్థాన సమయానికి భారత్ అమృత కాల్ కు కూడా 25 ఏళ్లు నిండబోతుండడం శుభసూచకమన్నారు. వికసిత భారత్ లో వికసిత ఉత్తరాఖండ్ సంకల్పం నెరవేరబోతుండడాన్ని అది సూచిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వచ్చే 25 ఏళ్లకు పలు తీర్మానాలతో అనేక కార్యక్రమాలను ప్రజలు చేపట్టారని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు ఉత్తరాఖండ్‌ ఘనతను చాటుతాయని, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ ఎదిగి ఆ ఫలితాలు రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయని అన్నారు. ఈ సంకల్పాన్ని స్వీకరించిన రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ‘ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్’ను గుర్తుచేసిన ప్రధాని.. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

జర్మనీ ఛాన్సలర్ భారత పర్యటన నేపథ్యంలో ఉభయ ప్రభుత్వాల మధ్య 7 వ దఫా సంప్రదింపులు: ఒప్పందాల జాబితా

October 25th, 07:47 pm

మ్యాక్స్-ప్లాంక్-గెసెల్‌షాఫ్ట్ ఈ.వీ. (ఎంపీజీ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్ (ఐసీటీఎస్), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)ల మధ్య అవగాహన ఒప్పందం

స్వచ్ఛ ఇంధనం మన తక్షణ అవసరం : ప్రధానమంత్రి

October 21st, 05:20 pm

స్వచ్ఛ ఇంధనం మన తక్షణ అవసరమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వ్యాఖ్యానించారు. మెరుగైన రేపటి కోసం ప్రభుత్వ నిబద్ధత చాలా ముఖ్యమైనదిగా ఉందనీ, అది తమ ప్రభుత్వ కృషిలో కనిపిస్తున్నదని అన్నారు.

2024-25 నుంచి 2030-31 కాలానికి వంటనూనెలు,

October 03rd, 09:06 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో వంటనూనెలు-నూనెగింజలపై జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ద్వారా దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు వంటనూనెల ఉత్పత్తిలో భారత్ స్వావలంబన సాధించేలా చేసే (ఆత్మనిర్భర్ భారత్) లక్ష్యంతో ఈ మిషన్ ను రూపొందించారు. రూ.10,103 కోట్ల వ్యయంతో 2024-25 నుంచి 2030-31వరకు ఏడేళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.

గుజ‌రాత్, గాంధీన‌గ‌ర్ లో రీ ఇన్వెస్ట్ 2024 కార్య‌క్ర‌మ ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌సంగం

September 16th, 11:30 am

జర్మనీ ఆర్థిక సహకార మంత్రి , డెన్మార్క్ పరిశ్రమల వ్యాపార మంత్రితో సహా విదేశాల నుండి వ‌చ్చిన‌ విశిష్ట అతిథులూ , నా మంత్రి మండ‌లి స‌భ్యులు ప్రహ్లాద్ జోషి జీ, శ్రీపాద్ నాయక్ జీ , ప‌లు దేశాల నుండి వ‌చ్చిన ప్రతినిధులు...

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన (రీ-ఇన్వెస్ట్)కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం

September 16th, 11:11 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్‌లో ‘ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన’ (రీ-ఇన్వెస్ట్)ను ప్రారంభించారు. మన దేశం 200 గిగావాట్ల శిలాజేతర ఇంధన స్ధాపిత సామర్థ్యం సాధించడంలో సహకరించిన కీలక భాగస్వాములను ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత్ సత్కరిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ రంగ కంపెనీలు, అంకుర సంస్థలు, ప్రధాన పారిశ్రామిక సంస్థలలో అత్యాధునిక ఆవిష్కరణలతో సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ తిలకించారు.

మరింత వాతావరణ అనుకూలమైన, వాతావరణ-స్మార్ట్ భారత్‌ను రూపొందించడానికి 'మిషన్ మౌసమ్'కు మంత్రివర్గం ఆమోదం

September 11th, 08:19 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన మంత్రి మండలి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండేళ్లలో రూ.2000 కోట్ల వ్యయంతో మిషన్ మౌసమ్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది.

ప్రధాన మంత్రి అధ్యక్షతన సెమీకండక్టర్ ఎగ్జిక్యూటివ్స్ రౌండ్ టేబుల్ సమావేశం

September 10th, 08:10 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయన నివాసం 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో సెమీకండక్టర్ ఎగ్జిక్యూటివ్స్ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించారు.

