గయానాలోని భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
November 22nd, 03:02 am
మీ అందరితో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనతోపాటు ఇక్కడకు వచ్చినందుకు ముందుగా ఇర్ఫాన్ అలీ గారికి కృతజ్ఞతలు. వచ్చినదగ్గర నుంచీ నాపట్ల మీరు చూపిన ఆదరాభిమానాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నన్ను ఇంటికి ఆహ్వానించిన అధ్యక్షులు అలీ గారికి కృతజ్ఞతలు. నన్ను ఆత్మీయుడిగా భావించిన వారి కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. ఆతిధిమర్యాదలు మన సంస్కృతిలో అంతర్భాగం. గత రెండు రోజులుగా ఇదే జ్ఞాపకానికి వస్తోంది. అధ్యక్షులు అలీగారు, వారి మామ్మగారు కూడా మొక్క నాటారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో మేం చేపట్టిన ఉద్యమంలో అది భాగం. అమ్మ పేరుతో ఒక మొక్కను నాటడం అని దానికి అర్థం. ఈ భావోద్వేగ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.గయానాలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం గయానాలోని ప్రవాస భారతీయులు అనేక రంగాలను ప్రభావితం చేస్తూ గయానా అభివృద్ధికి దోహదపడ్డారు: ప్రధానమంత్రి
November 22nd, 03:00 am
గయానాలోని జార్జ్ టౌన్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భారతీయ సంతతి సభ్యులను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గయానా అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ, ప్రధాని మార్క్ ఫిలిప్స్, ఉపాధ్యక్షుడు భర్రాత్ జగ్దేవ్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ రామోతార్ తదితరులు పాల్గొన్నారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ అధ్యక్షుడికి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన రాక సందర్భంగా ప్రత్యేక ఆప్యాయతతో ఘనస్వాగతం పలకడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై చూపిన ఆప్యాయతానురాగాలపై అధ్యక్షుడు, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. “ఆతిథ్య స్ఫూర్తి మన సంస్కృతికి కేంద్ర బిందువు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు, ఆయన మామ్మగారితో కలిసి తాను ఓ మొక్క నాటానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే భావోద్వేగభరితమైన క్షణాలన్నారు.‘‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’’పై జి20 సమావేశంలో ప్రధాన మంత్రి ప్రసంగం
November 18th, 08:00 pm
నా ప్రసంగాన్ని మొదలుపెట్టడాని కన్నా ముందు... జి20 శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహించడానికి గొప్ప ఏర్పాట్లను చేసినందుకు, అలాగే జి20 కి అధ్యక్ష బాధ్యతలను నిర్వహించడంలో సాఫల్యాన్ని సాధించినందుకు అధ్యక్షుడు శ్రీ లూలా కు నేను అభినందనలు తెలియజేయదలచుకొన్నాను.‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అనే అంశాలు ప్రధానంగా జి 20 కార్యక్రమం నిర్వహణ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 18th, 07:55 pm
‘ఆకలికి, పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం, సామాజిక సన్నిహితత్వం’ అంశాలు ప్రధానంగా ఈ రోజున నిర్వహించిన జి 20 శిఖరాగ్ర సమావేశ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇస్తున్నందుకు, అతిథి మర్యాదలు చక్కని పద్ధతిలో చేస్తున్నందుకు బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిస్ ఇనాషియో లూలా డిసిల్వా కు ప్రధాని ధన్యవాదాలు తెలియజేశారు. బ్రెజిల్ లో నిర్వహిస్తున్న జి 20 కార్యక్రమాలు స్థిరాభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారిస్తుండడం ప్రశంసనీయమని ప్రధాని అన్నారు. ఈ వైఖరి అభివృద్ధి చెందుతున్న దేశాలకున్న ఆందోళనలపై శ్రద్ధ వహిస్తూ, న్యూ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ చేసిన నిర్ణయాలను మరింత ముందుకు తీసుకుపోతోందని ఆయన అన్నారు. జి 20 కూటమికి భారతదేశం అధ్యక్షత వహించిన కాలంలో, ‘‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’’ అంటూ ఇచ్చిన పిలుపు రియో చర్చల్లో కనిపిస్తోందని ఆయన అన్నారు.India is not a follower but a first mover: PM Modi in Bengaluru
April 20th, 04:00 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Bengaluru, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and outlined plans for the future.PM Modi addresses public meetings in Chikkaballapur & Bengaluru, Karnataka
