వారణాసిలో ఆర్‌జె శంకర కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

October 20th, 02:21 pm

కంచి కామకోటి పీఠం శంకరాచార్య పూజ్యశ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి శ్రీ బ్రజేష్ పాఠక్; శంకర నేత్ర నిధి ప్రతినిధి శ్రీ ఆర్‌.వి.రమణి, ఇతర ప్రముఖులు డాక్టర్ శ్రీ ఎస్.వి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీ మురళీ కృష్ణమూర్తి, శ్రీమతి రేఖా ఝున్‌ఝున్‌వాలా, సంస్థ విశిష్ట సభ్యులు, గౌరవనీయ సోదరసోదరీమణులారా!

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఆర్ జె శంకర కంటి ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 20th, 02:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఆర్ జె శంకర కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రి వివిధ కంటి సమస్యలకు సమగ్ర సలహాలు , చికిత్సలను అందిస్తుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ సందర్శించారు.

జి-20 ఆరోగ్య శాఖమంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి వీడియో మాధ్యం ద్వారా ప్రధాన మంత్రి ఇచ్చిన సందేశంపాఠం

August 18th, 02:15 pm

భారతదేశం లోని 1.4 బిలియన్ ప్రజల తరుఫున మీకు భారతదేశం లోకి మరియు నా యొక్క స్వరాష్ట్రం అయిన గుజరాత్ లోకి ఎంతో ఆప్యాయం గా నేను ఆహ్వానిస్తున్నాను. నాతో పాటు గా మీకు స్వాగతం పలుకుతున్న వారిలో 2.4 మిలియన్ మంది డాక్టర్ లు, 3.5 మిలియన్ మంది నర్సు లు, 1.3 మిలియన్ మంది పారామెడిక్స్, 1.6 మిలియన్ మంది ఫార్మాసిస్టు లు మరియు భారతదేశం లో ఆరోగ్య సంరక్షణ రంగం లో పాలుపంచుకొంటున్న మిలియన్ ల కొద్దీ ఇతరులు కూడా ఉన్నారు.

జి-20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో ప్రధాని ప్రసంగం

August 18th, 01:52 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించిన జి-20 కూటమి ఆరోగ్య మంత్రుల సమావేశాన్నుద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ముందుగా భారత ఆరోగ్య సంరక్షణ రంగంలోని 21 లక్షల మంది డాక్ట‌ర్లు, 35 లక్షల మంది నర్సులు, 1.3 లక్షల మంది పాక్షికవైద్య నిపుణులు, 16 లక్షల మంది ఫార్మాసిస్టులతోపాటు లక్షలాది ఇతరత్రా సిబ్బంది తరఫున కూటమి దేశాల ప్రతినిధులు, ప్రముఖులకు ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యంపై జాతిపిత దృక్పథాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు గాంధీజీ ఆరోగ్యాన్ని చాలా ముఖ్యమైన అంశంగా భావించారని, దీనిపై ‘కీ టు హెల్త్’ పేరిట పుస్తకం రాశారని ప్రధాని గుర్తుచేశారు. మనోశరీరాల సమతూకమే ఆరోగ్యమని, జీవితానికి పునాది అటువంటి ఆరోగ్యమేనని ఆయన అన్నారు.

న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

May 11th, 11:00 am

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వర్గం లోని నా సీనియర్ సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనిటీ కి చెందిన గౌరవనీయ సభ్యులు, నా యువ సహచరులు! ఈ రోజు భారతదేశ చరిత్రలో గర్వించదగిన రోజులలో ఒకటి. భారతమాత ప్రతి బిడ్డ గర్వపడేలా చేసిన పోఖ్రాన్ లో భారత శాస్త్రవేత్తలు ఇలాంటి ఘనతను సాధించారు. అటల్ జీ భారతదేశం విజయవంతంగా అణు పరీక్షను ప్రకటించిన రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. భారత్ తన శాస్త్రీయ నైపుణ్యాన్ని నిరూపించుకోవడమే కాకుండా, పోఖ్రాన్ అణుపరీక్ష ద్వారా భారత్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి కొత్త ఎత్తుకు చేర్చింది. అటల్ గారి మాటలను నేను ఉదహరిస్తున్నాను, మేము మా మిషన్ లో ఎప్పుడూ ఆగిపోలేదు, ఏ సవాలు ముందు తలవంచలేదు. దేశ ప్రజలందరికీ జాతీయ సాంకేతిక దినోత్సవ శుభాకాంక్షలు.

నేషనల్ టెక్నాలజీ దినోత్సవం సందర్భంగా మే 11వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి

May 11th, 10:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలోని ప్రగత మైదాన్ లో నేషనల్ టెక్నాలజీ దినోత్సవం 2023ను పురస్కరించుకుని నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 11 నుంచి 14వ తేదీల మధ్య జరిగే నేషనల్ టెక్నాలజీ దినోత్సవం రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ అద్భుత సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి దేశ శాస్ర్త, సాంకేతిక పురోగమనానికి దోహదపడే రూ.5800 కోట్లకు పైబడిన విలువ గల పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు. దేశంలోని శాస్ర్తీయ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ సాధించాలన్న ప్రధానమంత్రి విజన్ కు అనుగుణంగా ఈ కార్యక్రమం జరిగింది.

ఏయిమ్స్ గౌహతి ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

April 14th, 12:45 pm

అస్సాం గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియా జీ, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ జీ, కేంద్ర కేబినెట్‌లోని నా సహచరులు, దేశ ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాజీ మరియు డాక్టర్ భారతి పవార్ జీ, అస్సాం ప్రభుత్వ మంత్రి కేశబ్ మహంతా జీ, ప్రముఖులందరూ వైద్య ప్రపంచం నుండి, వివిధ ప్రాంతాల నుండి వీడియో కాన్ఫరెన్స్‌తో అనుసంధానించబడిన ప్రముఖులందరూ మరియు అస్సాంలోని నా ప్రియమైన సోదర సోదరీమణులారా.

అస్సాం లో రూ.3,400 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాన మంత్రి

April 14th, 12:30 pm

శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాంలోని గువాహతి లో అస్సాం లో రూ.3,400 కోట్లకు పైగా విలువ చేసే ప్రాజెక్టులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గువాహతి ఎయిమ్స్, మరో మూడు మెడికల్ కాలేజీలను ఈ సందర్భంగా ప్రధాని జాతికి అంకితం చేశారు. అదే విధంగా అస్సాం అడ్వాన్స్ డ్ హెల్త్ కేర్ ఇన్నోవేషన్ ఇన్ స్టిట్యూట్ కు శంకుస్థాపన చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డులను పంచటం ద్వారా ‘ఆప్ కే ద్వార్ ఆయుష్మాన్’ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 18th, 11:17 pm

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో మాతో ఉన్న ప్రముఖులందరికీ శుభాకాంక్షలు! డిజిటల్ మాధ్యమం ద్వారా మాతో పాటు చేరిన భారతదేశం తో పాటు విదేశాల నుండి వీక్షకులకు మరియు పాఠకులకు శుభాకాంక్షలు. ఈ కాన్క్లేవ్ థీమ్ - ది ఇండియా మూమెంట్ అని చూసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేడు ప్రపంచంలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, ఆలోచనాపరులు ఇది భారతదేశపు క్షణమని ఏకాభిప్రాయంతో చెబుతున్నారు. కానీ ఇండియా టుడే గ్రూప్ ఈ ఆశావాదాన్ని ప్రదర్శించినప్పుడు, అది 'ఎక్స్‌ట్రా స్పెషల్'. చెప్పాలంటే, 20 నెలల క్రితం ఎర్రకోట ప్రాకారాల నుండి నేను చెప్పాను - ఇదే సమయం, సరైన సమయం. కానీ ఈ స్థానానికి చేరుకోవడానికి 20 నెలలు పట్టింది. అప్పుడు కూడా అదే స్ఫూర్తి – ఇది భారతదేశం యొక్క క్షణం.

ఇండియా టుడే సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

March 18th, 08:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీలోని హోటల్ తాజ్ పాలస్ లో జరిగిన ఇండియా టుడే సదస్సులో ప్రసంగించారు.

టెక్నాలజీ అందరి జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తూ పౌరులను సాధికారం చేస్తోంది : పిఎం

March 06th, 09:07 pm

టెక్నాలజీ అందరి జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తూ పౌరులను సాధికారం చేస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు అరుణాచల్ ప్రదేశ్ లో మొబైల్ సర్వీస్ లు అందించే ఒకే ఒక్క ఆపరేటర్ ఉండే వారు. ఇప్పుడు వారి సంఖ్య 3కి చేరిందంటూ రాజ్యసభ ఎంపి శ్రీ నబం రెబియా చేసిన ట్వీట్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందించారు.

‘ఆరోగ్యం మరియు వైద్య పరిశోధన’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

March 06th, 10:30 am

ఆరోగ్య సంరక్షణను కోవిడ్ కు ముందు, మహమ్మారి అనంతర యుగం రెండింటి నేపథ్యంలో చూడాలి. ఇలాంటి విపత్తుల నేపథ్యంలో సంపన్న దేశాల అభివృద్ధి చెందిన వ్యవస్థలు కూడా కుప్పకూలుతాయని కరోనా ప్రపంచానికి చాటిచెప్పింది. ఆరోగ్య సంరక్షణపై ప్రపంచం దృష్టి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉంది, కానీ భారతదేశం యొక్క విధానం ఆరోగ్య సంరక్షణకు మాత్రమే పరిమితం కాదు. బదులుగా, మేము ఒక అడుగు ముందుకేసి మొత్తం శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాము. అందుకే మనం ప్రపంచం ముందు 'వన్ ఎర్త్-వన్ హెల్త్' అనే విజన్ను ఉంచాం. మానవులు, జంతువులు లేదా మొక్కలు వంటి జీవులకు సంపూర్ణ ఆరోగ్య సంరక్షణకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాము. కరోనా ప్రపంచ మహమ్మారి కూడా సరఫరా గొలుసు యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. మహమ్మారి తారస్థాయికి చేరిన సమయంలో మందులు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు వంటి ప్రాణరక్షణ వస్తువులు దురదృష్టవశాత్తూ కొన్ని దేశాలకు ఆయుధాలుగా మారాయి. గత కొన్నేళ్ల బడ్జెట్ లో భారత్ ఈ అంశాలన్నింటిపై చాలా దృష్టి సారించింది. విదేశాలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాము. అందువల్ల, ఈ విషయంలో భాగస్వాములందరూ ముఖ్యమైన పాత్ర పోషించాలి.

‘ఆరోగ్యం మరియు వైద్య పరిశోధన’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతరవెబినార్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

March 06th, 10:00 am

‘ఆరోగ్యం మరియు వైద్య సంబంధి పరిశోధన’ అనే అంశం పై ఏర్పాటైన బడ్జెటు అనంతర వెబినార్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. యూనియన్ బడ్జెటు 2023 లో ప్రకటించిన కార్యక్రమాల ను ప్రభావంతమైనటువంటి రీతి లో అమలు పరచడం కోసం ప్రభుత్వం ఆలోచనల ను మరియు సూచనల ను ఆహ్వానిస్తూ ఏర్పాటు చేస్తున్న బడ్జెటు అనంతర వెబినార్ లు పన్నెండిటి లో ఈ వెబినార్ తొమ్మిదో వెబినార్.

ప్రజల భాగస్వామ్యాన్ని వ్యక్తీకరించడానికి ‘మన్ కీ బాత్’ అద్భుతమైన మాధ్యమంగా మారింది: ప్రధాని మోదీ

February 26th, 11:00 am

మిత్రులారా!సర్దార్ పటేల్ జయంతి – అంటే 'ఐక్యతా దినోత్సవం' సందర్భంగా మనం'మన్ కీ బాత్'లో మూడు పోటీల గురించి మాట్లాడుకోవడం మీకు గుర్తుండే ఉంటుంది. దేశభక్తి గీతాలు, లాలి పాటలు, ముగ్గులకు సంబంధించిన పోటీలవి. దేశవ్యాప్తంగా 700లకు పైగా జిల్లాల నుంచి 5 లక్షల మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పిల్లలు, పెద్దలు, వృద్ధులు- అందరూ ఇందులో ఉత్సాహంగా పాల్గొని 20కి పైగా భాషల్లో తమ ఎంట్రీలను పంపారు.ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ నా అభినందనలు. మీలో ప్రతి ఒక్కరూ ఒక ఛాంపియన్, కళా సాధకులు. మన దేశంలోని వైవిధ్యం, సంస్కృతి పట్ల ప్రేమను మీరందరూ నిరూపించారు.