Double-engine Governments at the Centre and state are becoming a symbol of good governance: PM in Jaipur
December 17th, 12:05 pm
PM Modi participated in the event ‘Ek Varsh-Parinaam Utkarsh’ to mark the completion of one year of the Rajasthan State Government. In his address, he congratulated the state government and the people of Rajasthan for a year marked by significant developmental strides. He emphasized the importance of transparency in governance, citing the Rajasthan government's success in job creation and tackling previous inefficiencies.రాజస్థాన్ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా
December 17th, 12:00 pm
‘ఏక్ వర్ష్ - పరిణామ్ ఉత్కర్ష్: రాజస్థాన్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంవత్సరం పూర్తి’ పేరుతో ఈ రోజు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకొన్నందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికీ, ఆ రాష్ట్ర ప్రజలకూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదాల్ని అందుకోవడం తనకు దక్కిన సౌభాగ్యమని ఆయన అన్నారు. రాజస్థాన్‌లో అభివృద్ధి పనులకు ఒక కొత్త దిశను, జోరును ఇవ్వడానికి ప్రయత్నాలు చేసినందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రినీ, ఆయన జట్టునీ శ్రీ మోదీ ప్రశంసించారు. రాబోయే అనేక సంవత్సరాల్లో అభివృద్ధికి ఈ మొదటి సంవత్సరం ఒక బలమైన పునాదిగా మారిందని అన్నారు. ఈ రోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రభుత్వానికి సంవత్సర కాలం పూర్తి అవడం ఒక్కటే కాకుండా రాజస్థాన్ అభివృద్ధి ఉత్సవంతోపాటు రాజస్థాన్ ఉజ్వలంగా మెరిసిపోతూ ఉండడానికి కూడా సంకేతంగా నిలిచిందని ఆయన అన్నారు. ఇటీవల రైజింగ్ రాజస్థాన్ సమ్మిట్ 2024 సందర్భంగా తాను ఇక్కడ పర్యటించిన సంగతిని శ్రీ మోదీ గుర్తు చేస్తూ.. ప్రపంచమంతటి నుంచీ ఎంతో మంది పెట్టుబడిదారులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. ఈ రోజు రూ.45,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులు నీటి విషయంలో రాజస్థాన్ ఎదుర్కొంటున్న అడ్డంకుల్ని తొలగించేందుకు సముచిత పరిష్కారాన్ని అందిస్తాయనీ, భారతదేశంలో చాలా రాష్ట్రాలతో చక్కని అనుసంధాన సదుపాయాన్ని కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా రాజస్థాన్‌ను నిలబెడతాయని కూడా ఆయన అన్నారు. ఈ అభివృద్ధి పనులు మరింత మంది పెట్టుబడిదారులను ఆహ్వానించి, అనేక ఉద్యోగావకాశాలను కల్పించి, పర్యాటక రంగాన్ని బలపరచడంతోపాటు రాజస్థాన్‌లో రైతులకు, మహిళలకు, యువతకు ప్రయోజనాలను అందిస్తాయని ప్రధాని అన్నారు.శ్రీమతి తులసి గౌడ మృతికి ప్రధానమంత్రి సంతాపం
December 17th, 10:42 am
కర్ణాటకకు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త, పద్మ పురస్కార స్వీకర్త శ్రీమతి తులసి గౌడ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం తెలిపారు.న్యూ ఢిల్లీలో అష్టలక్ష్మి మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 06th, 02:10 pm
అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ గారు, మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కోన్రాడ్ సంగ్మా గారు, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా గారు, సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేంసింగ్ తమాంగ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు జ్యోతిరాదిత్య సింధియా గారు, సుకాంత మజుందార్ గారు, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మిజోరం, నాగాలాండ్ ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులు , మహిళలు, ప్రముఖులారా,అష్టలక్ష్మి మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 06th, 02:08 pm
అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ప్రముఖులందరినీ ఈ కార్యక్రమానికి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానిస్తూ, ఈరోజు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాపరినిర్వాణ దినోత్సవం కూడా ఉందని గుర్తు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం 75 సంవత్సరాలను పూర్తి చేసుకొందని, ఈ రాజ్యాంగం దేశ పౌరులందరికీ గొప్ప ప్రేరణను అందిస్తోందని ప్రధాని అన్నారు. భారత పౌరులందరి పక్షాన బాబా సాహెబ్ అంబేద్కర్‌కు శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు.భారత్‌లో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది, సమష్టి కృషికి ధన్యవాదాలు: ప్రధాని
December 03rd, 07:10 pm
పులుల సంరక్షణలో సమష్టి కృషిని ప్రశంసించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలో పులుల సంఖ్య క్రమేణా పెరుగుతోందని ఈ రోజు తెలిపారు. దేశంలో 57వ పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయడం, ప్రకృతిని పరిరక్షించుకోవాలనే మన శతాబ్దాల నాటి సంప్రదాయానికి అనుగుణంగా ఉందని ఆయన అన్నారు.భారతీయ ప్రవాసులు వివిధ దేశాల్లో తమదైన ముద్ర వేశారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 24th, 11:30 am
మన్ కీ బాత్ యొక్క 116వ ఎపిసోడ్లో, పీఎం మోదీ ఎన్సిసి డే యొక్క ప్రాముఖ్యతను చర్చించారు, ఎన్సిసి క్యాడెట్ల పెరుగుదల మరియు విపత్తు సహాయంలో వారి పాత్రను హైలైట్ చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం యువత సాధికారతను నొక్కి, వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ గురించి మాట్లాడారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను నావిగేట్ చేయడంలో సీనియర్ సిటిజన్లకు యువత సహాయం చేయడం మరియు ఏక్ పెద్ మా కే నామ్ క్యాంపెయిన్ విజయాన్ని కూడా ఆయన పంచుకున్నారు.బార్బడోస్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ
November 21st, 09:13 am
బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. భారత్-కేరికోమ్ శిఖరాగ్ర సమావేశాన్ని గయానాలోని జార్జ్‌టౌన్‌లో నవంబరు 20న నిర్వహించిన సందర్భంగా వారిరువురు సమావేశమయ్యారు. భారత- బార్బడోస్‌ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్ఘాటించడంతోపాటు ఆ సంబంధాలను బల పరచడానికి ఇద్దరు నేతలకు ఒక అవకాశాన్ని ఈ ఉన్నతస్థాయి సమావేశం అందించింది.Be it COVID, disasters, or development, India has stood by you as a reliable partner: PM in Guyana