April 20th, 03:45 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Chikkaballapur and Bengaluru, Karnataka. Speaking to a vibrant crowd, he highlighted the achievements of the NDA government and outlined plans for the future.వెనుకబడిన వర్గాలకు రుణసాయంపై మార్చి 13న దేశవ్యాప్త విస్తృత ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
March 12th, 06:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి 13న సాయంత్రం 4:00 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా వెనుకబడిన వర్గాలకు రుణసాయం దిశగా నిర్వహించే దేశవ్యాప్త విస్తృత ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా ‘‘ప్రధానమంత్రి సామాజికోత్థాన-ఉపాధి ఆధారిత జనసంక్షేమ (పిఎం-సూరజ్) పథకం జాతీయ పోర్టల్‌ను ఆయన ప్రారంభిస్తారు. అదే సమయంలో దేశంలోని లక్షమంది బలహీనవర్గాల పారిశ్రామికవేత్తలకు రుణ సహాయం మంజూరు చేస్తారు. అంతేకాకుండా షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులు సహా వెనుకబడిన వర్గాలకు చెందిన వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషిస్తారు. అటుపైన ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు.Bharat Tex 2024 is an excellent platform to highlight India's exceptional capabilities in the textile industry: PM Modi
February 26th, 11:10 am
PM Modi inaugurated Bharat Tex 2024, one of the largest-ever global textile events to be organized in the country at Bharat Mandapam in New Delhi. He said that Bharat Tex connects the glorious history of Indian tradition with today’s talent; technology with traditions and is a thread to bring together style/sustainability/ scale/skill.న్యూఢిల్లీలో భారత్ టెక్స్ 2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి
February 26th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపంలో దేశంలో నిర్వహించే అతి పెద్ద గ్లోబల్ టెక్స్ టైల్ ఈవెంట్ లలో ఒకటైన భారత్ టెక్స్ - 2024 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రధాని తిలకించారు.మహిళల్లో అవగాహన పెంచుతున్న వ్యవస్థాపకురాలికి ప్రధానమంత్రి ప్రశంస
January 18th, 04:04 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. దేశవ్యాప్తంగాగల యాత్ర లబ్ధిదారులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.విశ్వకర్మ యోజన ను గురించిన మరియు చిరుధాన్యాల ను గురించిన చైతన్యాన్నివ్యాప్తి చేస్తున్నటువంటి ‘కుమ్హార్’ సముదాయానికి చెందిన మహిళా నవ పారిశ్రామికవేత్త
December 27th, 02:37 pm
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర యొక్క లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భం లో సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించారు.మా దేశం లో పెట్టుబడి పెట్టడం కోసం ప్రపంచ దేశాల ను మేం ఆహ్వానిస్తున్నాం. భారతదేశం నిరుత్సాహ పరచదు: ప్రధాన మంత్రి
November 26th, 08:58 pm
భారతదేశాన్ని పెట్టుబడి కి గమ్యస్థానం అనే విషయం లో భారతదేశాన్ని గురించి నవ పారిశ్రామికవేత్తల లో వ్యాప్తి చెందుతున్నటువంటి ఆశావాదాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అంగీకరించారు.PM Modi's 'Vocal for Local' call resonates with the masses
November 11th, 10:59 am
Following Prime Minister Modi's 'Vocal for Local' appeal during 'Mann Ki Baat' in October 2023 episode, the initiative has received widespread endorsement from citizens nationwide. The movement has sparked a groundswell of support for 'Made in India' products during the festive season, encouraging local artisans, innovators and entrepreneurs.సెప్టెంబర్ 26 వ - 27 వ తేదీ లలో గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
September 25th, 05:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబర్ 26 వ తేదీ మరియు 27 వ తేదీ లలో గుజరాత్ ను సందర్శించనున్నారు. సెప్టెంబర్ 27 వ తేదీ నాడు ఉదయం సుమారు 10 గంటల కు, ప్రధాన మంత్రి వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ తాలూకు 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో ఏర్పాటైన ఒక కార్యక్రమం లో పాలుపంచుకొంటారు. ఆ తరువాత దాదాపు గా మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి ఛోటాఉదేపుర్ లోని బోడెలీ కి చేరుకొని, అక్కడ ఆయన 5,200 కోట్ల రూపాయల కు పైగా విలువైన ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటు ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు.భారతదేశం మరింతగా అధిక వృద్ధి సాధించాలన్నతన ప్రబల కాంక్ష తో పాటు ప్రపంచ స్థాయి లో ఒక ఉజ్జ్వల స్థలంగా ఉంది: ప్రధాన మంత్రి
