డా. పియరీ సిల్వాన్ ఫిల్యూజట్ మృతికి ప్రధాని సంతాపం

December 31st, 02:38 pm

డాక్టర్ పియరీ సిల్వాన్ ఫిల్యూజట్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. సంస్కృతాధ్యయనానికి ప్రాచుర్యం కల్పించడంలోనూ.. ముఖ్యంగా సాహిత్యం, వ్యాకరణ రంగాల్లోనూ ఆయన చేసిన కృషి ఎప్పటికీ నిలిచి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.