జిఎస్టి మన ప్రజాస్వామ్యం యొక్క బలం ప్రదర్శిస్తుంది: ప్రధాని మోదీ

June 20th, 07:24 pm

లక్నోలో ప్రధాని నరేంద్ర మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీ మోదీ భారతదేశ యువతకు తాజా టెక్నాలజీతో అనుసంధానం చేయడం గురించి మాట్లాడారు. జులై 1 వ తేదీ నుండి అమలు కానున్న జిఎస్టి గురించి కూడా ప్రధానమంత్రి మాట్లాడారు, ఇది ప్రజాస్వామ్య బలం నిరూపించగలదని అన్నారు. జిఎస్టి అమలు యొక్క గొప్పదనం భారతదేశం యొక్క 125 కోట్ల మందికి వెళ్తుంది.అని ప్రధాని అన్నారు.

ఉత్తరప్రదేశ్లోని లక్నోలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోదీ

June 20th, 07:19 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించారు. లక్నోలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులకు లబ్దిపత్రాలు అందించారు మరియు 400 కి.వి.ల లక్నో-కాన్పూర్ డి / సి ట్రాన్స్మిషన్ లైన్ జాతికి అంకితమిచ్చారు.

నేడు లక్నో సందర్శించనున్న ప్రధాని, రేపు యోగా దినోత్సవ కార్యక్రమం లో పాల్గొంటారు

June 20th, 12:31 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు లక్నో సందర్శిస్తారు, అక్కడ ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొని రేపు జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.