Text of PM's address at the inauguration and laying of foundation stone of various Railway Projects

January 06th, 01:00 pm

PM Modi inaugurated key railway projects in Jammu, including the new Jammu Railway Division, and launched the Charlapalli Terminal Station in Telangana. He also laid the foundation for the Rayagada Railway Division Building in Odisha. These initiatives aim to modernize railway infrastructure, improve connectivity, create jobs, and promote regional development, with special emphasis on enhancing passenger facilities and boosting economic growth.

PM Modi inaugurates and lays foundation stone of various railway projects

January 06th, 12:30 pm

PM Modi inaugurated key railway projects in Jammu, including the new Jammu Railway Division, and launched the Charlapalli Terminal Station in Telangana. He also laid the foundation for the Rayagada Railway Division Building in Odisha. These initiatives aim to modernize railway infrastructure, improve connectivity, create jobs, and promote regional development, with special emphasis on enhancing passenger facilities and boosting economic growth.

We are working fast in every sector for the development of Odisha: PM Modi at Odisha Parba 2024

November 24th, 08:48 pm

PM Modi addressed Odisha Parba 2024, celebrating Odisha's rich cultural heritage. He paid tribute to Swabhaba Kabi Gangadhar Meher on his centenary, along with saints like Dasia Bauri, Salabega, and Jagannath Das. Highlighting Odisha's role in preserving India's cultural persity, he shared the inspiring tale of Lord Jagannath leading a battle and emphasized faith, unity, and pine guidance in every endeavor.

ఒడిశా పర్వ 2024 ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

November 24th, 08:30 pm

న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ‘ఒడిశా పర్వ 2024’ ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు హాజరైన ఒడిశా సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదితో స్వభావ్ కవి గంగాధర్ మెహర్ మరణించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భక్త దసియా భౌరీ, భక్త సాలబేగ, భగవద్గీతను ఒడియాలో రచించిన శ్రీ జగన్నాథ్ దాస్‌‌కు సైతం ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం

November 22nd, 10:50 pm

మంత్రి విన్‌ఫ్రైడ్, నా మంత్రివర్గ సహచరుడు జ్యోతిరాదిత్య సిందియా, ఈ సదస్సుకు హాజరైన సోదరీ సోదరులారా!

న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం

November 22nd, 09:00 pm

జర్మనీలోని స్టట్‌గార్ట్ లో జరిగిన న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్-జర్మనీ భాగస్వామ్యంలో ఈ సదస్సు కొత్త అధ్యాయానికి తెరతీస్తుందని ప్రధానమంత్రి అన్నారు. “నేటి సమాచార యుగంలో జర్మనీ, జర్మన్ ప్రజలతో అనుసంధితమయ్యేలా భారతదేశం నుంచి ఓ మీడియా సంస్థ ప్రయత్నిస్తుండడం సంతోషాన్నిస్తోంది. జర్మనీని, ఆ దేశ ప్రజలను అర్థం చేసుకోవడానికి భారతీయులకు ఇది ఒక వేదికను అందిస్తుంది” అని ప్రధానమంత్రి అన్నారు.

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 09th, 11:00 am

నేటి నుంచి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం మొదలవుతుంది. అంటే ఉత్తరాఖండ్ 25వ వసంతంలోకి అడుగుపెడుతోంది. రాష్ట్రానికి ఉజ్వలమైన, జాజ్వల్యమానమైన భవిష్యత్తును నిర్మించే దిశగా అంకితభావంతో మనముందున్న వచ్చే 25 సంవత్సరాల ప్రస్థానాన్ని మనం ప్రారంభించాలి. యాదృచ్ఛికమే అయినా, సంతోషకరమైన విషయమొకటి ఇందులో ఉంది: జాతీయవృద్ధి కోసం అంకితం చేసిన 25 ఏళ్ల విశేష సమయమైన భారత అమృత్ కాల్, మనం సాధించబోయే ఈ పురోగతి ఏకకాలంలో తటస్థించబోతున్నాయి. అభివృద్ధి చెందిన భారత్‌లో అభివృద్ధి చెందిన ఉత్తరాఖండ్ భావనను ఈ కలయిక దృఢపరుస్తుంది. ఈ కాలంలో మనందరి ఆకాంక్షలు నెరవేరతాయి. ఉత్తరాఖండ్ ప్రజలు రానున్న 25 ఏళ్ల లక్ష్యాలపై దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాల ద్వారా ఉత్తరాఖండ్ ఘనతను చాటడంతోపాటు అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అనే భావన రాష్ట్ర ప్రజలందరిలో ప్రతిధ్వనిస్తుంది. దృఢ సంకల్పాన్ని స్వీకరించిన ఈ ముఖ్య సందర్భంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రెండు రోజుల కిందటే ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్ విజయవంతంగా నిర్వహించారు. మన ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో గణనీయమైన పాత్ర పోషిస్తారని విశ్వసిస్తున్నాను.