ప్రధాన మంత్రి అధ్యక్షతన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పాలకమండలి తొలి సమావేశం

September 10th, 04:43 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ పాలక మండలి మొదటి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో దేశంలోని శాస్త్ర, సాంకేతిక స్వరూప స్వభావాలు, పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల రీడిజైనింగ్ గురించి చర్చ జరిగింది.

జీవ సాంకేతిక ఆధారిత తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు బయో ఇ3 విధానానికి మంత్రివర్గ ఆమోదం

August 24th, 09:17 pm

అధిక నైపుణ్యంతో కూడిన జీవ సాంకేతిక ఆధారిత తయరీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా, బయో టెక్నాలజీ విభాగం ప్రతిపాదించిన ‘బయో ఇ3’ (ఆర్థికవ్యవస్థ, పర్యావరణం, ఉద్యోగ కల్పన) విధానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు తన ఆమోదాన్ని తెలిపింది.

లిగ్నోసెల్యులోజిక్ బయోమాస్, ఇతర పునరుత్పాదక ముడిసరుకులు ఉపయోగించే అధునాతన జీవ ఇంధన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించడానికి “ప్రధాన్ మంత్రి జెఐ-విఎఎన్ యోజన”లో సవరణకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

August 09th, 10:21 pm

జీవ ఇంధనాల రంగంలో తాజా పరిణామాలకు అనుగుణంగా, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాన మంత్రి జెఐ-విఎఎన్ యోజనలో సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

August 03rd, 09:35 am

వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర సదస్సు అధ్యక్షుడు డాక్టర్ మతీన్ కైమ్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేష్ గారు, భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మా సహచరులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, భాగస్వాములు, మహిళలు, పెద్దమనుషులారా..

వ్య‌వ‌సాయ ఆర్థిక‌వేత్త‌ల 32వ అంత‌ర్జాతీయ స‌మావేశాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

August 03rd, 09:30 am

అంత‌ర్జాతీయ వ్య‌వ‌సాయ ఆర్థిక‌వేత్త‌ల 32వ స‌మావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని జాతీయ వ్య‌వ‌సాయ‌శాస్త్ర కేంద్రం ( ఎన్ ఏ ఎస్ సి) స‌ముదాయంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. ఈ ఏడాది స‌మావేశ థీమ్ సుస్థిర వ్య‌వ‌సాయ‌, ఆహార వ్య‌వ‌స్థ‌ల దిశ‌గా ప‌రివ‌ర్త‌న‌. వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు , సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయ అత్యవసర అవసరాన్ని చాట‌డ‌మే ఈ సమావేశ‌ లక్ష్యం. దాదాపు 75 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రష్యా కు ఆధికారిక పర్యటన జరిపిన సందర్భంలో ఒనగూరిన ఫలితాల పట్టిక

July 09th, 09:59 pm

రష్యా దూర ప్రాచ్య ప్రాంతం లో వాణిజ్యం, ఆర్థికం, పెట్టుబడి రంగాలలో 2024 నుంచి 2029 మధ్య కాలానికి భారత్-రష్యా సహకార కార్యక్రమం; రష్యన్ ఫెడరేషన్ లోని ఆర్కిటిక్ ప్రాంతంలో సహకారానికి సంబంధించిన సూత్రాలు.

ఉత్తర పూర్వ పరివర్తన పారిశ్రామికీకరణ పథకం-2024కి ఆమోదం తెలిపిన క్యాబినెట్

March 07th, 11:18 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం 10 సంవ‌త్స‌రాల కాలానికి ఉత్త‌ర్ పూర్వ రూపాంతర పారిశ్రామికీకరణ పథకం,2024 (ఉన్నతి– 2024)కు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, పరిశ్రమల ప్రోత్సాహం మరియు అంతర్గత వాణిజ్య ప్రతిపాదనను ఆమోదించింది. నోటిఫికేషన్‌ తేదీ నుండి 8 సంవత్సరాల పాటు మొత్తం రూ.10,037 కోట్ల వ్యయ బాధ్యతలకు కట్టుబడి ఉంటుంది.

భారతదేశం లో చిరుతపులులసంతతి వృద్ధి చెందడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

February 29th, 09:35 pm

భారతదేశం లో చిరుతపులుల సంతతి పెరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిరుతపులుల సంఖ్య లో ఈ గణనీయ వృద్ధి జీవ వైవిధ్యం పట్ల భారతదేశానికి ఉన్న అచంచల సమర్పణ భావాన్ని కనబరుస్తోందనడాని కి ఒక నిదర్శన గా ఉంది అని ఆయన అన్నారు.