ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి ప్రసంగపాఠం

September 10th, 12:01 pm

దేశం కోసం, బిహార్ కోసం, గ్రామీణ జీవనాన్ని మరింత సులభతరం చేసేందుకు, వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మత్స్య సంపద, పాడి, పశుపోషణతోపాటు వ్యవసాయ రంగంలో విస్తృత అధ్యయనం, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పథకాన్ని ప్రారంభించడం, జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా బిహార్ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

బిహార్ లో పిఎం మత్స్య సంపద యోజన, ఇ-గోపాల యాప్ లతో పాటు అనేక ఇతర కార్యక్రమాలను కూడా ప్రారంభించిన ప్రధాన మంత్రి

September 10th, 12:00 pm

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బిహార్ లో ‘పిఎం మత్స్య సంపద యోజన’, ‘ఇ-గోపాల యాప్’ లతో పాటు చేపల ఉత్పత్తి కి సంబంధించిన అధ్యయనాలు, పరిశోధనలే కాకుండా అనేక ఇతర కార్యక్రమాలను కూడా వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

మ‌త్స్య సంప‌ద యోజ‌నను సెప్టెంబ‌ర్ 10 న ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

September 09th, 01:58 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య సంప‌ద యోజ‌న ను డిజిట‌ల్ విధానంలో సెప్టెంబ‌ర్ 10 న ప్రారంభించ‌నున్నారు. అలాగే , రైతులకు నేరుగా ఉప‌యోగ‌ప‌డే స‌మాచారాన్ని అందించిచే, బ్రీడ్ మెరుగుద‌ల మార్కెట్ ప్లేస్ పోర్ట‌ల్ ఈ -గోపాల యాప్‌ను కూడా ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించ‌నున్నారు. బీహార్‌లో మ‌త్స్య, ప‌శుగ‌ణాభివృద్ధి రంగానికి సంబంధించి ప‌లు కార్య‌క‌లాపాల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించ‌నున్నారు.