The World This Week on India

December 24th, 11:59 am

India’s footprint on the global stage this week has been marked by a blend of diplomatic engagements, economic aspirations, cultural richness, and strategic initiatives.

The World This Week on India

December 17th, 04:23 pm

In a week filled with notable achievements and international recognition, India has once again captured the world’s attention for its advancements in various sectors ranging from health innovations and space exploration to climate action and cultural influence on the global stage.

కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

December 07th, 05:52 pm

పవిత్రమైన కార్యకర్ సువర్ణ మహోత్సవం సందర్భంగా, భగవాన్ స్వామి నారాయణుని పాదాలకు వినమ్రతతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. గురు హరి ప్రగత్ బ్రహ్మ స్వరూపమైన ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి ఈ రోజు. ఆయనకు కూడా భక్తితో నమస్కరిస్తున్నాను. పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్ చేస్తున్న నిర్విరామ కృషి, అంకిత భావం ద్వారానే భగవాన్ స్వామి నారాయణుడి బోధనలు, ప్రముఖ్ స్వామి మహరాజ్ తీర్మానాలు ఈ రోజు నిజరూపం దాలుస్తున్నాయి. లక్ష మంది వాలంటీర్లు, యువత, చిన్నారులు భాగం పంచుకుంటున్న ఈ అద్బుతమైన సాంస్కృతిక కార్యక్రమం విత్తనం, చెట్టు, ఫలం అనే భావనను అందంగా సూచిస్తోంది. నేను అక్కడ ప్రత్యక్షంగా లేనప్పటికీ, ఈ కార్యక్రమ ఉత్సాహాన్ని, శక్తినీ నా హృదయం అనుభూతి చెందుతోంది. ఇంత గొప్ప దైవిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరమ పూజ్య గురు హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, మహనీయులైన సాధువులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వినయంగా నమస్కరిస్తున్నాను.

అహమదాబాద్ లో కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

December 07th, 05:40 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహమదాబాద్‌లో ఏర్పాటైన కార్యకర్ సువర్ణ మహోత్సవ్‌ను ఉద్దేశించి దృశ్య మాధ్యమం ద్వారా ఈ రోజు ప్రసంగించారు. సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, మొదట పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, ఆరాధనీయులైన సాధు సంతులకు, సత్సంగి కుటుంబ సభ్యులకు, ఇతర ప్రముఖులకు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. కార్యకర్ సువర్ణ మహోత్సవ్ సందర్భంగా భగవాన్ స్వామి నారాయణ్ చరణాలకు శ్రీ మోదీ ప్రణామాన్ని ఆచరించారు. ఈ రోజు ప్రముఖ్ స్వామి మహారాజ్ 103వ జయంతి సందర్భం కూడా అని ప్రధాని గుర్తుకు తీసుకువచ్చారు. భగవాన్ స్వామి నారాయణ్ ప్రబోధాలు, ప్రముఖ్ స్వామి మహారాజ్ సంకల్పాలు పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌ కఠోర శ్రమతో, అంకితభావం తో నెరవేరుతున్నాయని కూడా శ్రీ మోదీ అన్నారు. సుమారు ఒక లక్షమంది కార్యకర్తలతోపాటు యువతీయువకులు, బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం ఇదెంత భారీ కార్యక్రమమో చెప్పకనే చెబుతోందని, దీనిని చూడడం తనకు సంతోషాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు. తాను సభాస్థలిలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఈ కార్యక్రమంలో ఉత్సాహాతిరేకం ఏ స్థాయిలో వెల్లువెత్తుతోందీ తనకు తెలుస్తూనే ఉందన్నారు. పరమ పూజ్య గురు శ్రీ హరి మహంత్ స్వామి మహారాజ్‌కు, సాధువులందరికీ ఈ భవ్య దివ్య కార్యక్రమానికిగాను ఆయన తన అభినందనలను అందజేశారు.

టీబీ వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాలపై దృష్టి సారిస్తూ 100 రోజుల ప్రత్యేక ప్రచారం ఈరోజు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన ప్రధానమంత్రి

December 07th, 02:38 pm

టీబీ వ్యాధిని నివారించే దిశగా భారత్ సాగిస్తున్న పోరాటం ఇప్పుడే బలపడుతుందని వివరిస్తూ, ఈ వ్యాధి ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రధాన దృష్టి సారించి 100 రోజుల ప్రత్యేక ప్రచారాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా రాసిన కథనాన్ని చదవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi

November 21st, 08:00 pm

Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.