July 16th, 08:36 pm
‘‘భారతదేశం ఈ దశాబ్దపు ప్రవర్థమాన బజారు గా మారుతుందా?’’ అనే శీర్షిక తో కేపిటల్ గ్రూపు వెలువరించిన వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.అమెరికాలోని భారత సంతతి సభ్యులతో ప్రధాని సంభాషణ
June 24th, 07:30 am
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23న వాషింగ్టన్ డీసీ లోని రోనాల్డ్ రీగన్ సెంటర్ లో భారత సంతతి సభ్యులతో భేటీ అయ్యారు.పి.ఎల్.ఐ. పథకం ఉక్కు రంగానికి స్పష్టమైన శక్తినిచ్చింది, మన యువకులు, పారిశ్రామికవేత్తలకు అవకాశాలను సృష్టిస్తుంది: ప్రధానమంత్రి
March 17th, 09:41 pm
ఆత్మ నిర్భరత సాధించేందుకు ఉక్కు చాలా కీలకమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పి.ఎల్.ఐ. పథకం ఈ రంగాన్ని స్పష్టంగా శక్తివంతం చేసిందని, మన యువకులు, పారిశ్రామికవేత్తలకు అవకాశాలను సృష్టిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు.‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్’పై బడ్జెట్ అనంతర వెబ్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
March 11th, 10:36 am
“పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్” ఇతివృత్తంగా నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబ్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్-2023లో ప్రకటించిన కార్యక్రమాల సమర్థ అమలుపై సలహాలు-సూచనలు కోరే దిశగా ప్రభుత్వం నిర్వహించిన 12 సదస్సుల పరంపరలో ఇది చిట్టచివరిది కావడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- బడ్జెట్ సమర్పణ తర్వాత అందులోని భాగస్వామ్య వర్గాలన్నిటితో చర్చించే ఆనవాయితీ ఇప్పటికి మూడేళ్లుగా కొనసాగుతోందన్నారు. ఈ మేరకు భాగస్వాములంతా నిర్మాణాత్మకంగా ఇందులో పాలు పంచుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ రూపకల్పనపై చర్చించే బదులు, అందులోగల నిబంధనల అమలుకు సాధ్యమైనన్ని ఉత్తమ మార్గాలపై భాగస్వాములు చర్చించారని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అనంతర వెబ్ సదస్సుల పరంపర ఓ కొత్త అధ్యాయమని ప్రధాని వ్యాఖ్యానించారు, పార్లమెంటు సభ్యులు చట్టసభలో నిర్వహించే చర్చలన్నీ భాగస్వాముల స్థాయి సదస్సులలోనూ నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా వారి నుంచి లభించే విలువైన సూచనలు ఎంతో ప్రయోజనకర ఆచరణకు దారి తీస్తాయని చెప్పారు.‘పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్’పై బడ్జెట్ అనంతర వెబ్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
March 11th, 10:12 am
“పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్” ఇతివృత్తంగా నిర్వహించిన బడ్జెట్ అనంతర వెబ్ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్-2023లో ప్రకటించిన కార్యక్రమాల సమర్థ అమలుపై సలహాలు-సూచనలు కోరే దిశగా ప్రభుత్వం నిర్వహించిన 12 సదస్సుల పరంపరలో ఇది చిట్టచివరిది కావడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- బడ్జెట్ సమర్పణ తర్వాత అందులోని భాగస్వామ్య వర్గాలన్నిటితో చర్చించే ఆనవాయితీ ఇప్పటికి మూడేళ్లుగా కొనసాగుతోందన్నారు. ఈ మేరకు భాగస్వాములంతా నిర్మాణాత్మకంగా ఇందులో పాలు పంచుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ రూపకల్పనపై చర్చించే బదులు, అందులోగల నిబంధనల అమలుకు సాధ్యమైనన్ని ఉత్తమ మార్గాలపై భాగస్వాములు చర్చించారని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ అనంతర వెబ్ సదస్సుల పరంపర ఓ కొత్త అధ్యాయమని ప్రధాని వ్యాఖ్యానించారు, పార్లమెంటు సభ్యులు చట్టసభలో నిర్వహించే చర్చలన్నీ భాగస్వాముల స్థాయి సదస్సులలోనూ నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా వారి నుంచి లభించే విలువైన సూచనలు ఎంతో ప్రయోజనకర ఆచరణకు దారి తీస్తాయని చెప్పారు.Development and heritage are equally important for a country like India: PM Modi
February 10th, 08:27 pm
PM Modi inaugurated the new campus of Aljamea-tus-Saifiyah (The Saifee Academy) at Marol, Mumbai. The Prime Minister said every community, group or organization is recognized by its ability to keep its relevance intact with changing times. “On the parameters of adapting to changing times and development, Dawoodi Bohra Community has proved itself. Institution like Aljamea-tus-Saifiyah is a living example of this”, the PM added.