2023 వ సంవత్సరం సెప్టెంబర్ 24 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లోమాట) కార్యక్రమం 105 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

September 24th, 11:30 am

నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! నమస్కారం! 'మన్ కీ బాత్' మరొక భాగంలో దేశం సాధించిన విజయాలను, దేశప్రజల విజయాలను, వారి స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని మీతో పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈ రోజుల్లో నాకు వచ్చిన ఉత్తరాలు, సందేశాలు చాలా వరకు రెండు విషయాలపై ఉన్నాయి. మొదటి అంశం చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడం, రెండవ అంశం ఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించడం. దేశంలోని ప్రతి ప్రాంతం నుండి, సమాజంలోని ప్రతి వర్గం నుండి, అన్ని వయసుల వారి నుండి నాకు లెక్కపెట్టలేనన్ని లేఖలు వచ్చాయి. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రునిపై దిగే సంఘటనలో ప్రతి క్షణాన్ని కోట్లాది మంది ప్రజలు వివిధ మాధ్యమాల ద్వారా ఏకకాలంలో చూశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యూట్యూబ్ లైవ్ ఛానెల్‌లో 80 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సంఘటనను వీక్షించారు. అందులోనే ఇదొక రికార్డు. చంద్రయాన్-3తో కోట్లాది మంది భారతీయుల అనుబంధం ఎంత గాఢంగా ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. చంద్రయాన్ సాధించిన ఈ విజయంపై దేశంలో చాలా అద్భుతమైన క్విజ్ పోటీ జరుగుతోంది. ఈ ప్రశ్నల పోటీకి 'చంద్రయాన్-3 మహాక్విజ్' అని పేరు పెట్టారు. మై గవ్ పోర్టల్‌ ద్వారా జరుగుతున్న ఈ పోటీలో ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. మై గవ్ పోర్టల్ ను ప్రారంభించిన తర్వాత రూపొందించిన క్విజ్‌లలో పాల్గొన్నవారి సంఖ్యాపరంగా ఇదే అతిపెద్దది. మీరు ఇంకా ఇందులో పాల్గొనకపోతే ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇంకా కేవలం ఆరు రోజుల గడువే మిగిలి ఉంది. ఈ క్విజ్‌లో తప్పకుండా పాల్గొనండి.

వ్లాడివోస్టాక్‌లో జరిగిన 7వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

September 07th, 02:14 pm

ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ 2022 ప్లీనరీ సెషన్‌లో ప్రధాని మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యాతో తన భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ ఆసక్తిగా ఉందని ప్రధాని అన్నారు. ఇంధన రంగంలో సహకారానికి భారీ అవకాశం ఉంది. ఉక్రెయిన్ వివాదం మొదలైనప్పటి నుంచి భారత్ దౌత్యం, చర్చల మార్గాన్ని అవలంబించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోందని ఆయన అన్నారు.

ఈస్ట‌ర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ 2021 లో ప్ర‌ధాన మంత్రి వ‌ర్చువల్ మాధ్య‌మం ద్వారా ఇచ్చిన ప్ర‌సంగం పాఠం

September 03rd, 10:33 am

ఈస్ట‌ర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మ‌రి ఈ గౌర‌వాన్ని ఇచ్చినందుకు అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ కు నేను ధ‌న్యావాదాలు వ్యక్తం చేస్తున్నాను.

వ్లాదివోస్తోక్ లో జ‌రిగిన 6వ ఈస్ట‌ర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ 2021 లో వ‌ర్చువ‌ల్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

September 03rd, 10:32 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వ్లాదివోస్తోక్ లో ఈ రోజు న జ‌రిగిన 6వ ఈస్ట‌ర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ (ఇఇఎఫ్‌) స‌ర్వ స‌భ్య స‌ద‌స్సు లో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించారు. 2019వ సంవ‌త్స‌రం లో జ‌రిగిన ఇఇఎఫ్ 5వ స‌ద‌స్సు లో ముఖ్య అతిథి గా ప్ర‌ధాన మంత్రి వ్య‌వ‌హ‌రించారు. ఇఇఎఫ్ సదస్సు లో భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి ముఖ్య అతిథి గా వ్యవహరించడం అదే తొలి సారి.