November 21st, 02:15 am
PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.భారత్- కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశం
November 21st, 02:00 am
భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశాన్ని జార్జ్‌టౌన్‌లో నిన్న నిర్వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కరికమ్ కు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రెనడా ప్రధాని శ్రీ డికన్ మిషెల్‌లు ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు. శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీకి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారత్- కరికమ్ తొలి శిఖరాగ్ర సమావేశాన్ని 2019లో న్యూయార్క్ లో నిర్వహించారు. గయానా అధ్యక్షుడు, గ్రెనెడా ప్రధానిలకు తోడు శిఖరాగ్ర సమావేశంలో పాలుపంచుకొన్నా వారిలో..PM Modi and President of Guyana, Dr. Irfaan Ali take part in the ‘Ek Ped Maa Ke Naam’ movement
November 20th, 11:27 pm
PM Modi and President Dr. Irfaan Ali participated in the ‘Ek Ped Maa Ke Naam’ movement in Georgetown, symbolizing a shared commitment to sustainability. President Ali planted a tree alongside his grandmother and mother-in-law, marking a special gesture of environmental care.The entire North East is the Ashtalakshmi of India: PM at Bodoland Mohotsov
November 15th, 06:32 pm
Prime Minister Shri Narendra Modi today inaugurated the 1st Bodoland Mohotsav, a two day mega event on language, literature, and culture to sustain peace and build a Vibrant Bodo Society. Addressing the gathering, Shri Modi greeted the citizens of India on the auspicious occasion of Kartik Purnima and Dev Deepavali. He greeted all the Sikh brothers and sisters from across the globe on the 555th Prakash Parva of Sri Gurunanak Dev ji being celebrated today. He also added that the citizens of India were celebrating the Janjatiya Gaurav Divas, marking the 150th birth anniversary of Bhagwan Birsa Munda. He was pleased to inaugurate the 1st Bodoland Mohotsav and congratulated the Bodo people from across the country who had come to celebrate a new future of prosperity, culture and peace.తొలి బోడోలాండ్ మహోత్సవ్‌ను ఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 15th, 06:30 pm
తొలి బోడోలాండ్ మహోత్సవ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. రెండు రోజుల పాటు పెద్దఎత్తున జరిగే ఈ కార్యక్రమం ఒక చైతన్య భరిత బోడో సమాజాన్ని ఆవిష్కరించడానికి, శాంతిని పరిరక్షించడానికి ఉద్దేశించిన కార్యక్రమం. భాష, సాహిత్యం, సంస్కృతిపరమైన కార్యక్రమాలు దీనిలో భాగంగా ఉన్నాయి.Tribal society is the one that led the fight for centuries to protect India's culture and independence: PM Modi
November 15th, 11:20 am
PM Modi addressed Janjatiya Gaurav Diwas, emphasizing India's efforts to empower tribal communities, preserve their rich heritage, and acknowledge their vital role in nation-building.గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా భగవాన్ బిర్సా ముండా150వ జయంతి వేడుకలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 15th, 11:00 am
జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు(నవంబర్ 15న) భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. బీహార్‌లోని జముయిలో దాదాపు రూ. 6,640 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలూ ప్రారంభోత్సవాలూ చేశారు. వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు.Our Jawans have proved their mettle on every challenging occasion: PM Modi in Kutch
October 31st, 07:05 pm
PM Modi celebrated Diwali with the personnel of the BSF, Army, Navy and Air Force near the Indo-Pak border, at Lakki Nala in Sir Creek area in Gujarat's Kutch. The Prime Minister conveyed his deep appreciation for the soldiers' service to the nation, acknowledging the sacrifices they make in challenging environments.PM Modi celebrates Diwali with security personnel in Kutch,Gujarat
October 31st, 07:00 pm
PM Modi celebrated Diwali with the personnel of the BSF, Army, Navy and Air Force near the Indo-Pak border, at Lakki Nala in Sir Creek area in Gujarat's Kutch. The Prime Minister conveyed his deep appreciation for the soldiers' service to the nation, acknowledging the sacrifices they make in challenging environments.బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ ప్లీనరీలో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
October 23rd, 05:22 pm
16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న్నందుకు అధ్యక్షుడు పుతిన్ కు అభినందనలు.16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు ప్లీనరీలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
October 23rd, 03:25 pm
ఈ రోజు సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు పుతిన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
October 23rd, 03:10 pm
బహుళవాదాన్ని బలోపేతం చేయడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, స్థిరమైన అభివృద్ధిని కొనసాగించడం, అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్) దేశాల ఆందోళనలపై దృష్టి పెట్టడం వంటి అంశాలపై బ్రిక్స్ నేతలు ఫలవంతమైన చర్చలు జరిపారు. కొత్తగా చేరిన 13 బ్రిక్స్ భాగస్వామ్య దేశాలకు నేతలు స్వాగతం పలికారు.