గయానా పార్లమెంటునుద్దేశించి భారత ప్రధానమంత్రి ప్రసంగం

November 21st, 07:50 pm

గ‌యానా పార్లమెంటు జాతీయ అసెంబ్లీలో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రసంగించారు. అలా ప్రసంగించిన మొదటి భారత ప్రధానమంత్రి ఆయనే. ఈ ప్రసంగం కోసం స్పీకర్ శ్రీ మంజూర్ నాదిర్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

జమైకా ప్రధానితో సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

October 01st, 12:00 pm

ప్రధానమంత్రి శ్రీ హోల్నెస్‌, ఆయన ప్రతినిధి బృందాన్ని భారత్‌కు స్వాగతించడం నాకు సంతోషంగా ఉంది. ఇది ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. అందుకే ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యముంది. చాలా కాలంగా ప్రధాని హోల్నెస్ భారతదేశానికి మిత్రులుగా కొనసాగుతున్నారు. చాలా సార్లు ఆయనను కలిసే అవకాశం నాకు లభించింది. ఆయనను కలిసిన ప్రతిసారీ భారత్‌తో సంబంధాల బలోపేతం పట్ల ఆయనకు గల నిబద్ధతను ఆయన ఆలోచనల ద్వారా నేను గ్రహించాను. ఆయన పర్యటన మన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త శక్తిని ఇవ్వడమే కాకుండా మొత్తం కరీబియన్ ప్రాంతంతో మన బంధాన్ని పెంపొందిస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

The entire country is overjoyed because of the outstanding performance of our athletes in the Asian Games: PM Modi

October 10th, 06:25 pm

The Prime Minister, Shri Narendra Modi addressed the contingent of Indian athletes who participated in the Asian Games 2022 at Major Dhyan Chand Stadium in New Delhi today. He also interacted with the athletes. India won 107 medals including 28 gold medals in the Asian Games 2022 making this the best performance in terms of the total number of medals won in the continental multi-sport event.

ఆసియా క్రీడోత్సవాలు 2022లో పాల్గొన్న భారత అథ్లెట్లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి

October 10th, 06:24 pm

ఆసియా క్రీడోత్సవాలు 2022లో పాల్గొని దేశానికి విజయులై తిరిగి వచ్చిన భారత అథ్లెట్లనుద్దేశించి న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వారితో ప్రధానమంత్రి సంభాషించారు. ఆసియా క్రీడోత్సవాలు 2022లో భారతదేశం 107 పతకాలు గెలుచుకుంది. వాటిలో 28 స్వర్ణ పతకాలున్నాయి. ఖండాంతర క్రీడా కార్యక్రమంలో భారతదేశం సాధించిన అత్యధిక పథకాలు ఇవే.

స్వాధీనం చేసుకొన్న 1,44,000 కిలోగ్రాముల మత్తు పదార్థాల నుధ్వంసం చేసిన చరిత్రాత్మక కార్యసాధన ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

July 17th, 10:21 pm

జప్తు చేసినటువంటి 1,44,000 కిలోగ్రాముల మత్తు పదార్థాల ను ధ్వంసం చేయడం ద్వారా భారతదేశం మాదకద్రవ్యాల నిర్మూలన దిశ లో సాధించినటువంటి చరిత్రాత్మక కార్యసాధన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.

సమాజం లో మత్తుమందుల బెడద ను అంతం చేయడం కోసం జరుగుతున్న కృషి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

April 20th, 10:06 am

సమాజం లో మత్తుమందు ల బెడద ను అంతం చేయడం కోసం జరుగుతున్న ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

తమిళ నూతన సంవత్సర వేడుకల్లో ప్రధాన మంత్రి ప్రసంగం

April 13th, 08:21 pm

మీ అందరికీ తమిళ పుత్తండు శుభాకాంక్షలు! నా తమిళ సోదరసోదరీమణుల ప్రేమానురాగాల కారణంగానే ఈ రోజు మీతో తమిళ పుత్తండు జరుపుకునే అవకాశం నాకు లభించింది. ప్రాచీన కాలంలో పుతాండు అనేది కొత్తదనం యొక్క పండుగ! ఇంత ప్రాచీన తమిళ సంస్కృతి, ప్రతి సంవత్సరం పుత్తండు నుంచి కొత్త శక్తితో ముందుకు సాగే ఈ సంప్రదాయం నిజంగా అద్భుతం! ఇదే తమిళనాడుకు, తమిళ ప్రజలకు ఎంతో ప్రత్యేకం. అందువలన, ఈ సంప్రదాయం పట్ల నాకు ఎల్లప్పుడూ ఆకర్షణతో పాటు దానితో భావోద్వేగ అనుబంధం ఉంది. నేను గుజరాత్ లో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన మణినగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తమిళ సంతతికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉండేవారు. వారే నా ఓటర్లు, నన్ను ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిని చేస్తారు. వారితో గడిపిన క్షణాలను నేనెప్పుడూ ఆస్వాదిస్తాను. తమిళనాడుపై నాకున్న ప్రేమను తమిళనాడు ప్రజలు పెద్ద ఎత్తున పంచుకోవడం నా అదృష్టం.

తమిళ నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న ప్రధాని

April 13th, 08:20 pm

తమిళనాడు వాసి, కేంద్రమంత్రివర్గ సహచరుడైన శ్రీ ఎల్. మురుగన్ నివాసంలో జరిగిన తమిళ సంవత్సరాది వేడుకలలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.