తూర్పు దేశాల ఆర్థిక వేదిక 5వ ప్లీనరీ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం (సెప్టెంబరు 05, 2019)

September 05th, 01:33 pm

భారత, దూర ప్రాచ్య దేశాల స్నేహబంధం ఈ నాటిది కాదు, ఎంతో ప్రాచీనకాలం నాటిది. వ్లాదివోస్తోక్ లో తొలి రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన దేశం భారత్. అంతకన్నా ముందు కూడా భారత, రష్యా మధ్య ఎంతో విశ్వాసపూరితమైన వాతావరణం ఉండేది. సోవియెట్ రష్యా కాలంలో కూడా విదేశీ సందర్శకులపై ఆంక్షలున్నప్పటికీ వ్లోదివోస్తోక్ భారత పౌరుల సందర్శనకు తెరిచి ఉండేది. భారీ పరిమాణంలో రక్షణ, అభివృద్ధి పరికరాలు వ్లాదివోస్తోక్ ద్వారా భారత్ చేరేవి. ఆ స్నేహవృక్షం ఈ రోజున మరింత బలంగా వేళ్లూనుకుంటోంది. ఉభయ దేశాల ప్రజల సంపన్నతకు అది ఒక మూలస్తంభంగా ఉంది. వ్లోదివోస్తోక్ లో భారత్ ఇంధనం, వజ్రాలు వంటి ప్రకృతి వనరుల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. భారత పెట్టుబడుల విజయానికి సఖాలిన్ ఆయిల్ క్షేత్రాలే సజీవ నిదర్శనం.

India - Russia Joint Statement during visit of Prime Minister to Vladivostok

September 04th, 02:45 pm



PM Modi's interview to TASS, Russian News Agency

September 04th, 10:30 am

In an interview to TASS, Prime Minister Narendra Modi said his meeting with Russian President Vladimir Putin on the sidelines of the Eastern Economic Forum in Russia’s Far Eastern city of Vlapostok will give a new impetus to bilateral ties. I am confident that this visit will give a new vector, new energy and a new impetus to the relations between our countries, PM Modi said in the interview.

రష్యాలోని వ్లాదివోస్టాక్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

September 04th, 05:15 am

ప్రధాని మోదీ రష్యాలోని వ్లాదివోస్టాక్ చేరుకున్నారు. తన పర్యటన సందర్భంగా, ప్రధాని ఈస్ట్రన్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాల్గొంటారు మరియు అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి ఇండియా-రష్యా వార్షిక సదస్సును నిర్వహిస్తారు.

ఈస్ట‌ర్న్ ఎక‌నామిక్ ఫోర‌మ్ కు హాజ‌రు కావ‌డం కోసం ర‌ష్యా లోని వ్లాదివోస్తోక్ కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి జారీ చేసిన ప్ర‌క‌ట‌న‌

September 03rd, 11:35 am

నేను 2019వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 4వ మ‌రియు 5 తేదీల లో ర‌ష్యా లోని వ్లాదివోస్తోక్ ను సందర్శించనున్నాను.ర‌ష్యా లోని దూర ప్రాచ్య‌ ప్రాంతాన్ని నేను సందర్శించనుండటం, భార‌తదేశ ప్ర‌ధాన మంత్రి ఒక‌రు అక్కడ కు జ‌రుప‌బోయే ప్ర‌థ‌మ ప‌ర్య‌ట‌న ను సూచించడం తో పాటు ప‌టిష్ట‌మైన మన ద్వైపాక్షిక సంబంధాల‌ ను మ‌రింత వివిధీకరించుకోవాలన్న మరియు దృఢ‌త‌రం గా మలచుకోవాలన్న ఉభ‌య ప‌క్షాల అభిమతాన్ని కూడా నొక్కి వక్కాణిస్తోంది.