ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 31st, 10:39 pm

ఈటీ వరల్డ్ లీడర్స్ ఫోరం ఈ ఎడిషన్ కు హాజరైన ఇంతమంది సుపరిచిత ముఖాలను చూడటం ఆనందంగా ఉంది. భారతదేశ ఉజ్వల భవిష్యత్తు కు సంబంధించి ఇక్కడ ఉత్తమమైన చర్చలు జరిగాయని నేను నమ్ముతున్నాను. ముఖ్యంగా ప్రపంచం మొత్తం భారతదేశంపై నమ్మకంగా ఉన్న సమయంలో ఈ సంభాషణలు జరిగాయి .

న్యూఢిల్లీలో ఎకనమిక్ టైమ్స్ ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్‌’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

August 31st, 10:13 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఇవాళ ఎకనమిక్ టైమ్స్ యాజమాన్యం నిర్వహించిన ‘వరల్డ్ లీడర్స్ ఫోరమ్’ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ వేదికపై దేశ ఉజ్వల భవిష్యత్తు దిశగా విలక్షణ రీతిలో చర్చలు సాగి ఉంటాయని ఈ సందర్భంగా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచానికి భార‌త్‌పై నమ్మకం ఇనుమడిస్తున్న తరుణంలో సాగుతున్న ఈ చర్చలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు.