పీఎం-కిసాన్ పథకం కింద 10వ విడత ఆర్థిక ప్రయోజనం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 01st, 12:31 pm
ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన ప్రముఖులు, మాతా వైష్ణో దేవి కాంప్లెక్స్ లో జరిగిన ఘోర ప్రమాదంపై నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తొక్కిసలాటలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నా సానుభూతి. జమ్మూ కాశ్మీర్ పరిపాలనతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడాను. సహాయక చర్యలు, క్షతగాత్రుల చికిత్స కోసం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.‘పీఎం-కిసాన్ పదో విడత నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి
January 01st, 12:30 pm
దేశంలో అట్టడుగునగల రైతుల సాధికారత దిశగా నిరంతర నిబద్ధత, సంకల్పాలకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పీఎం-కిసాన్) పథకం కింద 10వ విడత ఆర్థిక లబ్ధిని విడుదల చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగాగల 10 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు రూ.20,000 కోట్లకుపైగా నిధులు బదిలీ అయ్యాయి. ఇదే కార్యక్రమంలో భాగంగా దాదాపు 351 రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పీవో)లకు ‘వాటా మూలధన సహాయం’ (ఈక్విటీ గ్రాంట్) కింద రూ.14 కోట్లకుపైగా నిధులను కూడా ప్రధాని విడుదల చేశారు. దీనివల్ల దేశంలోని 1.24 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అనంతరం ప్రధానమంత్రి ‘ఎఫ్‌పీవో’ల ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, వ్యవసాయ మంత్రులు, రైతులు ఈ కార్యక్రమంతో సంధానమయ్యారు.ఇన్ ఫినిటీ- ఫోరమ్, 2021 ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
December 03rd, 11:23 am
సాంకేతిక జగతి కి చెందిన, ఆర్థిక జగతి కి చెందిన నా దేశవాసులు, 70 కి పైగా దేశాల నుంచి పాలుపంచుకొంటున్న వేల కొద్దీ వ్యక్తులారా,ఆర్థిక సాంకేతికతపై మేధో నేతృత్వ ‘అనంత వేదిక’ను ప్రారంభించిన ప్రధానమంత్రి
December 03rd, 10:00 am
ఆర్థిక సాంకేతికత (ఫిన్‌టెక్)పై మేధో నేతృత్వ ‘అనంత వేదిక’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ- చరిత్ర అద్భుత పరిణామాన్ని ద్రవ్యం (కరెన్సీ) మన కళ్లకు కడుతుందని ప్రధాని అన్నారు. నిరుడు భారత్‌లో మొబైల్ చెల్లింపులు తొలిసారిగా ఏటీఎం నగదు ఉపసంహరణలను మించిపోయాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. భౌతికంగా ఎలాంటి శాఖా కార్యాలయాలు లేకుండానే డిజిటల్ బ్యాంకులు ఇప్పటికే పూర్తిగా అందుబాటులోకి వచ్చాయని, మరో దశాబ్దంలోగానే ఇవి సర్వసాధారణం కాగలవని పేర్కొన్నారు. “మన లావాదేవీల రూపం కూడా మానవ పరిణామ క్రమం తరహాలోనే మారుతూ వచ్చింది. ఆ మేరకు వస్తు మార్పిడి విధానం నుంచి లోహాలదాకా… నాణేల నుంచి నోట్ల వరకూ.. చెక్కుల నుంచి కార్డులదాకా నేడు ప్రస్తుత దశకు చేరుకున్నాం” అని ఆయన వివరించారు.ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 76వ సమావేశంలో ప్రధాని ప్రసంగం
September 25th, 06:31 pm
అధ్యక్ష పీఠాన్ని అధిరోహించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. మీరు అధ్యక్షులు కావడం అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాలకు ఎంతో గర్వకారణం.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగం
September 25th, 06:30 pm
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76 వ సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రధాని మోదీ తన వ్యాఖ్యలలో, కోవిడ్ -19 మహమ్మారి, తీవ్రవాదం మరియు వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే ప్రపంచ సవాళ్లపై దృష్టి పెట్టారు. మహమ్మారిపై పోరాటంలో ప్రపంచ స్థాయిలో భారతదేశం పోషించిన పాత్రను ఆయన ఎత్తి చూపారు మరియు భారతదేశంలో వ్యాక్సిన్‌లను తయారు చేయమని ప్రపంచాన్ని ఆహ్వానించారు.75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:02 pm
నేడు పవిత్ర ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పర్వదినం సందర్భంగా స్వాతంత్ర్య పోరాట యోధులతోపాటు దేశ రక్షణకోసం నిరంతర త్యాగాలతో అహర్నిశలూ శ్రమిస్తున్న సాహసవీరులకు దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది. స్వరాజ్యం కోసం పోరాటాన్ని సామూహిక ఉద్యమంగా మలచిన పూజ్య బాపూజీ, దేశ విముక్తికోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్; గొప్ప విప్లవ వీరులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్; ఎనలేని సాహస మూర్తులైన ఝాన్సీరాణి లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడినీలు, మాతంగిని హజ్రా; దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, దేశాన్ని అఖండం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్; భారత భవిష్యత్తుకు పథనిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ తదితరులను ఇవాళ దేశం సగౌరవంగా స్మరించుకుంటోంది. ఈ మహనీయులందరికీ జాతి సదా రుణపడి ఉంటుంది.75వ స్వాతంత్ర్య దినం నాడు ఎర్ర కోట మీద నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 15th, 07:38 am
స్వేఛ్చ తాలూకు అమృత్ మహోత్సవ్ అయిన 75వ స్వాతంత్ర్య దినం సందర్భం లో మీ అందరి తో పాటు ప్రపంచం అంతటా ఉంటూ భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి వారందరికి ఇవే శుభాకాంక్షలు.75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశం
August 15th, 07:37 am
దేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో, ప్రధాని మోదీ తన ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేశారు మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందించారు. అతను తన ప్రసిద్ధ నినాదమైన సబ్కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్కా విశ్వాస్ ను చేర్చారు. ఈ గుంపుకు తాజా ప్రవేశం సబ్కా ప్రయాస్.‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాలతో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 12th, 12:32 pm
ఈ రోజు, దేశం తన అమృత్ మహోత్సవ్ స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైనది. రాబోయే సంవత్సరాల్లో, మన స్వావలంబన గల మహిళా శక్తి స్వావలంబన గల భారతదేశానికి కొత్త శక్తిని ఇవ్వబోతోంది. ఈ రోజు మీ అందరితో మాట్లాడటానికి నేను ప్రేరణ పొందాను. కేంద్ర మంత్రివర్గం నుండి నా సహచరులు, గౌరవనీయులైన రాజస్థాన్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, ఎంపి శాసన సహచరులు, జిల్లా పరిషత్ చైర్మన్ మరియు సభ్యులు, దేశంలోని సుమారు 3 లక్షల ప్రదేశాల నుండి కోట్లాది మంది సోదరీమణులు మరియు స్వయం సహాయక బృందాల కుమార్తెలు, ఇతర గొప్ప వారు !‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో మహిళల స్వయం సహాయ సమూహాల తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 12th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్ నారీశక్తి సే సంవాద్’ లో పాల్గొన్నారు. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన- నేశనల్ రూరల్ లైవ్లీ హుడ్స్ మిశన్ (డిఏవై-ఎన్ ఆర్ ఎల్ ఎమ్) లో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మహిళా స్వయం సహాయ సమూహాల సభ్యులతోను, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ తోను ఆయన ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో, వ్యవసాయ సంబంధిత జీవనోపాధుల సార్వజనీకరణ కు సంబంధించిన ఒక వివరణ తో కూడిన పుస్తకాన్ని, దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఎస్ హెచ్ జి సభ్యుల సాఫల్య గాథ ల సంకలన గ్రంథాన్ని ఆవిష్కరించారు.మా ప్రభుత్వ సంస్కరణలు నిర్బంధానికి సంబంధించినవి, బలవంతం కాదు: ప్రధాని మోదీ
August 11th, 06:52 pm
2021 భారత పరిశ్రమల సమాఖ్య వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారతదేశ అభివృద్ధి మరియు సామర్థ్యాల కోసం విశ్వాస వాతావరణాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ప్రధాని మోదీ పరిశ్రమను కోరారు. ప్రస్తుత ప్రభుత్వ విధానంలో మార్పులు మరియు ప్రస్తుత సెటప్ యొక్క పని విధానాలలో మార్పులను గమనించిన ప్రధాన మంత్రి, ఈ రోజు కొత్త భారతదేశం కొత్త ప్రపంచంతో కవాతు చేయడానికి సిద్ధంగా ఉందని నొక్కి చెప్పారు.భారత పరిశ్రమల సమాఖ్య (సి.ఐ.ఐ) వార్షిక సమావేశం - 2021 లో ప్రసంగించిన - ప్రధానమంత్రి
August 11th, 04:30 pm
ఈ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, ఆజాదీ-కా-అమృత్ మహోత్సవ్ మధ్యలో జరుగుతోందని అన్నారు. భారతీయ పరిశ్రమ యొక్క కొత్త తీర్మానాలు మరియు కొత్త లక్ష్యాల కోసం ఇది ఒక గొప్ప అవకాశం అని ఆయన పేర్కొన్నారు. ఆత్మా నిర్భర్ భారత్ ప్రచారం విజయవంతం కావడానికి ప్రధాన బాధ్యత భారతీయ పరిశ్రమలపై ఉందని ఆయన అన్నారు. మహమ్మారి సమయంలో పరిశ్రమల రంగం స్థిరంగా నిలబడినందుకు ప్రధాన మంత్రి ప్రశంసించారు.ఆగస్టు 2న ‘ఇ-రుపీ’ డిజిటల్ ఉపకరణానికి ప్రధాని శ్రీకారం
July 31st, 08:24 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 ఆగస్టు 2వ తేదీన వ్యక్తి-నిర్దిష్ట ప్రయోజన డిజిటల్ చెల్లింపు ఉపకరణం ‘ఇ-రుపీ’ (e-RUPI)ని వీడియో కాన్ఫరెన్స్ సదుపాయంద్వారా ప్రారంభించనున్నారు. దేశంలో డిజిటల్ కార్యక్రమాలకు ప్రధానమంత్రి సదా మార్గదర్శనం చేస్తూ వచ్చారు. ఆ మేరకు కొన్నేళ్లుగా ప్రభుత్వం-లబ్ధిదారు మధ్య లీకేజీ భయం లేకుండా పరిమిత మధ్యేమార్గాలతో ప్రయోజనాలు అందించడం లక్ష్యంగా అనేక కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎలక్ట్రానిక్ ఓచర్ సుపరిపాలన ఆదర్శాన్ని మరింత ముందుకు నడపననుంది.