ఏక‌ల్ విద్యాల‌య సంఘ‌టన్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

December 06th, 02:20 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని ఏక‌ల్ విద్యాల‌య సంఘ‌టన్ ను ఉద్దేశించి ఈ రోజు న ఒక వీడియో సందేశం ద్వారా ప్ర‌సంగించారు. గ్రామీణ ప్రాంతాల కు చెందిన‌ బాలల తో పాటు ఆదివాసీ బాలల్లో విద్యార్జ‌న ను ప్రోత్స‌హించ‌డమే ధ్యేయం గా కృషి చేస్తున్న ‘ఏక‌ల్ స్కూల్ అభియాన్’కు నాయకత్వం వహిస్తున్న ఏక‌ల్ విద్యాల‌య సంఘ‌టన్ ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు. భార‌త‌దేశ వ్యాప్తం గా మారుమూల ప్రాంతాల లో, నేపాల్ లో నివ‌సిస్తున్న 2.8 మిలియ‌న్ కు పైగా పిల్లలు, ఆదివాసీ బాలల కు చదువు ను నేర్పడం ద్వారాను మరియు వారి లో చైత‌న్యాన్ని రగిలించ‌డం ద్వారాను దేశ నిర్మాణం లో సంఘ‌ట‌న్ స్వ‌చ్ఛంద సేవ‌కులు వారి వంతు పాత్ర ను పోషిస్తున్న తీరు ను ఆయ‌న మెచ్చుకొన్నారు.