దేవభూమి ఉత్తరాఖండ్ రజతోత్సవ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు

November 09th, 10:40 am

ఉత్తరాఖండ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు రజతోత్సవ సంవత్సరం ఈ రోజే ప్రారంభమవుతున్నదని గుర్తు చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పడి 25 వసంతాలు పూర్తవుతుండడాన్ని గుర్తుచేస్తూ... రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలని ప్రజలను శ్రీ మోదీ కోరారు. వచ్చే 25 ఏళ్ల ఉత్తరాఖండ్ ప్రస్థాన సమయానికి భారత్ అమృత కాల్ కు కూడా 25 ఏళ్లు నిండబోతుండడం శుభసూచకమన్నారు. వికసిత భారత్ లో వికసిత ఉత్తరాఖండ్ సంకల్పం నెరవేరబోతుండడాన్ని అది సూచిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. వచ్చే 25 ఏళ్లకు పలు తీర్మానాలతో అనేక కార్యక్రమాలను ప్రజలు చేపట్టారని ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలు ఉత్తరాఖండ్‌ ఘనతను చాటుతాయని, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ ఎదిగి ఆ ఫలితాలు రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయని అన్నారు. ఈ సంకల్పాన్ని స్వీకరించిన రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన ‘ప్రవాసీ ఉత్తరాఖండ్ సమ్మేళన్’ను గుర్తుచేసిన ప్రధాని.. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస ఉత్తరాఖండ్ వాసులు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభంలో భాగంగా ప్రధాని చేసిన ప్రసంగానికి అనువాదం

September 29th, 12:45 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్, శ్రీ అజిత్ పవార్, పుణే పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు, మంత్రివర్గ యువ సహచరుడు శ్రీ మురళీధర్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొంటున్న ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ కార్యక్రమానికి హాజరైన సోదర సోదరీమణులందరికీ..

మహారాష్ట్రలో వీడియో అనుసంధానం ద్వారా పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 29th, 12:33 pm

మహారాష్ట్రలో రూ.11,200 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో అనుసంధానం ద్వారా శంకుస్థాపన చేసి, ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను , అత్యధిక సామర్ధ్యం కలిగిన కంప్యూటింగ్ సిస్టమ్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం

September 26th, 05:15 pm

గౌరవ ఎలక్ట్రానిక్స్, ఐటి శాఖల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, దేశంలోని వివిధ పరిశోధనా సంస్థల గౌరవ డైరెక్టర్లు, ప్రముఖ సీనియర్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు , పరిశోధకులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు మహిళలు , పెద్దలు!

మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 26th, 05:00 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా దాదాపు రూ.130 కోట్ల విలువైన మూడు ‘పరమ్ రుద్ర’ సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేశారు. ‘నేషనల్ సూపర్‌ కంప్యూటింగ్ మిషన్’ (ఎన్ఎస్ఎం) కింద దేశీయంగా రూపొందించిన ఈ సూపర్‌ కంప్యూటర్లను పుణె, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో ఏర్పాటు చేశారు. దేశంలో నిర్వహించే అగ్రగామి పరిశోధనలకు ఇవి ఇతోధికంగా తోడ్పడతాయి. దీంతోపాటు వాతావరణం, వాతావరణ మార్పులపై పరిశోధనల కోసం రూపొందించిన ‘హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పిసి) వ్యవస్థ’ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.

ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన సెమీకాన్ ఇండియా 2024 కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

September 11th, 12:00 pm

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, అశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాద, ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమతో సంబంధం ఉన్న దిగ్గజాలు, విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలకి చెందిన భాగస్వాములు, ఇతర విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా ! అందరికీ నమస్కారం!

ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరుగుతోన్న సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

September 11th, 11:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా‌లో ఉన్న ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రదర్శనను ఆయన వీక్షించారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను ప్రపంచస్థాయి హబ్‌గా మార్చే వ్యూహం, విధానంపై చర్చించనున్నారు.

మూడు వందే భారత్ రైళ్ల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం ఆంగ్ల అనువాద సారాంశం

August 31st, 12:16 pm

అశ్విని వైష్ణవ్ జీ సహా కేంద్ర ప్రభుత్వంలోని నా గౌరవ సహచరులు; ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్ జీ; తమిళనాడు గవర్నర్, ఆర్ ఎన్ రవి, కర్నాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, యోగి ఆదిత్యనాథ్, నా ఇతర క్యాబినెట్ సహచరులు, రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రజా ప్రతినిధులు, సోదర సోదరీమణులారా!

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాన మంత్రి

August 31st, 11:55 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ మూడు వందే భారత్ రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి నేడు ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ వంటి ప్రధాని దార్శనికతను సాకారం చేస్తూ, ఈ అత్యాధునిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు మూడు మార్గాల్లో ప్రయాణ సదుపాయాలను మెరుగుపరిచాయి. మీరట్-లక్నో, మదురై-బెంగళూరు, చెన్నై-నాగర్‌కోయిల్. ఈ రైళ్లు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అనుసంధానతను పెంచుతాయి.

భారత-ఆస్ట్రియా సీఈవోల సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

July 10th, 07:01 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ గౌరవనీయ కార్ల్ నెహమ్మర్ ఇవాళ భారత-ఆస్ట్రియా దేశాల్లోని భిన్న రంగాల అగ్రగామి సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారు(సీఈవో)ల సమావేశంలో సంయుక్తంగా ప్రసంగించారు. ఉభయ దేశాల్లోని ఆటోమొబైల్, మౌలిక సదుపాయాలు, ఇంధనం, ఇంజినీరింగ్ రంగాలు సహా పలు అంకుర సంస్థల సీఈవోలు ఇందులో పాల్గొన్నారు.

Chip manufacturing will take India towards self-reliance, towards modernity: PM Modi

March 13th, 11:30 am

PM Modi addressed ‘India’s Techade: Chips for Viksit Bharat’ program and laid the foundation stone for three semiconductor projects worth about Rs 1.25 lakh crores via video conferencing. Today’s projects will play a key role in making India a semiconductor hub”, PM Modi said, as he congratulated the citizens for the key initiatives.

‘ఇండియా‌స్ టెకేడ్: చిప్స్ ఫార్ వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

March 13th, 11:12 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడు సెమికండక్టర్ ప్రాజెక్టుల కు ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా శంకుస్థాపన చేయడం తో పాటుగా, ‘ఇండియాస్ టెకేడ్: చిప్స్ ఫార్ వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకొని సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు కూడాను. ఈ రోజు న శంకుస్థాపన జరిగిన సెమికండక్టర్ ప్రాజెక్టు లు మూడిటి విలువ దాదాపు గా 1.25 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది. ఈ రోజు న ప్రారంభించిన సదుపాయాల లో గుజరాత్ లో ధోలెరా స్పెశల్ ఇన్‌వెస్ట్‌ మెంట్ రీజియన్ (డిఎస్ఐఆర్) లోని సెమికండక్టర్ పేబ్రికేశన్ ఫెసిలిటీ, అసమ్ లోని మోరీగాఁవ్ లో అవుట్‌సోర్స్‌ డ్ సెమికండక్టర్ అసెంబ్లి ఎండ్ టెస్ట్ (ఒఎస్ఎటి) ఫెసిలిటీ తో పాటు గుజరాత్ లోని సాణంద్ లో అవుట్‌సోర్స్‌ డ్ సెమికండక్టర్ అసెంబ్లి ఎండ్ టెస్ట్ (ఒఎస్ఎటి) సదుపాయం భాగం గా ఉన్నాయి.

Cabinet approves amendment in the Foreign Direct Investment (FDI) policy on Space Sector

February 21st, 11:06 pm

The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi approved the amendment in Foreign Direct Investment (FDI) policy on space sector. Now, the satellites sub-sector has been pided into three different activities with defined limits for foreign investment in each such sector.