ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
November 09th, 11:00 am
నేటి నుంచి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం మొదలవుతుంది. అంటే ఉత్తరాఖండ్ 25వ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్రానికి ఉజ్వలమైన, జాజ్వల్యమానమైన భవిష్యత్తును నిర్మించే దిశగా అంకితభావంతో మనముందున్న వచ్చే 25 సంవత్సరాల ప్రస్థానాన్ని మనం ప్రారంభించాలి. యాదృచ్ఛికమే అయినా, సంతోషకరమైన విషయమొకటి ఇందులో ఉంది: జాతీయవృద్ధి కోసం అంకితం చేసిన 25 ఏళ్ల విశేష సమయమైన భారత అమృత్ కాల్, మనం సాధించబోయే ఈ పురోగతి ఏకకాలంలో తటస్థించబోతున్నాయి. అభివృద్ధి చెందిన భారత్‌లో అభివృద్ధి చెందిన ఉత్తరాఖండ్ భావనను ఈ కలయిక దృఢపరుస్తుంది. ఈ కాలంలో మనందరి ఆకాంక్షలు నెరవేరతాయి. ఉత్తరాఖండ్ ప్రజలు రానున్న 25 ఏళ్ల లక్ష్యాలపై దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా ఉత్తరాఖండ్ ఘనతను చాటడంతోపాటు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అనే భావన రాష్ట్ర ప్రజలందరిలో ప్రతిధ్వనిస్తుంది. దృఢ సంకల్పాన్ని స్వీకరించిన ఈ ముఖ్య సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రెండు రోజుల కిందటే ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్ విజయవంతంగా నిర్వహించారు. మన ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో గణనీయమైన పాత్ర పోషిస్తారని విశ్వసిస్తున్నాను.దేవభూమి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
November 09th, 10:40 am
ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు రజతోత్సవ సంవత్సరం ఈ రోజే ప్రారంభమవుతున్నదని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పడి 25 వసంతాలు పూర్తవుతుండడాన్ని గుర్తుచేస్తూ... రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని ప్రజలను శ్రీ మోదీ కోరారు. వచ్చే 25 ఏళ్ల ఉత్తరాఖండ్ ప్రస్థాన సమయానికి భారత్ అమృత కాల్ కు కూడా 25 ఏళ్లు నిండబోతుండడం శుభసూచకమన్నారు. వికసిత భారత్ లో వికసిత ఉత్తరాఖండ్ సంకల్పం నెరవేరబోతుండడాన్ని అది సూచిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వచ్చే 25 ఏళ్లకు పలు తీర్మానాలతో అనేక కార్యక్రమాలను ప్రజలు చేపట్టారని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు ఉత్తరాఖండ్ ఘనతను చాటుతాయని, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఎదిగి ఆ ఫలితాలు రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయని అన్నారు. ఈ సంకల్పాన్ని స్వీకరించిన రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ‘ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్’ను గుర్తుచేసిన ప్రధాని.. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ ప్లీనరీలో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
October 23rd, 05:22 pm
16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న్నందుకు అధ్యక్షుడు పుతిన్ కు అభినందనలు.'మన్ కీ బాత్' శ్రోతలే ఈ కార్యక్రమానికి నిజమైన యాంకర్లు: ప్రధాని మోదీ
September 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.‘‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’’ని ప్రారంభించిన ప్రధానమంత్రి
September 06th, 01:00 pm
‘‘జల సంచాయ్ జన భాగీదారీ’’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని సూరత్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా వాననీటిని సంరక్షించేందుకు రాష్ట్రంలో 24,800 వాన నీటి సంరక్షణ నిర్మాణాలను చేపడతారు. భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండేందుకు దీనిని ఉద్దేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అతి ముఖ్యమైన ఈ ప్రజా చైతన్య కార్యక్రమాన్ని జలశక్తి మంత్రిత్వశాఖ గుజరాత్లో ఈ రోజు ప్రారంభించిందని తెలిపారు. వర్షాకాలం సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు దేశంలో అన్ని ప్రాంతాలూ ఇబ్బందులు పడ్డాయని శ్రీ మోదీ అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఏ తహశీల్‌లోనూ ఇలా కుండపోత వర్షం కురిసినట్లు ఎప్పుడూ వినలేదనీ, చూడలేదనీ ప్రధాని తెలిపారు. ఈసారి గుజరాత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుజరాత్ వాసులు, దేశ ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారని అన్నారు. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావానికి ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.‘‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’’ని ప్రారంభించిన ప్రధానమంత్రి
September 06th, 12:30 pm
‘‘జల సంచాయ్ జన భాగీదారీ’’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని సూరత్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా వాననీటిని సంరక్షించేందుకు రాష్ట్రంలో 24,800 వాన నీటి సంరక్షణ నిర్మాణాలను చేపడతారు. భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండేందుకు దీనిని ఉద్దేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అతి ముఖ్యమైన ఈ ప్రజా చైతన్య కార్యక్రమాన్ని జలశక్తి మంత్రిత్వశాఖ గుజరాత్లో ఈ రోజు ప్రారంభించిందని తెలిపారు. వర్షాకాలం సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు దేశంలో అన్ని ప్రాంతాలూ ఇబ్బందులు పడ్డాయని శ్రీ మోదీ అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఏ తహశీల్‌లోనూ ఇలా కుండపోత వర్షం కురిసినట్లు ఎప్పుడూ వినలేదనీ, చూడలేదనీ ప్రధాని తెలిపారు. ఈసారి గుజరాత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుజరాత్ వాసులు, దేశ ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారని అన్నారు. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావానికి ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.అంతరిక్ష రంగ సంస్కరణల ద్వారా దేశంలోని యువత ప్రయోజనం పొందారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
August 25th, 11:30 am
మిత్రులారా! అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల దేశంలోని యువతకు కూడా చాలా ప్రయోజనం లభించింది. కాబట్టి ఈ రోజు 'మన్ కీ బాత్'లో అంతరిక్ష రంగానికి సంబంధించిన కొంతమంది యువ సహోద్యోగులతో సంభాషించాలని నేను అనుకున్నాను. నాతో మాట్లాడేందుకు స్పేస్ టెక్ స్టార్ట్ అప్ GalaxEye బృందం సిద్ధంగా ఉంది. ఈ స్టార్టప్‌ను ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. ఈ యువకులు – సూయశ్, డేనిల్, రక్షిత్, కిషన్, ప్రణీత్- ఈరోజు ఫోన్ లైన్లో మనతో ఉన్నారు. రండి, ఈ యువత అనుభవాలను తెలుసుకుందాం.పోలాండ్ లోని వార్సా లో భారతీయ సమాజం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 21st, 11:45 pm
ఇక్కడి దృశ్యం నిజంగా అద్భుతం... మీ ఉత్సాహం కూడా అమోఘం. నేను ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుండి, మీరు అలసిపోలేదు. మీరందరూ పోలాండ్లోని వివిధ భాషలు, మాండలికాలు, వివిధ ఆహారపు అలవాట్లున్న ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ భారతీయతే మిమ్మల్ని ఒకటిగా కలిపింది. మీరు ఇక్కడ నాకు స్వాగతం పలికారు... మీరు చూపిన ఈ ఆదరణకు మీ అందరికీ, ముఖ్యంగా పోలాండ్ ప్రజలకు చాలా కృతజ్ఞతలు.వార్సాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 21st, 11:30 pm
