ప్రభుత్వాధినేతగా 23 వసంతాలు పౌరులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు

October 07th, 09:06 pm

ప్రభుత్వాధినేతగా 23 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ పౌరులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలాన్ని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. తన హయాంలో ఆ రాష్ట్రం సమాజంలోని అన్ని వర్గాల శ్రేయస్సుకు భరోసా ఇస్తూ ‘సబ్కా సాథ్-సబ్కా వికాస్’ నినాదానికి ఉజ్వల నిదర్శనంగా నిలిచిందని పేర్కొన్నారు. అలాగే గడచిన దశాబ్దంలో భారత పురోగమన వేగం ప్రపంచమంతా మనవైపు అత్యంత ఆశాభావంతో దృష్టి సారించేలా చేసిందని వ్యాఖ్యానించారు. దేశంలోని 140 కోట్లమంది పౌరుల సమష్టి స్వప్నమైన ‘వికసిత భారత్’ సాకారమయ్యేదాకా అవిశ్రాంతంగా కృషి చేస్తానని ఆయన ప్రతినబూనారు.

పోలాండ్ లోని వార్సా లో భారతీయ సమాజం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 21st, 11:45 pm

ఇక్కడి దృశ్యం నిజంగా అద్భుతం... మీ ఉత్సాహం కూడా అమోఘం. నేను ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుండి, మీరు అలసిపోలేదు. మీరందరూ పోలాండ్‌లోని వివిధ భాషలు, మాండలికాలు, వివిధ ఆహారపు అలవాట్లున్న ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ భారతీయతే మిమ్మల్ని ఒకటిగా కలిపింది. మీరు ఇక్కడ నాకు స్వాగతం పలికారు... మీరు చూపిన ఈ ఆదరణకు మీ అందరికీ, ముఖ్యంగా పోలాండ్ ప్రజలకు చాలా కృతజ్ఞతలు.

వార్సాలో ప్ర‌వాస భార‌తీయుల‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

August 21st, 11:30 pm

ప్రధానమంత్రికి ప్రవాస భార‌తీయులు ఆత్మీయ‌త‌తో, ఉత్సాహంతో స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 45 ఏళ్ల త‌ర్వాత భార‌త ప్రధానమంత్రి పోలండ్‌లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. భార‌త్‌-పోలండ్‌ సంబంధాలను బ‌లోపేతం చేసేందుకు పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా, ప్రధానమంత్రి డోనాల్డ్ టస్క్ తో స‌మావేశానికి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యానికి భార‌త్ త‌ల్లివంటిద‌ని, పోలండ్‌తో భార‌తదేశపు విలువ‌ల‌ను పంచుకోవ‌డం వ‌ల్ల రెండు దేశాలు చేరువ‌య్యాయ‌ని అన్నారు.

ప్రిక్స్వర్సేల్స్ మ్యూజియమ్స్ 2024 కోసం వరల్డ్ సెలక్శన్ లో స్మృతివనాన్ని చేర్చినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

June 15th, 06:23 pm

ప్రిక్స్ వర్సేల్స్ మ్యూజియమ్స్ 2024 కోసమని ప్రపంచ ఎంపిక లో భాగం గా కచ్ఛ్ లోని స్మృతివనాన్ని చేర్చడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ప్రశంసించారు. కచ్ఛ్ లో 2001వ సంవత్సరం లో వచ్చిన వినాశకారి భూకంపం లో ప్రాణాలను కోల్పోయిన వ్యక్తులను స్మరించుకోవడం కోసం స్మృతివనాన్ని నిర్మించడమైంది.

Narendra Modi: The Go-To Man in Times of Crises

November 29th, 09:56 pm

“I salute the determination of all those involved in this rescue campaign. Their courage and resolve have given a new life to our fellow workers. Everyone involved in this mission has set a remarkable example of humanity and teamwork,” PM Modi said in a telephonic conversation with the rescued workers who were successfully pulled out of a collapsed tunnel in Uttarakhand.

Armed forces have taken India’s pride to new heights: PM Modi in Lepcha

November 12th, 03:00 pm

PM Modi addressed brave jawans at Lepcha, Himachal Pradesh on the occasion of Diwali. Addressing the jawans he said, Country is grateful and indebted to you for this. That is why one ‘Diya’ is lit for your safety in every household”, he said. “The place where jawans are posted is not less than any temple for me. Wherever you are, my festival is there. This is going on for perhaps 30-35 years”, he added.

హిమాచల్ ప్రదేశ్‘లోని లెప్చాలో వీర సైనికులతో ప్రధానమంత్రి దీపావళి వేడుకలు

November 12th, 02:31 pm

దీపావళి పండుగ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాలో మన సాహస భద్రత దళాలతో కలసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జవాన్లనుద్దేశించి మాట్లాడుతూ- దీపావళి పండుగనాడు ఈ కలయిక, జవాన్ల ధైర్యసాహసాల ప్రతిధ్వనులు దేశంలోని ప్రతి పౌరునికీ చైతన్యం కలిగించే క్షణాలని అభివర్ణించారు. దేశంలోని చివరి గ్రామంగా ఉండి, నేడు తొలి గ్రామంగా గుర్తింపు పొందిన లెప్చా పరిధిలో సరిహద్దు ప్రాంతాల జవాన్లతో సంయుక్తంగా ఆయన దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

నేపాల్‌లో భూకంపం వల్ల సంభవించిన ప్రాణనష్టం, ఇతర నష్టం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

November 04th, 10:30 am

నేపాల్‌లో సంభవించిన భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నేపాల్ ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుందని, అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేసారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవానలని ఆకాంక్షించారు.

Vibrant Gujarat is not just an event of branding, but it is also an event of bonding: PM Modi

September 27th, 11:00 am

PM Modi addressed the programme marking 20 years celebration of the Vibrant Gujarat Global Summit at Science City in Ahmedabad. He remarked that the seeds sown twenty years ago have taken the form of a magnificent and perse Vibrant Gujarat. Reiterating that Vibrant Gujarat is not merely a branding exercise for the state but an occasion to strengthen the bonding, PM Modi emphasized that the summit is a symbol of a solid bond associated with him and the capabilities of 7 crore people of the state.

వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 20 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని ప్రసంగించిన ప్రధాన మంత్రి

September 27th, 10:30 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు అహ్మ‌దాబాద్‌లోని సైన్స్ సిటీలో వైబ్రెంట్ గుజ‌రాత్ గ్లోబ‌ల్ సమ్మిట్ 20 ఏళ్ల వేడుక‌ల సంద‌ర్భంగా జరిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 20 సంవత్సరాల క్రితం 2003 సెప్టెంబర్ 28న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ప్రారంభమైంది. కాలక్రమేణా, ఇది ఒక గ్లోబల్ ఈవెంట్‌గా రూపాంతరం చెందింది, భారతదేశంలోని ప్రధాన వ్యాపార శిఖరాగ్ర సమావేశాలలో ఒకటిగా హోదాను పొందింది.

All saints have nourished the spirit of ‘Ek Bharat Shreshta Bharat’ for thousands of years in India: PM Modi

July 04th, 11:00 am

PM Modi inaugurated Sai Hira Global Convention Centre in Puttaparthi, Andhra Pradesh via video conferencing. He expressed confidence that the new center will create an experience of spirituality and splendor of modernity. He said that the center comprises cultural persity and a conceptual grandeur, and it will become a focal point for discussions on spirituality and academic programs where scholars and experts will get together.

ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి లో సాయి హీరా గ్లోబల్కన్ వెన్శన్ సెంటరు ను వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించిన ప్రధాన మంత్రి

July 04th, 10:36 am

ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తి లో ఏర్పాటైనటువంటి సాయి హీరా గ్లోబల్ కన్ వెన్శన్ సెంటరు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తం గా పలువురు ప్రముఖుల మరియు భక్తుల సమక్షం లో ఈ ప్రారంభ కార్యక్రమం సంపన్నమైంది.

2023 వ సంవత్సరం జూన్ 18 వ తేదీ న జరిగిన మన్ కీ బాత్ (మనసు లోమాట) కార్యక్రమం 102 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

June 18th, 11:30 am

మిత్రులారా!ప్రధానిగా నేను ఈ మంచి పని చేశాను, ఇంత గొప్ప పని చేశానని చాలా మంది అంటారు. చాలా మంది 'మన్ కీ బాత్' శ్రోతలు తమ లేఖల్లో చాలా ప్రశంసిస్తూ ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశానని చాలా మంది రాస్తూ ఉంటారు. కొన్ని మంచి పనులు, కొన్ని గొప్ప పనులు చేశానని అంటూ ఉంటారు. కానీ, భారతదేశంలోని సామాన్యుల ప్రయత్నాలు, వారి కృషి, వారి సంకల్పబలం చూసినప్పుడుపొంగిపోతాను. అతిపెద్ద లక్ష్యం కావచ్చు, కష్టమైన సవాలు కావచ్చు- భారతదేశ ప్రజల సామూహిక బలం, సమష్టి శక్తి ప్రతి సవాలును పరిష్కరిస్తాయి. రెండు-మూడు రోజుల క్రితందేశ పశ్చిమ ప్రాంతంలో ఎంత పెద్ద తుఫాను వచ్చిందో మనం చూశాం. బలమైన గాలులు, భారీ వర్షం. బిపార్జాయ్ తుఫాను కచ్‌లో చాలా విధ్వంసం సృష్టించింది. కచ్ ప్రజలు ఇంత ప్రమాదకరమైన తుఫానును ఎంతో ధైర్యంతో, సన్నద్ధతతో ఎదుర్కొన్న తీరు ఎంతో అపూర్వమైంది. రెండు రోజుల తరువాతకచ్ ప్రజలు తమ కొత్త సంవత్సరం ఆషాఢీ బీజ్ ను జరుపుకుంటున్నారు. కచ్‌లో వర్షాల ప్రారంభానికి ప్రతీకగా ఆషాఢీ బీజ్‌ను జరుపుకుంటారు. నేను చాలా సంవత్సరాలుగా కచ్‌కి వెళ్తూ వస్తూ ఉన్నాను. అక్కడి ప్రజలకు సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అందువల్ల కచ్ ప్రజల తెగువ, వారి జీవనోపాధి గురించి నాకు బాగా తెలుసు. రెండు దశాబ్దాల క్రితం విధ్వంసకర భూకంపం తర్వాత ఎన్నటికీ కోలుకోలేదని భావించిన కచ్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటి. బైపర్‌జోయ్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుండి కూడా కచ్ ప్రజలు వేగంగా బయటపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం

May 23rd, 08:54 pm

ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి, నా ప్రియ మిత్రుడు ఆంథోనీ అల్బనీస్, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని, గౌరవనీయులు స్కాట్ మోరిసన్, న్యూసౌత్ వేల్స్ ప్రధాని క్రిస్ మిన్స్, విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, కమ్యూనికేషన్ల మంత్రి మిచెల్ రోలాండ్, ఇంధన మంత్రి క్రిస్ బోవెన్, ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్, సహాయ విదేశాంగ మంత్రి టిమ్ వాట్స్, గౌరవనీయ న్యూ సౌత్ వేల్స్ క్యాబినెట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. పర్రమట్ట పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఆండ్రూ చార్ల్టన్, ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియా పార్లమెంటు సభ్యులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ ప్రవాస భారతీయులు ఈ రోజు ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ గుమిగూడారు! మీ అందరికీ నా నమస్కారాలు!

ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో భారతీయ సముదాయం తో మాట్లాడినప్రధాన మంత్రి

May 23rd, 01:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే నెల 23 వ తేదీ నాడు సిడ్ నీ లోని కుడోస్ బ్యాంక్ అరీన లో భారతీయ సముదాయం సభ్యుల తో కూడిన ఒక పెద్ద సభ ను ఉద్దేశించి ప్రసంగించడం తో పాటు వారి తో మాటామంతీ జరిపారు. ఈ కార్యక్రమం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ కూడా పాలుపంచుకొన్నారు.

కడ్వా పాటిదార్ సమాజ్ 100వ వార్షికోత్సవంలో ప్రధాని వ్యాఖ్యలు

May 11th, 12:48 pm

కచ్చి పటేళ్లు కచ్ కే కాదు, యావత్ భారతదేశానికి గర్వకారణం. నేను భారతదేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా, అక్కడ ఈ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు కనిపిస్తారు. అందుకే అంటారు - కచ్ ప్రజలు సముద్రంలో చేపలా ప్రపంచమంతా తిరుగుతారు. వారు ఎక్కడ నివసిస్తున్నా అక్కడ కచ్ లో స్థిరపడతారు. ఈ కార్యక్రమంలో శారదా పీఠానికి చెందిన జగద్గురు పూజ్య శంకరాచార్య స్వామి సదానంద సరస్వతి, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు పురుషోత్తం భాయ్ రూపాలా, అఖిల భారత కచ్ కడ్వా పాటిదార్ సమాజ్ అధ్యక్షుడు శ్రీ అబ్జీ భాయ్ విష్రామ్ భాయ్ కనానీ, ఇతర ఆఫీస్ బేరర్లు, దేశవిదేశాలకు చెందిన నా సోదరసోదరీమణులందరూ పాల్గొన్నారు.

కడ్ వా పాటీదార్ సమాజ్ వందో వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

May 11th, 12:10 pm

కడ్ వా పాటీదార్ సమాజ్ యొక్క వందో వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.

కచ్ఛ్ లో 2001 వ సంవత్సరం లో భయంకరభూకంపం సంభవించిన అనంతరం అక్కడ చోటుచేసుకొన్న పరివర్తన ను గురించి కొన్ని ట్వీట్లను శేర్ చేసిన ప్రధాన మంత్రి

April 05th, 10:59 am

కచ్ఛ్ లో 2001 వ సంవత్సరం లో సంభవించిన భూకంపం వల్ల జరిగిన విధ్వంసం అనంతరం ఆ ప్రాంతం లో చోటు చేసుకొన్న అభివృద్ధి మరియు పరివర్తన లు కచ్ఛ్ ను పర్యటన తాలూకు ఒక గొప్ప స్థలం గా తీర్చిదిద్దాయంటూ కచ్ఛ్ పార్లమెంట్ సభ్యుడు శ్రీ వినోద్ చావ్ డా చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

వైపరీత్యాలను తట్టుకునే మౌలిక వసతుల అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో సందేశం

April 04th, 09:46 am

గౌరవ అతిథులు, ప్రభుత్వాధినేతలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, విధానకర్తలు, ప్రపంచం మొత్తం నుండి వచ్చిన నా ప్రియ మిత్రులారా !

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై 5వ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన - ప్రధానమంత్రి

April 04th, 09:45 am

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలు - సి.డి.ఆర్.ఐ. పై 5వ అంతర్జాతీయ సదస్సు నుద్దేశించి ప్రధానమంత్రి ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.