జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యుల సముదాయాన్ని ఉద్ధేశించి ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 01st, 03:01 pm
నమస్కారం! జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ చాలా శుభాకాంక్షలు! డాక్టర్ బిసి రాయ్ జ్ఞాపకార్థం జరుపుకునే ఈ రోజు మన వైద్యులు మరియు వైద్య సౌభ్రాతృత్వం యొక్క అత్యున్నత ఆదర్శాలకు చిహ్నంగా ఉంది. గత ఒకటిన్నర సంవత్సరాలలో మన వైద్యులు దేశప్రజలకు సేవ చేసిన విధానం ఒక ఉదాహరణ. 130 కోట్ల మంది దేశ ప్రజల తరఫున దేశ వైద్యులందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.జాతీయ వైద్యుల దినం నాడు డాక్టర్ల ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 01st, 03:00 pm
ఈ రోజు న, వైద్యుల దినం సందర్భం లో, వైద్య సముదాయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ రోజు ను, మన వైద్య సముదాయం తాలూకు అత్యున్నత ఆదర్శాల ప్రతీక గా ఉన్న డాక్టర్ బి.సి. రాయ్ స్మృతి లో, జరుపుకొంటున్నాం అని ప్రధాన మంత్రి అన్నారు. కరోనా తాలూకు గత ఒకటిన్నర సంవత్సరాల కఠిన కాలం లో వైద్యులు అందించిన సేవల కు 130 కోట్ల మంది భారతీయుల పక్షాన ప్రధాన మంత్రి డాక్టర్ల కు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు న ఇండియన్ మెడికల్ ఎసోసియేశన్ (ఐఎమ్ఎ) వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.