ప్రధానమంత్రికి ప్రవాస భారతీయులు ఆత్మీయతతో, ఉత్సాహంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి పోలండ్‌లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్-పోలండ్ సంబంధాలను బలోపేతం చేసేందుకు పోలండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా, ప్రధానమంత్రి డోనాల్డ్ టస్క్ తో సమావేశానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లివంటిదని, పోలండ్‌తో భారతదేశపు విలువలను పంచుకోవడం వల్ల రెండు దేశాలు చేరువయ్యాయని అన్నారు.'హర్ ఘర్ తిరంగ అభియాన్' త్రివర్ణ పతాకం యొక్క వైభవాన్ని నిలబెట్టడంలో ఒక ప్రత్యేకమైన పండుగగా మారింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 28th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీకు స్వాగతం. అభినందనలు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం అందిస్తుంది. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించండి. ఛీర్ ఫర్ భారత్.!!వికసిత భారత్ ప్రయాణంలో వార్తాపత్రికల పాత్ర కీలకం: ముంబైలోని ఐఎన్ఎస్ టవర్స్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ
July 13th, 09:33 pm
ముంబైలోని ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ సెక్రటేరియట్లో ఐఎన్ఎస్ టవర్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రజాస్వామ్యం మరియు సామాజిక మార్పులో మీడియా యొక్క కీలక పాత్రను ఆయన నొక్కిచెప్పారు, పర్యాటకాన్ని ప్రోత్సహించాలని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని మరియు డిజిటల్ ఎడిషన్లను ప్రభావితం చేయాలని వార్తాపత్రికలను కోరారు. భారతదేశం యొక్క గ్లోబల్ ఇమేజ్ మరియు పురోగతిని పెంపొందించడానికి సమిష్టి కృషికి పిలుపునిస్తూ, జాతీయ ఉద్యమాలు మరియు డిజిటల్ కార్యక్రమాలపై మీడియా ప్రభావాన్ని ప్రధాని మోదీ హైలైట్ చేశారు.ముంబాయిలో ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ ( ఐఎన్ ఎస్ ) టవర్స్ ను ప్రారంభించిన ప్రధాని
July 13th, 07:30 pm
ముంబాయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జి బ్లాక్ లోని భారతీయ వార్తాపత్రికల సంఘం కార్యాలయాన్ని సందర్శించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఐఎన్ ఎస్ టవర్స్‌ను ప్రారంభించారు. నూతన భవనం ముంబాయిలో తగినంత స్థలంలో ఆధునిక కార్యాలయాన్ని కలిగివుందని ఇది ఐఎన్ ఎస్ సభ్యుల అవసరాలను తీరుస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ముంబాయిలోని వార్తాపత్రికల పరిశ్రమకు ఇది కీలకమైన కేంద్రంగా వుంటుందని ఆయన పేర్కొన్నారు.జి-7 విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం
June 14th, 09:54 pm
మున్ముందుగా నన్ను ఈ శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించడంతోపాటు అత్యంత గౌరవ మర్యాదలతో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రధానమంత్రి మెలోనీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే చాన్సలర్ ఓలాఫ్ షోల్ట్స్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జి-7 శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకమైనదేగాక, దీనికెంతో చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. ఆ మేరకు కూటమి 50వ వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయ మిత్రులైన జి-7 దేశాధినేతలందరికీ నా మనఃపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను.జి-7 సదస్సులో కృత్రిమ మేధ ఇంధనం ఆఫ్రికా మధ్యధరా ప్రాంతం అంశాలపై విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం
June 14th, 09:41 pm
ఇటలీలోని అపులియాలో జి-7 సదస్సులో భాగంగా ఇవాళ కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం తదితర అంశాలపై నిర్వహించిన విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత జి-7 కూటమి 50వ వార్షికోత్సవ మైలురాయిని అందుకోవడంపై ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ- మానవాళి చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో తాను మూడోసారి ఎన్నికైన తర్వాత ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ప్రధాని హర్షం వెలిబుచ్చారు. మానవ కేంద్రక విధాన ప్రాతిపదికగా ఉన్నపుడే సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం కాగలదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సేవా ప్రదానం కోసం డిజిటల్ సాంకేతికత వినియోగంలో భారత్ సాధించిన విజయాలను సభికులతో ప్రధాని పంచుకున్నారు.